శ్రీ వరవరముని దినచర్య

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

mamunigal-srirangamఅళగియ మణవాళ మామునిగళ్, శ్రీరంగ దివ్య క్షేత్రము

eRumbiappA-kAnchiఎరుంబియప్పా, కాంచీపురం

అవతారిక:

“శ్రీ వరవరముని దినచర్య”,  శ్రీ దేవరాజ గురుచే రచింపబడిన ఒక గొప్ప గ్రంధము. శ్రీ దేవరాజ గురునే “ఆచార్య ఎరుంబియప్పా” అని కూడా పిలుస్తారు. వీరు ప్రఖ్యాతి గాంచిన కవి,రచయిత. మణవాళ మామునుల సత్సంప్రదాయ అష్టదిగ్గజాలనే  ప్రధాన శిష్యులలో ఒకరు.   వీరు మణవాళ మామునులను భగవంతుని గా భావించి , వరవరముని కావ్యం,  వరవరముని ఛంపు,  వరవరముని శతకములను మొదలగు  గ్రంథములను  రచించారు.  పిళ్ళైలోకం జీయర్లు రచించిన యతీంద్ర ఫ్రణవ ఫ్రభావములో వీరి జీవిత చరిత్ర కూడా ఉన్నది.  వీరు మామునుల సమకాలీనులు. వరవరముని కాలములో 1370 నుండి  1443 నివసించారు. ” శ్రీ వరవరముని దినచర్యై,”  వీరి రచనలలో గొప్ప గ్రంథము. ఇందులో మామునులు ప్రాత: కాలమున లేచినది మొదలు రాత్రి విశ్రమించేవరకు వారి కార్యక్రమములను వర్ణించారు.ఇది మూడు భాగములుగా ఉన్నది. ఫుర్వ దినచర్యై,  యతిరాజవింశతి , ఉత్తర దినచర్యై.  పేర్లను బట్టి అందులోని విషయము రేఖా మాత్రముగా తెలుస్తున్నది. యతిరాజ వింశతి ని అనుసంధానము చేస్తూ శ్రీ రామానుజ వారి ఆరాధనము చేసె వారు కాబట్టి , ఆ గ్రంథమును మధ్యన చేకూర్చారు.

“వాధూల వీరరాఘవ శసూరి”,  అని పిలువబడే శ్రీ ఊ.వె. తిరుమళిశై అణ్ణావప్పంగార్ స్వామి,  260 సంవత్సరాల క్రితము ఈ గ్రంథానికి వ్యాఖ్యానమును రాశారు. దాని ఆధారముగా   శ్రీ ఊ.వె.టి.ఆర్.క్రిష్ణమాచార్య స్వామి తిరుపతి వారు,  తమిళములో వ్యాఖ్యానమును రాశారు. వాటి ఆధారముగానే ఈ రచన సాగుతున్నది.

TAKSwamiశ్రీ ఊ.వె.టి.ఆర్.క్రిష్ణమాచార్య స్వామి, తిరుపతి

తనియన్:

సౌమ్యజామత్రు యోగినంద్ర చరణాంబుజ షట్పదం |
దేవరాజ గురుం వందే దివ్యజ్ఞాన ప్రదం శుభం ||

మామునులనే తామరలో తుమ్మెదలా తేనెను గ్రోలిన  దేవరాజ గురు శ్రీ పాదాలకు ఇదే సాష్టాంగ నమస్కారములు చేస్తున్నాను. అంతే కాదు తనను ఆశ్రయించిన వారికి బ్రహ్మ ఙ్ఞానమును బోధించి ఉజ్జీవింపచేసిన సహృదయులు వీరు.

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2015/05/sri-varavaramuni-dhinacharya-tamil/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment