పూర్వ దినచర్య – శ్లోకం 6 – మృణాళ

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 6

మృణాళ తంతుసంతాన  సంస్థాన ధవళద్విషా!

శోభితం యఙ్ఞసూత్రేణ నాభి బింబ సనాబినా!

 ప్రతి పదార్థము:

మృణాళ తంతుసంతాన  సంస్థాన ధవళద్విషా! _ తామర తూడులోని పోగుల వంటి మేని ఛాయ గల విగ్రహమును

నాభి బింబ సనాభినా! _ గుండ్రని నాభి దేశముతోనూ

యఙ్ఞసూత్రేణ _  యఙ్ఞోపవీతము తోనూ

శోభితం  _  శోభించు చుండు

భావము:

ఎఱుంబిఅప్పా  ఈ శ్లోకములో హృదయ సీమనలంకరించిన యఙ్ఞోపవీతము   శోభను వర్ణించుచున్నారు. కొంగొత్త తెల్లని దారములతో  చక్కగా నిర్మింపబడిన  యఙ్ఞోపవీతమునే ధరించాలని చెప్పిన దత్తాత్రేయుని వాక్యమును ఇక్కడ స్మరించుకోవాలి.  సన్యాసులు ఎప్పుడు  యఙ్ఞోపవీతము, పళ్ళు, జలము పవిత్రము తెల్లగా ఉంచుకోవాలి. ఉపవీతం, బ్రహ్మ సూత్రం,సూత్రం, యఙ్ఞోపవీతం, యఙ్ఞసూత్రం ,దేవలక్ష్యం అనే పేర్లుగల దారముల సమూహమే యఙ్ఞోపవీతము అని మహాఋషులు చెపుతారు . “యఙ్ఞసూత్రేణ ” అనటము వలన యతులకు ఒక్క  యఙ్ఞోపవీతము,  బ్రహ్మచారులకు మౌంజిసహిత ఏక  యఙ్ఞోపవీతము, గృహస్తులకు, వానప్రస్తులకు ఉత్తరీయము కోసము ధరించే  యఙ్ఞోపవీతము ఒకటి  అదనముగా చేరుతుంది అని వ్యాసుల వారు, భరద్వాజులు తెలిపియున్నారు. ఇక్కడ వీరు సన్యాసి కావున ఏక  యఙ్ఞోపవీతమును ధరించారు. అది నాభి   దాకా ఉండి  శోభిల్లుతున్నదని చెపుతున్నారు.   యఙ్ఞోపవీతము నాభికి పైన ఉంటే ఆయుః క్షీణము ,   నాభికి కింద ఉంటే తపో క్షీణము అందువలన నాభి వరకు ఉండటము విశేషమని  ఋషి వాక్యము  అని చెపుతారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-6/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment