ఉత్తర దినచర్య శ్లోకం 8 – అగ్రే పశ్చాదుపరి

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 7

శ్లోకము

అగ్రే పశ్చా దుపరి పరితో భూతలం పార్శ్వతో మే 

మౌళౌ వక్త్రే వపుషి సకలే మానసామ్భోరుహే చ !

పశ్యన్ పశ్యన్ వరవరమునే ! దివ్యమంఘ్రిద్వయం తే 

నిత్యం మజ్జన్నమృత జలధౌ నిస్తరేయం భవాబ్ధిమ్ !!

ప్రతిపదార్థము:

హే వరవరమునే ! = స్వామి వరవరముని 

తే = తమరి 

దివ్యం = దివ్యమైన 

అంఘ్రి ద్వయం = శ్రీపాద జంట 

అగ్రే = ముందర 

పశ్చాత్  = వెనుక 

భూతలం పరితః = భూమి నలువైపులా 

మే పార్శ్వతః = దాసుడి ఇరుపక్కల 

మౌళౌ = తలలోపైన  

వక్త్రే = ముఖముపైన 

సకలే వపుషి = సమస్త శరీరభాగాలలోను  

మానసామ్భోరుహే చ = హృదయ కమలములోను 

పశ్యన్ పశ్యన్ = ఎడతెగని స్పష్టమైన చూపులు

అమృత జలధౌ = అమృతమయమైన కడలిలో 

మజ్జన్ = మునిగి 

భవాబ్దిమ్ నిస్తరేయం = జనన మరణ చక్రాన్ని దాటాలని కోరుకుంటున్నాను.

భావము:

“ గురుపాదాంభుజం ధ్యాయేత్ గురోరన్యం నభావయేత్ “ (ప్రపంచ సారం ) (ఆచార్యుల శ్రీపాదాలను ధ్యానించాలి ఆచార్యులను తప్ప ఇతరములను ధ్యానించరాదు.)అన్న ప్రమాణమును ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒక కడలిలో మునిగిపోతున్నవాడు మరొక కడలిని దాటడానికి ప్రయత్నించటం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఆచార్యుల  దివ్యమైన శ్రీపాదాలను ధ్యానం చేస్తున్న భావనాప్రకర్ష యొక్కమహిమవలన సకలము సాధ్యమే అవుతుంది. ఇందులో అ సాధ్యమేది లేదు అంటున్నారు ఆచార్యభక్తాగ్రేసులైన ఈ వ్యాఖ్యాత అయిన తిరుమళిశై అణ్ణావప్పంగార్ స్వామి .

‘భగవతా ఆత్మీయం శ్రీమత్ పాదారవిందయుగళం శిరసి కృతం ధ్యాత్వా అమృత సాకారంతర్నిమగ్న సర్వావయవ సుఖమాసీత ‘ (భగవంతుడి శ్రీపాదారవిందయుగళం తన శిరశ్శు మీద ఉంచినట్లుగా భావన చేసి ఆనందమయమైన అమృతసాగరంలో సమస్త అవయవములు మునిగిఉండటం వలన అంతులేని సుఖమును అనుభవించవచ్చు ) అని శ్రీవైకుంఠగద్యంలో భగవద్రామానుజాచార్యులు భగవంతుడి పరంగా చెప్పగా ఇక్కడ వీరు ఆచార్య పరంగా చెప్పారు. 

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-8/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org


Leave a Comment