పూర్వ దినచర్య – శ్లోకం 12,13 – భవంత,త్వదన్య

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 11

శ్లోకం 12

భవంత మేవ నీరన్థ్రం పశ్యన్ వశ్యేన చేతసా!

మున ! వరవర స్వామిన్! ముహూస్త్వామేవ కీర్తయన్!!

ప్రతి పదార్థము:

స్వామిన్ వరవర___తమరి సొత్తైన దాసుడి మీద తమరే అభిమానము చూపే స్వామిత్వము గల మణవాళ మామునులే……!

మునే___దాసుడిని స్వీకరించేందుకు ఉపాయమును మననము చేయు మహానుభావా!

భవంత మేవ___దేహ సౌందర్యము, మనో సౌశీల్యము గల దేవర వారు..

నీరన్థ్రం ___ఎడతెగక

పశ్యన్_____కటాక్షించి

వశ్యేన చేతసా__(తమరి కృ ప వలన దాసుడికి) వశపడిన మనసుతో

తవామేవ___స్తోత్రము చేయతగ్గ తమరిని

ముహూ___తరచుగా

కీర్తయన్___స్తోత్రము చేసుకుంటాడు(అహం_దాసుడు)

శ్లోకం 13

త్వదన్య విషయస్పర్శ విముఖై రఖిలేంద్రియైః!

భవేయం  భవదుఃఖానాం మసహ్యనామనాస్పదమ్!!

ప్రతి పదార్థము:

త్వదన్య విషయస్పర్శ విముఖై___దేవర వారి కంటే వేరైన శబ్దాది విషయములందు పరాముఖుడైన

అఖిలేంద్రియై___కర్మేంద్రియములు, ఙ్ఞానేంద్రియముల వలన

అసహ్యనాం___సహించలేని

భవదుఃఖానాం___ జన్మ వలన కలిగిన దుఃఖములకు

అనాస్పదం___కేంద్రము కాకుండా

భవేయం__దాసుడ ఉండుగా

భావము

త్రికరణ శుద్దిగా అనగా కంటితో ఆచార్యునే చూస్తూ, నోటితో స్తుతిస్తూ, కరచరణములతో వారి సేవ చేస్తూ కాలము గడిపితే మోక్షము పొందటానికి అర్హత కలుగుతుంది. ఇప్పటి దాకా తమ ఇంద్రియములు లోకములోని శబ్దాది విషయములందే లయించి వుండటము వలన సంసారములో తాననుభవించిన దుఃఖములు ఇక ముందు కలుగకుండా వుండాలని మామునులను ఎఱుంబిఅప్పా ప్రార్థిస్తున్నారు. ఇక్కడ “పశ్యన్”,” కీర్తయన్” అనే రెండు ప్రత్యయాలకు చూచుటవలన, స్తుతించుట వలన అన్న అర్థమును స్వీకరించ వలసి వుంది.

తరువాతి పాదములో ” భవ దుఃఖానాం అనాస్పదం భవేయం ” అనే పాదముతో అన్వయించు కోవాలి. భవేయం _ అన్న లోట్ ప్రత్యయమునకు ప్రార్ధన అనే అర్థమును అన్వయించుకోవాలి. దేవర వారినే చూస్తూ వుండటము , స్తోత్రము చేస్తూ వుండటము వలన, ఇతర శబ్దాది విషయములను వదిలి  దేవర వారినే సేవించటము వలన మోక్షము  పొందుటకు అర్హుడనవుతున్నాను. ఆచార్యుని చూచుట , స్తొత్రము చేయుట వలన, పరమాత్మ హృదయములో ప్రీతిని పొంది, శిష్యుడు మోక్షమును పొందుట ,   శిష్యుడు సంసార దుఖఃమునకు హేతువు కాకుండుట  ఆచార్య దర్శనము, ఆచార్య స్తొత్రము కారణమని గ్రహించాలి.

