ఉత్తరదినచర్య – స్లోకం – 3 – సాయంతనం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 2

శ్లోకం 3

సాయంతనం తతః క్రుత్వా సమ్యగారాధనం హరేః |
స్వైః ఆలాభైః శుభైః శ్రోత్రున్నందయంతం నమామి తం ||

ప్రతి పదార్థం

తతః =  సంధ్యావందనము చేసిన తరువాత
సాయంతనం = సాయంకాలము చేయవలసిన
హరేః ఆరాధనం = తమ స్వామి అయిన శ్రీరంగ నాధులకు ఆరాధనము
సమ్యగ్ = చక్కగా, పరమ భక్తితో
క్రుత్వా   = చేసి
శుభైః = శ్రోతలకు మేలు కలిగే విధముగా
స్వైః = అలతి అలతి మాటలతో
శ్రోత్రున్ = శ్రోతలకు
న్నంతయంతం = ఆనందము కలుగు విధముగా
ఆలాపైః = చెప్పే
తం = ఆ మామునులను
నమామి =  నమస్కరిస్తున్నాను

భావము

శ్రీవచన భూషణములోని అంతరార్థములను అధికరించిన వారెవరు?ఎవరు దానిని అనుష్టిస్తారు? అని ఉపదేశరత్న మాలలో 55వ పాశురములోఅ అన్నట్లు శ్రీవచనభూషణమును అర్థము చేసుకోవటానికి ,అర్థము చేసుకున్న దానిని అనుష్టించటానికి అనువుగాని గంభీరమైన విషయమున్న గ్రంధాన్ని, శిష్యులకు సుబొధకముగా చెప్పినప్పటికీ శ్రోతలకు కొంచెము కఠినముగానే వుండవచ్చును. కానీ సాయంత్రము  సంధ్యావందనము, అనుష్టానము ముగిసిన తరువాత చేసే ప్రవచనము అసంకల్పితముగానే సరళముగా సాగుతుంది. దీనినే స్వైరాలాభము అంటారు. సకల శాస్రములను మధించినప్పటికీ అతి సులభముగా మాట్లాడటమును  స్వైరాలాభము అంటారు. ఇక్కడ ‘ హరి ‘ అన్న ప్రయోగము పూర్వదినచర్యలో పదిహేడవ శ్లోకములో ప్రస్తావింపబడిన ‘ రంగనిధి ‘ అన్న తమ తిరువారాధన పెరుమాళ్ళయిన  శ్రీరంగనాధులు.  ‘ హరి ‘ అంటే ఆశ్రితుల విరోధులను నిరసించువాడని, సకల దేవతలను నియమించువాదని అర్థము కధా!   పూర్వదినచర్యలో ‘ అథరంగనిధి ‘ (17)  అని ఉదయపు ఆరాధనను ,  ‘ ఆరాధ్యశ్రీనిధిం ‘ (29)  అని మధ్యహ్న్నపు ఆరాధనను , ఈ శ్లొకములో సాయంత్రపు ఆరాధనను పేర్కొనటము జరిగింది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-3/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

Leave a Comment