పూర్వ దినచర్య – శ్లోకం 25 – మంగళాశాసనం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 24

శ్లోకం 25

మంగళాశాసనం కృత్వా తత్ర తత్ర యథోోచితం ।

ధామ్నస్తస్మాద్వినిష్టక్రమ్య  ప్రవిశ్య స్వం నికేతనం ।।

ప్రతిపదార్థము:

తత్ర తత్ర = ఆండాళ్ మొదలు కొని పరమపద నాథుని వరకు గల అర్చా మూర్తులను

మంగళాశాసనం = (ఉన్న లోపాలన్ని తొలగి)అన్నీ మంగళములే జరగాలని ప్రార్థించుట

యథోోచితం = ఆ విషయాలలో తమ ప్రీతికి తగినట్లుగా

కృత్వా = చేసి

తస్మాద్ధామ్న = ఆయా సన్నిధుల నుండి

వినిష్టక్రమ్య = వెళ్ళ వలసి వచ్చినందులకు చింతిస్తూ బయలుదేరి

స్వం నికేతనం = తమ మఠమునకు

ప్రవిశ్య = వెళ్ళారు.

భావము:

మామునులు ఆండాళ్ మొదలు కొని పరమపద నాథుని వరకు గల అర్చా మూర్తులను మంగళాశాసనము చేసేది వేరొక ప్రయౌజనమునాశించి కాక పెరుమాళ్ళకు మంగళాశాసనము చేయడమే పరమ ప్రయోజనముగా భావించారు. అది కూడా రామానుజుల అభీష్ఠము మేరకే వారిని సంతోషింప జేసేందుకే చేసారు. మంగళాశాసనము చేయడములో తేడాలు ఉండవచ్చన్న భావనతో ‘ యథోోచితం ‘అన్నారు .అనగా వారివారి శక్తి మేరకు అని తెలుపుతున్నారు. ” అనగ్నిః అనికేతఃస్యాత్ “(సన్యాసులు అగ్నితో హోమము చేయుట , స్థిరముగా ఒక చోట ఉండుట కూడదు )అనేది శాస్త్రము విధించిన నియమము.  “స్వయం నికేతనం ప్రవిశ్య ” అని చెప్పారు కదా? అంటే శ్రీరంగనాథులే మామునులకు అక్కడ ఒక నివాసము నేర్పాటు చేసి ఉండమని ఆఙ్ఞాపించుట వలన తప్పు లేదని వెలడిస్తున్నారు. ” వినిష్క్రమ్య ”  శ్రీరంగనాథుని వదిలి వెళ్ళుటకు మనసు రావటం లేదు కాని మఠంలో  తిరువారాధన,  గ్రంథ కాలక్షేపము మొదలైన తరువాతి కైంకర్యములు,చేయవలసి వున్నందున బయలు దేరారని  చెపుతున్నారు.

అడియే చుడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-25/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment