ఉత్తర దినచర్య శ్లోకం 10 – యా యా

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 9

శ్లోకము 

యా యా వృత్తిః మనసి మమ సా జాయతాం సంస్మృతి స్తే 

యో యో జల్ప స్స  భవతు విభో నామ సంఙీర్తనం తే  !

 యా యా చేష్టా వపుషి భగవన్ ! సా భవేత్ వందనం తే 

సర్వం భూయాత్ వరవరమునే ! నైన సంయగారాధనం తే !!

ప్రతిపదార్థము:

హే వరవరమునే = స్వామి వరవరముని !

మమ = పురాకృతకర్మాధీనమైన దాసుడి బుద్ది

జాయతాం = దురాలోచనలకు స్థానంగా ఉండవచ్చునా  ! 

సా వృత్తిః = ఆయా బుద్దులన్నీ  

తే = తలచినంతనే సంతోషాన్ని కలిగించే తమరి 

సంస్మృతిః = మంచి స్మృతికి హేతువైన  

జాయతాం = ఉండాలి

హే విభో = స్వామీ! 

మే = దాసుడికి 

యో యో జల్పః = ఏ ఏ విషయాలలో 

జాయతాం = ఎటువంటి జ్ఞానం కలగవలసి వుందో 

సః = ఆయా విషయాలలో

తే = కీర్తిమంతులైన తమరి గురించిన  

జల్పః = మంచి విషయాలు రూపోదిద్దుకోవటానికి 

జాయతాం = అనుకూలించాలి 

హే భగవన్ = ఓ స్వామి! 

మమ = దాసుడి (దేహం) దాసుడు  

వపుషి = నిరంతరం నిరర్థకమైన  ఏదో ఒక కార్యంలో నిమగ్నమై వుండే దాసుడి దేహం 

యా యా చేష్టా = ఆయా చేష్టలను 

తే = కీర్తిమతులైన తమరికి  

వందనం = కైంకర్యముచేసి  నమస్కరించేవిగా  

జాయతాం = రూపొందుగాక 

సర్వం = ఇప్పటిదాకా చేసిన విన్నపాలన్నీ  

తే = తమరి 

సంయగారాధనం = ప్రీతికి పాత్రమైన ఆరాధనగా 

భూయాత్ = రూపుదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను.

భావము:

             దాసుడికి పురాకృత కర్మవశమున మనసులో కలిగే దురాలోచనలను తమరి కృపాకటాక్షము వలన పోగొట్టి ఆస్థానంలో తమరి గురించే నిరంతరం చింతన చేసేవిధంగా అనుగ్రహించాలి. నోటి నుండి వెలువడే దుర్భా షలు కూడా తొలగిపోయి దానికి బదులుగా తమరి నామసంకీర్తనము చేసేభాగ్యమును కలుగచేయాలి. దేహము చేసే దుశ్చర్యల స్థానంలో తమరికి దాసోహములు సమర్పించగలగాలి అని ప్రార్థి స్తున్నాను.

           ‘ జాయతాం ‘ అన్న ప్రయోగము ప్రతి వాక్యానికి అన్వయిం చటం జరిగింది . ‘ జాయతాం ‘ అన్నశబ్డం లోట్ ప్రత్యయంతమైనది. దానికి అనేక అర్థాలు ఉన్నాయి .ఇక్కడ మొదట అర్హత అన్న అర్థంలోను, తరువాత ప్రార్థన అన్నఅర్థంలోను ప్రయోగించారు. ఇంకా దాసుడి మనసులోని జ్ఞానమంతా తమరి గురించిన చింతనగా ,నోటి నుండి వెలువడే తమరి నామ సంకీర్తనముగా , దేహము చేసేదుశ్చర్యలు తమరి కైంక ర్యముగా అమరాలి అన్న అర్థాన్నిస్తుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-10/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org


Leave a Comment