శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్లోకం 30
తతఃశ్చేత స్సమాధాయ పురుషే పుష్కరేక్షణే ।
ఉత్తంసిత్ కరద్వందం ఉపవిష్ఠముపహ్వరే ।।
ప్రతిపదార్థము:
తతః = సాపాటు తరువాత
పుష్కరేక్షణే = తామరకన్నులవారైన
పురుషే = పరమ పురుషుడైన శ్రీరంగనాథుని వద్ద
శ్చేఅతః = తమ అభీష్టమును
స్సమాధ్యాయ = విన్నవించి
ఉత్తంసిత్కరద్వందం = చేతులు జోడించి నమస్కరించి
ఉపహ్వరే = ఏకాంతముగా
ఉపవిష్ఠం = పద్మాసనములో కూర్చొని వున్న మణవాళ మామునులను సేవించుకుంటున్నాను అని ఈ శ్లోకములో చెపుతున్నారు.
భావము:
తదీయారధన తరువాత భగవధ్యానము చేయాలని శాస్త్రము తెలుపుతున్నది. యోగము ఆరాధాన వంటిది. మూడు వేళల తప్పక చేయ వలసినది అని చెపుతున్నారు.. యోగులు తమ హృదయములో వేంచేసి వున్న పరమాత్మను , చంచలము లేని నిశ్చల మనసుతో ధ్యానించుటే యోగమవుతుంది. పరమాత్మ దేవతలు, మనుష్యులు, జంగమములు, స్థావరములు మొదలగు సకల జీవరాసులలోను వ్యాపించివున్నాడు. ఆ స్థితినే శ్రీ మాహా విష్ణువు యొక్క అంతర్యామి స్థితి అంటారు. ఇటువంటి స్వరూపములోనే యోగుల హృదయములో వేంచేసి వున్నాడని పరాశరులు చెప్పారు. యోగుల హృదయములో వేంచేసి వున్న పరమాత్మ , సూర్యమండలములో ఉన్న పరమాత్మ ఒక్కరే అని తైత్తరీయోపనిషత్తులో పేర్కొన బడింది. సూర్యమండలములో ఉన్న పరమాత్మకు పుండరీకాక్షత్వము ఉన్నదని చాందోద్యోగము చెపుతున్నది. అందువలననే ఇక్కడ ‘ పురుషే పుష్కరేక్షణే ‘ యోగులైన మామునుల హృదయములో వేంచేసివున్న పరమపురుషునకు పుండరీకాక్షత్వము చెప్పబడింది. పురిసేతే—–యోగి శరీరములో వసించు వాడు అనే వ్యుత్పత్తి వలన పురుష శబ్దము పరమ పురుషుడైన విష్ణువునే సూచిస్తున్నది. యుజి-సమాతౌ-అనే ధాతువు చేత వచ్చిన యోగ శబ్దము సమాది అవుతున్న పరమాత్మ ధ్యానమును తెలుపుతున్నది.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-30/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org