ఆర్తి ప్రబంధం – 43

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 42

పరిచయము:

మునుపటి పాశురములో, “ఇరంగాయ్ ఎతిరాశా” అనే వాక్యాన్ని మాముణులు ఉపయోగించారు. అనగా మాముణులు విసుగు చెందారని సూచిస్తుంది. పరమపదానికి వెళ్లాలనుకునే వ్యక్తికి రెండు విషయాలు అవసరం (1) అక్కడికి వెళ్ళాలనే ఆసక్తి ఉండటం,  (2) ఇక్కడ ఈ భూమిపై ఉండాలని ఆసక్తి లేకపోవడం. ఈ రెండు అవసరాలు “ప్రాప్య భూమియిల్ ప్రావణ్యముం త్యాజ్య భూమియిల్ జిహాసయుం (శ్రీ వచన భూషణం 458)” నుండి సంగ్రహించబడింది. పరమపదానికి వెళ్లాలనుకునే వ్యక్తిలో అవసరమైన ఈ రెండు తనలో లేవని భావించి మాముణులు విసుగు చెందుతున్నారు. వారు ఈ విషయాన్ని గురించి బాధపడి, ఈ రెండు అర్హతలు లేకపోతే శ్రీ రామానుజులు తనకి పరమపదాన్ని ఎలా అనుగ్రహిస్తారని ఆశ్చర్యపోతున్నారు.

పాశురము 43:

ఇంద ఉలగిల్ పొరున్దామై ఏదుమిల్లై
అంద ఉలగిల్ పోగ ఆశైయిల్లై
ఇంద నమక్కు ఎప్పడియే తాన్ తరువర్ ఎందై ఎతిరాశ
ఒప్పిల్ తిరునాడు ఉగందు

ప్రతి పద్ధార్ధములు:

ఏదుమిల్లై– (నాలో) అణువు మాత్రము కూడా
పొరున్దామై – ఆసక్తి లేకుండుట నాను దిగజార్చ వచ్చు
ఇంద ఉలగిల్ – ఈ క్రూరమైన లోకాన్ని త్యజించాలి
ఆశైయిల్లై  – (నాలో కూడా) ఆసక్తి లేదు
పోగ – వెళ్ళే
అంద ఉలగిల్ – అందరికీ అత్యున్నత గమ్యమైన పరమపదానికి.
ఇంద నమక్కు – అటువంటి వ్యక్తి పట్ల (నేను), ఈ రెండు ముఖ్య అర్థతలు లేని
ఎప్పడియే తాన్ – ఎలా
ఎందై– నా తండ్రి
ఎతిరాశ– ఎంబెరుమానార్
తరువర్ – యిచ్చు వారు
ఉగందు– సంతోషంగా
తిరునాడు – పరమపదము
ఒప్పిల్ – సాటిలేని

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు పరమపదానికి వెళ్లాలనుకునే వ్యక్తికి అవసరమైన రెండు అర్హతలు తనలో లేవని వివరిస్తున్నారు. ఈ భౌతిక జగత్తుపై తనకు ఎలాంటి ద్వేషం కూడా లేదని వారు చెబుతున్నారు. మరో వైపు,  పరమపదాన్ని అధీష్థించాలనే తాపత్రేయం కూడా లేదు. ఇలాంటి దుస్థితితో, తన తండ్రి అయిన ఎంబెరుమానార్లు  ఎలా సంతోషంగా పరమపదాన్ని అనుగ్రహిస్తారోనని ఆశ్చర్యపోతున్నారు.

వివరణ: 

“కొడువులగం కాట్టెల్ (తిరువాయ్మొళి 4.9.7)”లో క్రూరమైనది వివరించబడిన ఈ ప్రపంచముపై నాకు ఎటువంటి నిరాసక్తి లేదు అని మాముణులు తెలియజేస్తున్నారు. “వాన్ ఉలగం తెళిందే ఎన్ఱెయ్దువదు (పెరియ తిరుమొళి 6.3.8) లో ప్రతి ఒక్కరూ వెళ్ళాలని ఆరాటపడే ప్రదేశంగా వర్ణించబడిన పరమదానికి వెళ్ళాలని నాకు ఆసక్తి లేదు. ఇటువంటి పరిస్థితిలో, నా తండ్రి అయిన ఎంబెరుమానార్లు సంతోషంగా నన్ను సాటిలేని ఆ  పరమపదానికి ఎలా తీసుకెళ్లగలరు?

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-43/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *