శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్లోకం 7
అంభోజ బీజ మాలాభిః అభిజాత భుజాంతరం!
ఊర్ధ్వ పుడ్రైః ఉపశ్లిష్టం ఉచిత స్థాన లక్షణైః!
ప్రతి పదార్థము:
అంభోజ బీజ మాలాభిః = తామర్ పూసలచే చేయబడ్డ మాలలతో
అభిజాత భుజాంతరం = అలంకరింప బడిన భుజములు, ఉన్నతమైన హృదయ పీఠము గలవారు
ఉచిత స్థాన లక్షణైః = శాస్త్ర యుక్తమైన అవయవ సౌందర్యమును కలిగి యున్న
ఊర్ధ్వ పుండ్రైః = ఊర్ధ్వ పుండ్రములతోను
ఉపశ్లిష్టం = అలరారుచున్న వారైన
భావము:
ఉన్నతమైన హృదయ పీఠము , యఙ్ఞోపవీతమును, నాభిని మొదలగు వానిని వర్ణించిన తరవాత హృదయ పీఠమునలంకరించిన తామర పూసలచే చేయబడ్డ మాలలతో అలరారుతున్న అందమును, ఊర్ధ్వ పుండ్రముల శోభను వర్ణిస్తున్నారు. విష్ణు నామమును గాని, విష్ణు భక్తుల నామమును గాని ధరించాలని భరధ్వాజమునులు చెప్పియున్నారు. అలాగే పరాశరులు యఙ్ఞోపవీతమును, శిఖను, ఊర్ధ్వ పుండ్రములను, తామర పూసల మాలలను, ధరించాలని , బ్రాహ్మణులు పట్టు వస్త్రమును,యతులు కాషాయమును ధరించాలని చెప్పిన మాటలను మామునులు అనుసంధానము చేసినట్లు వర్ణించారు. బ్రహ్మపురాణ వచనము ననుసరించి తామర మాలలు,తులసి మాలలు , పట్టుతో చేయబడిన వివిధ రంగుల పవిత్రములు ధరించారని మాలాభిః అన్న బహు వచనము చేత అర్థమవుతున్నది.
శ్రీ పంచారాత్ర పరాశర సంహిత,బ్రాహ్మణులు తిరుమణ్ కాప్పు ఎట్లు ధరించ వలనో ఈ విధంగా చెప్పు చున్నది : ముక్కు చివరి లో ఒక అంగుళం రేఖ దిద్ది మరియు నుదిటి మధ్య భాగము నుంచి ఇరు వైపుల ఒకటిన్నర అంగుళము వదిలి ఒక అంగుళం రేఖ గీయ వలెను. తిరుమణ్ ముక్కు నుని నుండి మొదలు పెట్టి నుదిటి పైన వరకు పెట్టుకోవలనేని పద్మ పురాణము సూచిస్తుంది. కను బొమ్మల మధ్య నుండి రేఖల మధ్య రెండు అంగుళములు స్థలము వదిలి ఒక అంగుళము వెడల్పు తో రెండు రేఖలు గీయ వలెను. విష్ణు క్షేత్ర లో నుండి మట్టి తీసుకొని , తిరుమంత్ర తో మంత్రించి , తిరుమణ్ కాప్పు ను ముఖము పై , శరీరము పై పన్నెండు చోట్ల ధరించాలి.ఎరుమ్బియప్ప తిరుమణ్ కాప్పు అనగా శ్రీ చూర్ణం కూడా సూచిస్తున్నారు. శ్రీ దేవి కి అత్యంత ప్రియమైన పసుపు తో శ్రీ చూర్ణమును చేసి తిరు మణ్ గుర్తుల మధ్య దరించ వలెను.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-7/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org