పూర్వ దినచర్య – శ్లోకం 21 – సాక్షాత్ఫ లై

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 20

శ్లోకం 21

సాక్షాత్ఫలైక లక్ష్యత్వ ప్రతిపత్తి పవిత్రితం  |
మంత్రరత్నం ప్రయచ్ఛంతం వందే వరవరంమునిం ||

ప్రతి పదార్థం:

సాక్షాత్ఫల  =  భగవన్మంగళాశాసనమే ద్వయ మంత్రోపదేశానికి ముఖ్య ప్రయోజనము
ఏక లక్ష్యత్వ ప్రతిపత్తి పవిత్రితం =  (మామునులు) ఆ ఒక్క లక్ష్యమునే (భగవన్మంగళాశాసనమే ఉద్దేశించి ఉపదేశము ) చేయుట ద్వారా ప్రతిపత్తి పవిత్రత ను  పొందుతుంది
మంత్రరత్నం = మంత్రములలో రత్నము వంటి ద్వయ మంత్రము
ప్రయచ్ఛంతం = ఉపదేశిస్తున్న
వరవరమునిం = వరవరమునులకు
వందే = ప్రణామములు సమర్పిస్తున్నాను

భావము:

శిష్యులకు ద్వయ మంత్రోపదేశము చేయుట ద్వారా  , తమ శిష్యులు సరిదిద్దబడి భగవన్మంగళాశాసనము చేస్తారనే భావము తో మామునులు ఉపదేశిస్తారు .అలా వారి తలంపే వారి ఉపదేశమునకు పవిత్రతను కలిగిస్తుంది.మామునులు తమకు అలాగే ఉపదేశించారని ఎఱుంబిఅప్పా తెలియ జేస్తున్నారు.

పైన చెప్పినట్లుగా కాక 1.ధనము,శుశ్రూష మొదలైన కొరకో 2.శిష్యుడు మోక్షమును పొందాలనో,3. తానొక శిష్యుడిని సరిదిద్ది, తద్వారా పెరుమాళ్ కైంకర్యము గావించుటకో, 4.తన ఏకాంతమును పోగొట్టుటకు శిష్యుడు తనతో సహవాసము చేయుటకో, ద్వయ మంత్రమును ఉపదేశిస్తే, అటువంటి ఉపదేశమునకు పవిత్రత తగ్గుతుందని ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నారు.
ఆచార్యులకు ఈ లోకములో జీవించి ఉన్న కాలములో ధనమో, శుశ్రూషో అవసరము కాదా!?
శిష్యుడు మొక్షమునుంపొందనవసరము లేదా?!
ఆచార్యులు భగవంతుడికి కైంకర్యము చేయనవసరము లేదా?!
మంచి శిష్యులతో ఆచార్యులకు సహవాసమవసరము లేదా?!
ఇవన్నీ మంచి విషయాలే కదా!చెడు విషయాలు కావే!
ఆచార్యులు చేయు ద్వయోపదేశమునకు ఎందువలన పవిత్రత తగ్గుతుంది,అనే ప్రశ్న తలెత్తడము సహజము.దానికి సమాధానము ఆచార్యుని పట్ల శిష్యునకు ఉండ వలసిన శేషత్వము ద్వారా నెరవేరుతుంది. ఎట్లనగా , శిష్యుడు చేతనైనంత ధనమును సమర్పించి,శుశ్రూష చేస్తే కాని శిష్యునికి ఉన్నత గతులందవని తలంపే మొదటి ప్రయోజనము చేకూర జేస్తుంది.ఎవరైనా తనవద్దకు వస్తారా అని ఎదురు చూస్తూ, వారి రాకకై ఒక శిష్యుడిని ఆచార్యుని వద్దకు చేర్చి,ద్వయోపదేశము గావించే పరమాత్మ సంకల్పము వలన రెండవ ప్రయోజనము నెరవేరుతుంది.”వీడు మన శిష్యుడు. మంచి ఉపదేశము చేసి భగవన్మంగళాశాసనము చేయునట్లు సరిదిద్దాలి ” అని భావించుట భగవత్కైంకర్యము కాదా!చాలా కాలముగా ‘అహం,మమ ‘ అనే అహంకార ,మమకారముల వలన సత్తను పోగొట్టుకున్న దాసుడికి మంత్రోపదేశము చేసి భగవన్మంగళాశాసనమునకు పాత్రుడిని చేసి, మహోపకారము చేసిన ఆచార్యును ఒక్క నాటికి విడిచి వుండరాదు అని కృతఙ్ఞత కలిగి వుండే శిష్యుడి వలన, శిష్య సహవాసము అబ్బుతుంది.అందు వలన ఆచార్యుడు శిష్యుడికి చేసే ద్వయోపదేశమునకుపై నాలుగింటిని ప్రతిఫలము ఆశించకుండానే భగవన్మంగాళాశాసనమే పరమ ప్రయోజనముగా భావించి మామునులు తమకుపదేశించారని ఈ శ్లోకము వివరిస్తున్నది.

ఈ మంత్రోపదేశము మామునులు మన ఆచార్య పరంపరలో ఉన్నతులైన శ్రీమద్రామానుజుల శ్రీపాదములను మనసులో నిలుపుకొని చేశారని తెలుసుకోవాలి.గురుపరంపరను అనుసంధానము చేసిన తరవాతే ద్వయానుసంధానము చేయలనే నిర్భంధము ఉన్నందున “యతీంద్ర శరణత్వంత ప్రణవేనైవ చేతసా”(16) అని 16వ శ్లోకములోనే చెప్పబడింది. ఈ ప్రకారము అనుసంధానము చేయటము వలన శ్రీమద్రామానుజుల కంటే ముందున్న,వెనకనున్న ఆచార్యులందరిని స్మరించుట జరుగుతుంది. శ్రీవైష్ణవులు అనుష్ఠించ తగిన అభిగమనము ,ఉపాదానము, ఇజ్జ,స్వాధ్యాయనం ,యోగం మొదలైన ఐదు అంశములు భగవంతుడికి సమర్పించవలసిన ద్రవ్యములను సేకరించ వలసిన ఉపాదానమును మామునులు ఎఱుంబిఅప్పాకు ద్వయోపదేశము చేయటము వలన సాధించారని చెప్పబడుతున్నది.’ఆత్మ లాభాత్ పరం కించిత్ ‘ అని ఈ విషయాన్ని 11వ శ్లోకములో చెప్పటము జరిగింది.

అడియేన్ చూడామణీ రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-21/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment