శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్లోకం 11
ఆత్మలాభాత్పరం కించిద్ అన్యన్యాస్తితి నిశ్చ్యాత్
అంగీకర్తుమివ ప్రాప్తం ఆకించనమిమం జనం
ప్రతి పదార్థము:
ఆత్మలాభాత్ : పరమాత్మకు జీవాత్మను తన దాసుడిగా చేసుకోవటము కంటే
అన్యత్ కించిద్ : అన్యమైన పని
పరం నాస్తితి : ఉన్నతమైన విషయము వేరే లేదు
ఇతి నిశ్చ్యాత్ : ఇదే నిశ్చయమైనదని
ఆకించనం : ఇతర సాధనములేవీ లేని వాడు
ఇమం జనం : (దానికి బదులుగా సకల దుర్గుణములు కల ) దాసుడిని
అంగీకర్తుం : (దిద్దుబాటు చేసి శ్రీలక్ష్మి నాథుడి దాసుని గావించుటకు )అంగీకరించుటకు
ప్రాప్తమివ : (దాసుడు ఎదురు చూడ కుండానే) దాసుడి ముందు ప్రత్యక్షమైనట్లు…….
భావము :
కిందటి శ్లోకములోని మందహాసము, కరుణ పొంగే కన్నులు , మధుర సంభాషణ మొదలగు వానిని చూసి దాసుడు ఈ రకముగా ఊహించుకుంటున్నాడు. దాసుడు కోవెలకు వచ్చే సమయానికే తాను కూడా వచ్చినది దాసుడిని కరుణించటము కోసమే. మందహాసము చిందించుతూ, కరుణ పొంగే కన్నులతో, మధుర సంభాషణము గావించారేమో. మామునులతో కలయిక తనకు యాదృచ్చికము కాదు. వారి కృప మాత్రమే కారణము. జన–ఈ భూమిలో పుట్టిన వాడు , ఆకించన—- గుణములేవీ లేని వాడు, ఇమమ –(అయం) (స్వరమును బట్టి వస్తువును పొందుట)-సమస్త దోషములకు మూలమైన వాడిని —భూమికి భారముగా ,కంటకముగా, వుండటమే కాక జన్మకు సాధనమైన దోషములను తొలగించు కోవటము , గుణములను పొందటము అన్న న్యాయమునకు కట్టు పడని పాపాత్ముడను అని నైచ్యానుసంధానము చేసుకుంటున్నారు. అంతే కాక ఇటువంటి వాడిపై కృప చూపుతున్న మామునుల మహాత్మ్యము ఎంత గొప్పదని ఆశ్చర్య పోతున్నారు. ప్రాప్తమివ —- ఇక్కడ ,మివ అని ఉత్ప్రేక్షలో చెపుతున్నారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2016/03/purva-dhinacharya-11/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org