ఉత్తరదినచర్య – స్లోకం -1 – ఇతి యతికుల

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

$3B72773B15A9C344

శ్లోకం 1

ఇతి యతికులధుర్యమేధమానైః స్మృతిమధురైరుతితైః ప్రహర్షయంతం |
వరవరముని మేవ చింతయంతీ మతిరియమేతి నిరత్యయం ప్రసాదం ||

ప్రతి పదార్థం:

ఇతి = శ్రీమాధవాంఘ్రి అని ప్రారంభించివిజ్ఞాపనం అన్న దాకా మత్తము
ఏతమానైః = ఇంకా ఇమకా పెరుగుతున్నది
స్మృతిమధురైః  = చెవికింపైన
ఉదితైః = మాటల వలన
యతికులదుర్యం = యతులకు నాయకులైన ఎంబెరుమానార్లను
ప్రహర్షయంతం = మిక్కిలి ఆనందమునునిచ్చునది
వరవరముని మేవ = మణవాళమామునులనే
చింతయంతీ = చింతన చేస్తూ
ఇయమేతి = దాసుడి బుధ్ధి
నిరత్యయం = నిరంతరము
ప్రసాదం = ప్రకాశమును
ఏతి = పొందుతున్నది

భావము:

ఇప్పటి దాకా తగని విషయాలలో సంచరిస్తూ అది దొరకలేదని దుఃఖిస్తూ గడిపిన దాసుడి బుధ్ధి యతిరాజ వింశతిని అనుగ్రహించిన మామునులనే స్మరించే స్థితికి చేరుకున్నది. కావున మునుపు ఉండిన సంచలనము వీడి స్తిమిత పడిందని ఎరుంబియప్ప చెపుతున్నారు.’ వరవరముని మేవ ‘ అనటము వలన తమ మనసు  స్తిమిత పడటానికి కారణము  యతిరాజులు కాక , వారిని కీర్తించిన మామునులని చెపుతున్నారు. భగవంతుడినో,భాగవతులనో, అచార్యులనో స్మరించటము కంటేఅ అచార్య పరతంత్రులైన మామునులను స్మరించటము వలన తేటదనము ఎక్కువ ,అది స్థిరముగా నిలుస్తుంది అని ఎరుంబియప్ప చెపుతున్నారు. కేవలము ఇరవై శ్లోకాలలో’ఏతమానైః ‘అని ఎంతో గొప్పగా కీర్తించటము ఎంబెరుమానార్లను మనసులో నిలుపుకోవటము వలననే సాధ్యమంటున్నారు. మామునులను చెప్పిన ఒకొక్క శ్లోకమును ఎంబెరుమానార్లు వెయ్యిగా భావిస్తారు కదా! ఆవ గింజనే అనంతమైన కొండగా భావించే వారు కదా మహానుభావులు!

‘ ప్రహర్షయంతం ‘ అన్న ప్రయోగములో ‘ హర్షయంతం ‘ అన్న పదమునకు ‘ ప్ర ‘ అనే ఉప సర్గతో కూడిన విశేషణమును చేర్చటము వలన ఎంబెరుమానార్ల విషయములో మామునులు స్వప్రయోజనము కోసమే తప్ప అన్య లాభములకు కాదని స్పష్టమవుతున్నది. ‘చింతయంతిం ‘ అనటము వలన శ్రీ కృష్ణుడినే తలచిన ‘చింతయంతి ‘ అనే గోపిక కంటే, ‘ దీర్గ చింతయంతి ‘అయిన నమ్మళ్వార్ల కంటే, ఈ మామునులు ఎంబెరుమానార్లనే స్మరించు ‘చింతయంతి ‘అని తేలుప పడుతున్నది. ఎంబెరుమాన్లను స్మరించు వారి కంటే  ఎంబెరుమానార్లను స్మరించు వారు ఉన్నతులు.

‘ స్మృతిమధురైరుతితైః ‘ అన్న చోట,- రుతితైః – ధుఃఖమును తెలియజేస్తున్నది.యతిరాజ వింశతిలో ‘ అల్పాపిమే ‘(6) అని ప్రారంభించి చాలా చోట్ల తమ అజ్ఞానమును, భక్తి లోపమును, పాపకర్మలలో మునుగి వుండటము మొదలైన వాటిని ఎత్తి చూపి , హా హంత హంత – ఐయ్యో ,ఐయ్యో, ఐయయ్యో, అని తమ ధుఃఖాతిశయమును తెలిపారు.ఆత్మ స్వరూపమునకు ప్రకాశమునిచ్చు  ధుఃఖము ఔన్నత్య హేతువే అగుట వలన రుతితైః – అన్న పదమునకు ధుఃఖము అను అర్థమును స్వీకరించుట న్యాయమే అవుతుంది. మొక్షాధికారి అయిన ఎంబెరుమానార్లకు మామునులు చెప్పు సంసార పరమైన ధుఃఖములు వీనుల విందే అవుతుందనటములో సందేహము లేదు.అందు వలన అది స్మృతి మధురైః అని గ్రహించాలి.

(యతిరాజ వింశతిలో సంస్కృతములో ధుఃఖించగా ఆర్తి ప్రబంధములో ద్రావిడములో ధుఃఖించారు. )

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-1/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

Leave a Comment