ఆర్తి ప్రభందం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ramanuja-srirangam

శ్రీ రామానుజ – శ్రీరంగం

mamunigal-srirangam

మణవాళ మాముని – శ్రీరంగం

మణవాళ మామునుళు మన సాంప్రదాయమునకు చేసిన మిక్కిలి ప్రసిద్దమైన తన సాహిత్య రచనలను అందమైన సంస్కృత ప్రభందమైన యతిరాజ వింశతి తొ మొదలుపెట్టెను. వారు ఆళ్వార్ తిరునగరిలో వుండి శ్రీ భవిష్యదాచార్యన్ సన్నిధి లో కైంకర్యం చేయున్నప్పుడు శ్రీ రామానుజులను కీర్తిస్తూ యతిరాజ వింశతిని రచించెను. అద్భుతమైన 20 సంస్కృత శ్లోకాల సంగ్రహమైన ఆ ప్రభందమున, యతిరాజుల ( శ్రీ రామనుజులు – యతులలో రాజు) యెడల మామునులు తన పూర్తి పారతంత్య్రమును చెప్పెను.

శ్రీ వైష్ణవ సత్ సాంప్రదాయము లొ తన ప్రసిద్దమైన సాహిత్య రచనను ఆర్తి ప్రభందం అను అందమైన తమిళ ప్రభందంఉతో ముగించెను. ఆ ప్రభమ్దమునందు కూడ శ్రీ రామానుజులనే కీర్తించెను. ఈ ప్రపంచ జీవితంలోని అంత కాలమున శ్రీరంగమున వుండి మన సాంప్రదాయమును అనుకోని ఉచ్చస్థితికి తీసుకెల్లునప్పుడు ఈ ప్రభందమును రచించెను. హృదయపూర్వకమైన 60 తమిళ పాశురముల సంగ్రహమైన ఈ ప్రభంభమునను యతిరాజుల యెడల తన పూర్తి పారతంత్య్రమును  చెప్పెను. శ్రీ రామానుజుల పాద పద్మములను ఆశ్రయిం చడమే మనకు (శ్రీ వైష్ణవులకు) శ్రేయస్సు మరియు వారి సంభంధమే మనకి ఈ లౌకికమున ఒకే జీవాధారం అని ఈ ప్రభందమున స్థాపించెను.

ఎమ్పెరుమానుల యెడల ఉన్న దృఢమైన విశ్వాసము/అనుభందము/ పారతంత్య్రము చే, మామునులు యతీంద్ర ప్రవణర్ ( యతీంద్రుల యెడల ప్రేమ పూర్వక భక్తి కి ప్రతిమ / ప్రమాణము) అని కీర్తించాబడ్డారు.

pillailokam-jeeyar

పిళ్ళై లోకం జీయర్

ప్రస్తుత సరణిలో, ఆర్తి ప్రభంద తత్వార్థముల యొక్క తెలుగు అనువాదములను చూచెదము. పిళ్ళై లోకం జీయర్ ల వారు ఈ అద్భుత ప్రభందానికి సవిస్తర వ్యాఖ్యానము చెసారు. దాని ఆదారంగానే ఈ అనువాద ప్రయత్నం చేయుచున్నము.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2016/05/arththi-prabandham/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

0 thoughts on “ఆర్తి ప్రభందం”

Leave a Comment