శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్లోకము
కర్మాధీనే వపుషి కుమతిః కల్పయన్నాత్మభావం
దుఃఖే మగ్నః కిమతి సుచిరం దూయతే జంతు రేషః !
సర్వం త్యక్త్వా వరవరమునే ! సంప్రతి త్వత్ప్రసాదాత్
దివ్యం ప్రాప్తుం తవ పదయుగం దేహి మే సుప్రభాతమ్ !!
ప్రతిపదార్థము:
హే వరవరమునే = వరవరముని స్వామి
ఏషః జంతుః = మీ దాసుడైన ఈజీవాత్మ
కర్మాధీనే = కర్మవశమున
వపుషి = తన దేహములో
ఆత్మభావం = ఆత్మభావాన్ని
కల్పయన్ = తలంచి
కుమతిః = దుర్బుద్ధిగలవాడై
దుఃఖే మగ్నః = సంసారసాగరమనే దుఃఖసముద్రంలో మునిగినవాడై
కిం దూయతే = ఎందుకువచ్చాడు
ఇతి (మద్వా )= అని తమరుతలంచి
సర్వం(దాసుడు ) = సంసారదుఃఖం మొదలైన వాటిని
త్యక్త్వా = వదలి
సంప్రతి = ఇప్పుడే
తవ దివ్య పదయుగం ప్రాప్తుం = తమరి దివ్య పాదయుగళములను చేరటానికి అనువుగా
త్వత్ప్రసాదాత్ = తమరి అనుగ్రహము వలన
మే = దాసుడికి
సుప్రభాతమ్ = పొద్దు పొడుపుగా
దేహి = అనుగ్రహించాలి
భావము:
‘ కర్మాధీనే ’ అని ప్రారంభించి , ‘ దూయతే జంతు రేషః ‘ అన్న వరకు ఉన్న మొదటి రెండు పాదాలు మామునులు తమ శిష్యులను గురించి విచారించవలసిన విషయాన్ని తెలియజేస్తున్నాయి.
ఇక్కడ ఇతి ,మత్వా కలసి ‘ త్యక్త్వా’ గా చెప్పబడింది. ఇప్పటిదాకా తమరిశ్రీపాదాలను అనుభవించలేని కాలము ప్రళయరాత్రి . ఇక ఇప్పుడు తమరిశ్రీపాదాలను అనుభవించబోవు కాలము దాసుడికి శుభోదయము అవుతుంది. తమరికి ఉన్న సహజ సిద్దమైన కారుణ్యగుణముతో ఈ కాలమును అజ్ఞాన తిమిరము నుండి బయటపడి జ్ఞానోద యమును పొందే శుభోదయముగా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను.
అడియేన్ చూడామణి రామానుజ దాసి.
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-9/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org