శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్లోకం 28
తతః స్వచారణాంభోజ స్పర్శ సంపన్నసౌరభైః।
పావనైరర్థిన స్తీర్థైః భావయంతం భజామి తం ।।
ప్రతిపదార్థము:
తతః = దివ్యప్రబంధ సారమును ఉపదేశించిన తరువాత
స్వచారణాంభోజ స్పర్శ సంపన్నసౌరభైః = తమ శ్రీపాద పద్మ సంబంధము వలన మంచి సువాసనతో కూడిన
పావనైః = మిక్కిలి పరిశుధ్ధమైన
తీర్థైః = శ్రీపాద తీర్థమును
అర్థినః = స్వీకరించుటకు ఇవ్వమని ప్రార్థిస్తున్న శిష్యులు
భావయంతం = వర్థిల్లునట్లుగా
తం = ఆ మామునులను
భజామి = నమస్కరిస్తున్నాను
భావము:
మామునులు దివ్య ప్రబంధ సారమునుపదేశించిన తరవాత తమ శిష్యుల కోరిక మేరకు తమ శ్రీపాద తీర్థమును వారికి ఇచ్చి వారిలో సత్తను పెంపొందిస్తున్నారని ఈ శ్లోకములో చెపుతున్నారు.
రామానుజులు ఈ భువిపై వేంచేసి లేనందున వారి ఉపకరణముగా తమను భావించిన మామునులు రామానుజులనే మనసు నందు నిలుపుకొని శిష్యులకు తమ శ్రీపాద తీర్థమును ఇచ్చినందున వారికి ఎటువంటి అవధ్యము లేదు. ఇక్కడ శిష్యుల కోరికే ప్రధాన కారణము. మామునుల శ్రీపాదములు , తామరల వంటివి కావున ఆ శ్రీపాద తీర్థమునకు శుచి,సువాసన సహజముగానే అబ్బినవి.’ తీర్థైః ‘ అని బహు వచనములో చెప్పుట వలన ముమ్మారు శ్రీపాద తీర్థమును అనుగ్రహించారని భోదపడుతున్నది. ఈ విషయముగా ‘ త్రిబిదేత్ ‘ ..ముమ్మారు శ్రీపాద తీర్థమును గ్రహించ వలెను ‘ అని స్మృతిలో చెప్పబడింది. కొందరు రెండు తడవలు మాత్రమే ఇస్తున్నారు. ఉచన స్మృతిలో శ్రీపాద తీర్థమును -యాగములో సోమలతా పాన సమముగా రెండు తడవలు స్వీకరించ తగినదని చెప్పుటే దీనికి ప్రమాణము. రెండు పద్దతులు శాస్త్ర సమ్మతమే కావున వారి వారి సంప్రదాయము ప్రకారము అనుష్ఠించుట తప్పు కాదు. భరద్వాజ సమ్హితలో శిష్యుడు ఆచార్యుని వద్ద ఉపదేశము పొందుటకు ,ఆచార్య శ్రీపాద తీర్థామును స్వీకరించుట అంగముగా చెప్పబడినది. క్రిందట శ్లోకములో దివ్యప్రబంధ సారమును ఉపదేశించుట పేర్కొన బడింది.అక్కడ ‘ నమామి ‘ అన్న వారు,ఇక్కడ శ్రీపాద తీర్థమును పొంది మనసు కరిగి ‘భజామి ‘అంటున్నారు.ఇంతకంటే శిష్యుడు చేయతగినది ఏమీ లేదు. మామునులు కోరు వారు కారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-28/
archived in http://divyaprabandham.koyil.org
pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org