ఇంద్రియములు ఎదో ఒక విషయమును ఆశ్రయించకుండా వుండవు కదా! అందు వలన,  మామునులే! దాసుడి సకలేంద్రియములు దేవర వారి విషయములోనే నిమగ్నమై   వుండేవిధముగా మొక్షమును పొందు అర్హత అనుగ్రహించ గలరు. నీచమైన శబ్దాది విషయములకు లోను కాకుండా , మరల మరల జన్మించు క్లేశమును తొలగించవలెను. కర్మేంద్రియములు, ఙానేంద్రియములన్నీ భగవద్భాగవత కైంకర్యములలోనే ఎల్లప్పుడు నిమగ్నమై వుండాలి. లౌకికమైన నీచ విషయములలో  నిమగ్నమై వుండరాదని శాండిల్య  స్మృతి , భారద్వాజ పరిశిష్టం మొదలగు ధర్మ శాస్త్రములు తెలుపుతున్నవి.

ఇప్పటి దాకా చూసిన శ్లోకములు వరవరముని దినచర్యకు ఉపోద్ఘాతము మాత్రమే.   ఇక్కడనుండి చెప్పబోవు ఐదు కాలములలో చేయ వలసిన అభిగమనం, ఉపాదానం, ఇజ్జ,  స్వాధ్యాయం,  యోగం  అనే ఐదు అంశములలో   ఇజ్జ తప్ప మిగిలిన నాలుగు అంశములు వివరింపబడినవి.  అభిగమనం పెరుమాళ్ళను సేవించుట, “పత్యుః పదాం భుజం ద్రష్టు మయంత మవిదూరతః”(2)అని జగపతి అయిన అళగియ మణవాళుని సేవించటము కోసము మామునులు కోవెలకు వెళ్ళటమును ఉటంకించటము వలన సూచింప బడినడి.  పెరుమాళ్ళకు సమర్పించ వలసిన ద్రవ్య సేకరణ , ఆత్మ లాభాత్ పరం కిఞ్చిత్ అన్యన్నాస్తీతి నిశ్చయాత్! ఇమం జనం_ అఙీకర్తు మివ ప్రాప్తం(11) అని పరమాత్మకు జీవాత్మకు దాసుడై పరమాత్మను పొందుటయే పరమ ప్రయోజనమని తెలుపుతున్నారు. అందుకనే మామునులు దాసుడిని అనుగ్రహించటము కోసమే అక్కడికి వేంచేశారని భావిస్తున్నారు. మామునులు పరమాత్మకు సమర్పించ వలసిన ఎఱుంబిఅప్పాను స్వీకరించుటే  ఉపాదానమని సూచింపబడింది. స్వాధ్యాయము  అనగా వేద మంత్రములను పఠించుట.  ఇది ” మంత్ర రత్నాను సంథాన సంతత స్ఫురితాధరం (9) అని వేద మంత్రములలో ఉన్నతమైన ద్వయమును నిరంతరము అనుసంధానము చేయు అధరాల కదలికతో సూచింప బడినది.  ఇక యోగ మనేది భగవత్ విషయమైన ధ్యానము. ఇది “తదర్థతత్వ నిధ్యాన సన్నధ్ధ పులకోధ్గమం” అని ద్వయ మంత్రార్థమైన పిరాట్టి పెరుమాళ్ళు మొదలగు  అనే అర్థములో  , భగవత్ రామానుజమునులను ధ్యానము చేయుట  సూచితము.  ఇక్కడికి పైన చెప్పిన ఐదు  అంశములలో నాలుగు వివరింపబడినవి. కావున ఈ ఉపోద్ఘాతము పై నాలుగింటికి సంగ్రహముగా అమరి వున్నవి. ” పెరుమళ్ళను దర్శిచుట, ఆరాధించుటకు కావలసిన ద్రవ్యములను సేకరించుట ,  ఆరాధించుట, వేద మంత్రాధ్యయనము చేయుట, ధ్యానము  చేయుట  మొదలగు ఐదు అంశములతో పొద్దు పుచ్చాలని భారద్వాజ మునులు  చెప్పియున్నారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2016/03/purva-dhinacharya-12-13/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

 

Leave a Comment