శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్లోకం 16
తతః ప్రత్యుషసి స్నాత్వా కృత్వా పౌర్వాహ్ణికీః క్రియాః!
యతీంద్ర చరణ ద్వన్ద్వ ప్రవణేనైవ చేతసా!!
ప్రతి పదార్థము:
తతః =దాని తరవాత
ప్రత్యుషసి = అరుణోదయ కాలములో
స్నాత్వా = స్నానము చేసి
పౌర్వాహ్ణికీః = ప్రాతః కాలములో చేయ వలసిన
క్రియాః = క్రియలు అనగా శుధ్ధ వస్త్రమును ధరించుట, సంధ్యావందనాది కార్యములు
యతీంద్ర చరణ ద్వన్ద్వ ప్రవణేన ఏవ = యతిరాజులైన ఉడయవర్ల శ్రీపాదముల చెంత తమకున్న ప్రవనతను
చేతసా = చేతలలో
కృత్వా = ప్రకటించి
భావము:
ప్రత్యుషః: అరుణోదయ కాలములో , అనగా సూర్యోదయమునకు ముందు నాలుగు ఘడియల కాలము , నాలుగు ఝాములల రాత్రిలో చివరి ఝాము…. ఈ శ్లోకములో చెప్పిన స్నానాధికములు ,కిందటి శ్లోకములో పేర్కొన్న గురుపరంపర,పెరుమాళ్ యొక్క ఆరు స్థితులు మొదల్గు వానిని ధ్యానించుటకు మధ్యన చేసుకునే దేహ శుధ్ధి, దంత శుధ్ధిగా గ్రహించాలి. మునుపు ఆరు,ఏడు,ఎనిమిది, శ్లోకములో చెప్పిన కాషాయమును ధరించుట ,ఊర్ధ్వ పుండ్రములను ధరించుటను ,తులసి మాల , తామర పూసల మాల ధరించుట కూడా ఇక్కడ కలిపి చూడాలి. ఆచార్యులే సర్వస్వమని భావించు శిష్యులు ,పరమాత్మ తానే ఆచార్య రూపములో అవతరిస్తారన్న శాస్త్రముననుసరించి , ఆచార్య రూపములో పరమాత్మ ముఖోల్లాసము కోసము నిత్య ,నైమిత్తిక కర్మలను ఆచరిస్తారు. మామునులు ఉడయవార్ల శ్రీ పాదముల మీద భక్తి నిండిన మనసుతో ఇవన్నీ అనుష్ఠిస్తున్నారని గ్రహించాలి.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-16/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org