ఆర్తి ప్రబంధం – 56

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 55

పరిచయము:

మునుపటి పాశురములో, “మధురకవి శొర్పడియే నిలయాగ ప్పెఱ్ఱోం” అని మాముణులు అన్నారు. దానికి సంబంధించి ఈ పాశురములో, వారు ఎంబెరుమానార్ల దివ్య చరణ కమలాల యందు శాశ్వతమైన సేవని అభ్యర్థిస్తారు.

పాశురము 56:

ఉందన్ అభిమానమే ఉత్తారకం ఎన్ఱు
శిందై తెళిందిరుక్క చెయ్ద నీ
అందో యతిరాశా! నోయ్గళల్ ఎన్నై నలక్కామల్
శదిరాగ నిన్ తిరుత్తాళ్ తా

ప్రతి పద్ధార్ధములు:

యతిరాశా! – హే! యతులకు నాయకుడా!!!
ఉందన్ అభిమానమే ఉత్తారకం ఎన్ఱు – “ఆచార్య అభిమానమే ఉత్తారగం” (శ్రీ వచన భూషణం 447వ సూత్రములో) అని పిళ్ళై లోకాచార్యులు పలికినట్లు, మీకు (ఎంబెరుమానార్లకు) నా పైన ఉన్న భక్తి శ్రద్ధలు, జీవి యొక్క ఆత్మోద్ధారణకి కావసిన ఏకైక కారణహేతువు.
శిందై తెళిందిరుక్క చెయ్ద నీ – ఈ విషయము నా మనస్సులో ఎప్పటికీ పాతుకుపోయి ఉంటుంది. “తెళివుఱ్ఱ శిందైయర్అని తిరువాయ్మొళి 7.5.11వ పాశురములో చెప్పినట్లుగా, ఎంబెరుమానార్లు నా మనస్సు ఎప్పటికీ శుద్దముగా ఉండేలా దీవించారు.
అందో – అయ్యో!!!
తా – మీరు అనుగ్రహించాలి
ఎన్నై  – నేను
శదిరాగ – తెలివిగా
నిన్ తిరుత్తాళ్ – (సేవతో) మీ పాదపద్మాల యందు
నలక్కామల్– ప్రభావితం కాకుండా
నోయ్గళల్ – బాధలతో

సరళ అనువాదము:

మాముణులు ఎంబెరుమానార్ల దివ్య చరణ కమలాల యందు కైంకర్యాన్ని కోరుతున్నారు. ఇది మునుపటి పాశురములో, “”మధురకవి శొఱ్పడియే నిలైయాగ ప్పెఱ్ఱోం” అని వారు కోరిన దానికి సంబంధించినది. “ఆచార్యుడు తన గురించి ఏమి ఆలోచిస్తున్నారన్నది, వారికి తనపై ఎంత భక్తి ఉందన్నది చాలా ముఖ్యము”, అన్న ఈ జ్ఞానం కూడా వారి దయతోనే తనకి కలిగించని వివరిస్తున్నారు. ఈ జ్ఞానము నా బుద్ది మనస్సులలో సజీవిమై ఉన్నది కూడా వారి కృప వల్లనే అని చెప్పుచున్నారు. అయ్యో! తన బాధలన్నింటినీ అంతం చేసి త్వరగా తమ పాద పద్మాల వద్దకి చేర్చమని మాముణులు ఎంబెరుమానార్లను అభ్యర్థిస్తున్నారు.

వివరణ: 

“హే! యతీల నాయకుడా! “ఆచార్య అభిమానమే ఉత్తారకం” అని శ్రీవాచన భూషణం 447) ప్రబంధాన్ని నాకు బోధించి, ఆ జ్ఞానాన్ని ప్రసాదించిన వారు మీరు. దాని ఆధారంగా చూస్తే, నా పట్ల మీకున్న ప్రేమ భక్తులే నాకు సర్వస్వము. “తెళివుఱ్ఱ శిందైయర్” అని తిరువాయ్మొళి 7.5.11వ పాశురములో వివరించిన విధంగా ఈ మూలతత్వము నాలో పాతుకుపోయింది. మీ కృపతో నేను దాని అనుసరిస్తూ నడుచుకుంటున్నాను. కనీ,  కష్థాలను అనుభవించుకుంటూ ఈ ప్రపంచంలో ఉండేలా దయచేసి నన్ను ఇంకా చేయవద్దు “సుఖేనేమాం ప్రకృతిం స్థూల సూక్ష్మ రూపాం విశృజ్య” అని శరణాగతి గద్యములో మీరు చెప్పినట్లు, “ఉన్ పద యుగమాం యేర్ కొండ వీడు”, అని ఇరామానుజ నూత్తందాది 83వ పాశుర వివరణ ప్రకారము, మీరు నన్ను త్వరగా మీ చరణాల వద్దకు చేర్చుకొని, వాటికి నిత్య కైంకర్యము చేసేలా అనుగ్రహించాలి అని మాముణులు విన్నపించుకుంటున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-56/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment