పూర్వ దినచర్య – శ్లోకం 24 – దేవిగోదా యతిపతి

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 23

శ్లోకం 24

దేవిగోదా యతిపతిశఠద్వేషిణౌ రంగశృంగం సేనానాథో విహగవృషభః  శ్రీనిధిసింధుకన్యా |

భూమానీళాగురుజనవృతః  పురుష  శ్చేత్యమీషాం అగ్రే నిత్యం వరవర మునే అంఘ్రియుగ్మం ప్రపద్యే ||

ప్రతి పదార్థము:

దేవిగోదా = దైవ స్వరూపమైన గోదా దేవి

యతిపతిశఠద్వేషిణౌ = యతిపతులైన శ్రీమద్రామానుజులు,శఠకోపులైన నమ్మాళ్వార్లు

రంగశృంగం = శ్రీరంగమని పేరు గాంచిన గర్భగృహము యొక్క ఉత్తర దిక్కు విమానము

సేనానాథః = విష్వక్సేనులు

విహగవృషభః = పక్షి రాజైన గరుత్మంతుడు

శ్రీనిధి = శ్రీమహాలక్ష్మికే నిధి అయిన శ్రీరంగనాథుడు

సింధుకన్యా = పాలా సముద్రుడి ముద్దు బిడ్డ

భూమానీళా గురుజనవృతః = భూదేవి,శ్రీదేవి ,నీళాదేవి, నమ్మాళ్వర్లాది పరిజనముచే కూడిఉన్న

పురుషః చ = పరమ పద నాథుడు

ఇతి యమీషాం అగ్రే = మొదలైన అందరి ముందు

వరవరమునేః = వరవరమునులు

అంఘ్రియుగ్మం = శ్రీపాద యుగళములకు

నిత్యం = ప్రతిదినము

ప్రపద్యే = నమస్కరిస్తున్నాను

భావము:

మణవాళమామునులు శ్రీరంగ క్షేత్రములో బ్రహ్మద్వారము (నాన్ముగన్ కోట్టై)  నుండి లోపలికి ప్రవేశించి ప్రదక్షిణము చేస్తున్న క్రమములో  శ్రీ ఆండాళ్, శ్రీ రామానుజులు,నమ్మాళ్వార్లు, శ్రీరంగవిమానము,విష్వక్సేనులు,గరుత్మంతుడు, శ్రీరంగ నాథుడూ, శ్రీరంగ నాచ్చియార్ మొదలగు వారిని సేవించుకున్నారు. తరవాత పరమపద నాథ సన్నిధిలో వేంచేసి వున్నశ్రీభూనీళా నాయికలతోనూ, నమ్మాళ్వార్లాది ఆళ్వార్లతో కూడి యున్న పరమపద నాథుని సేవించుకొని వస్తున్నప్పుడు…ఒక్కొక్క సన్నిధిలోనూ తాము మాత్రము మణవాళమామునులనే సేవించుకున్నట్లు ఎఱుంబియప్పా చెపుతున్నారు.దీనికి కారణ మేమిటీ? వారందరిని తన ఆత్మ తృప్తి కోసము కాక తమ ఆచార్యులకు ఇష్ఠమని తాముము సేవింకుంటున్నారని ఇక్కడ ప్రస్తావించుటలేదు. ఎఱుంబియప్పా  ఆచార్య పరతంత్రులు కావున ఆచార్యులే వారికి మనోభీష్ఠము అందువలన వారిని మాత్రమే సేవింకుంటున్నారు. అర్చా రూపములో  శ్రీమన్నారాయణుని సేవించుకునే ముందు వారి పరివారమును ఆళ్వారాదులను.ఆచార్యులను తప్పక సేవించుకోవలని  భరద్వాజసమ్హిత  చెప్పుతున్నది. శ్రీ  ఆండాళ్ ‘అహం శిష్యా చ దాసీ చ భక్తా చ పురుషోత్తమా ‘అని వరాహ మూర్తి వద్ద నివేదించుకొన్నది.తాను శిష్యురాలని, దాసినని, భక్తురాలని నివేదించుకుంటుంది. భూదేవి  అవతారము కావునను , ఆళ్వార్లగోష్ఠిలో ఒకరై,  గురువు గాను సేవించతగినది. శ్రీ భూనీళాదేవి,  పెరియ పిరాట్టియార్ అయిన శ్రీ రంగనాచ్చియార్ శ్రీ రంగనాథుని పత్నుల గోష్ఠిలో చేరుతారు. అలా మామునులు సపరివార సమేతంగా శ్రీరంగనాథునుని మంగళశాసనం చేసి వస్తున్నప్పుడు  ఎఱుంబియప్పా వారందరి ముందు మణవాళమామునులనే సేవించుకున్నారని ఈ శ్లోకములో తెలుపబడినది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-24/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment