ఆర్తి ప్రబంధం – 58

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 57

పరిచయము:

మాముణులు తమ మునుపటి పాశురములో “తిరువాయ్మొళి పిళ్ళై వాసమలర్ త్తాల్ అడైంద వత్తు” అని అన్నారు. తిరువాయ్మొళి పిళ్ళైల దివ్య చరణ కమలాలను చేరిన తరువాత మాముణులు తనను తాను ఒక “వస్తువు” గా కీర్తిస్తున్నారు. దీన్లో ఇంకా లోతైన విషయము ఉందని చెబుతున్నారు. తిరువాయ్మొళి పిళ్ళై (ఆచార్య – శిష్య సంబంధం) లతో వారికున్న అనుబంధం వల్లనే, తాను శ్రీ రామానుజుల సంబంధం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం, అభినందించడం, అర్థం చేసుకోవడం జరిగాయని వారు వివరిస్తున్నారు.

పాశురము 58:

ఎందై తిరువాయ్మొళి పిళ్ళై ఇన్నరుళాల్
ఎందన్ ఉఱవై ఉణర్ త్తియ పిన్ ఇంద ఉయిర్ క్కు
ఎల్లా ఉఱవుం నీ ఎన్ఱే ఎతిరాశా
నిల్లాదదు ఉణ్డో ఎన్ నెంజు

ప్రతి పద్ధార్ధములు:

ఎందై – “తిరుమంత్రం మాతావుం, పితా ఆచార్యనుం  ఎన్ఱు అరుళిచ్చెవర్గళ్” అని ప్రసిద్ధ వాఖ్యము ఉంది. దాని ఆధారంగా నా తండ్రి తిరువాయ్మొళి పిళ్ళై. (మాముణులు చెబుతున్నారు)
తిరువాయ్మొళి పిళ్ళై – వారి
ఇన్నరుళాల్– నిర్హేతుక కృప
ఎందన్ ఉఱవై – (నాకు అర్థమయ్యేలా చేసింది) మీ (శ్రీ రామానుజుల) దివ్య చరణాల వద్ద అన్ని రకాల సంబంధాలు
ఇంద ఉయిర్ క్కు – వారి ఆ ఆత్మ పంచుకునే
ఉణర్ త్తియ పిన్ – నా అజ్ఞానాన్ని నాకు తెలియజేసి నన్ను రక్షించిన తరువాత
ఎతిరాశా– ఎంబెరుమానారే!!!
నీ ఎన్ఱే – నీవు కాదా?
ఎల్లా ఉఱవుం – తిరుమంత్రంలో ఉన్న అన్ని సంబంధాలను ఎవరిని సూచించబడింది?
ఎన్నెంజు నిల్లాదదు ఉణ్డో – నా మనస్సుని కదిలించేటటువంటి పరిస్థితి ఒకటేదైనా  ఉంటుందా? (స్పష్టంగా ఉండదు). “తందై  నఱ్ఱై తారం తనయర్ పెరుంజెల్వం ఎందనక్కు నీయే” మరియు “అల్లాద శుఱ్ఱముమాగి” లోని వాఖ్యాలను తెలుసుకోవడం మనకి తగును.

సరళ అనువాదము:

మాముణులు తమ ఆచార్యులు, ఆధ్యాత్మిక తండ్రి అయిన తిరువాయ్మొళి పిళ్ళైల కృప వల్లనే  శ్రీ రామానుజులతో తన ఆత్మ పంచుకునే భిన్న భిన్న సంబంధాలన్నింటినీ గ్రహించగలిగారని వివరిస్తున్నారు. ఇప్పటి వరకు తన్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి అతన్ని కాపాడింది వారి దయనే అని తెలుపుతున్నారు. దీని తరువాత, తన మనస్సు చంచలము అయ్యే పరిస్థితి అంటు ఉంటుందా? అని మాముణులు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఉండదు అన్నది సమాధానము.

వివరణ: 

“తిరుమంత్రం మాతావుం, పితా ఆచార్యనుం ఎన్ఱు అరుళిచ్చెవర్గళ్” అని ప్రసిద్ధ వాఖ్యము ఒకటి ఉంది అని మాముణులు తెలుపుతున్నారు. దాని ఆధారంగా మాముణులు తమ ఆచార్యులు, ఆధ్యాత్మిక తండ్రి అయిన తిరువాయ్మొళి పిళ్ళైల కృప వల్లనే  శ్రీ రామానుజులతో తన ఆత్మ పంచుకునే భిన్న భిన్న సంబంధాలన్నింటినీ గ్రహించగలిగారని వివరిస్తున్నారు. హే ఎంబెరుమానారే!!! నా అజ్ఞానాన్ని నేను గ్రహించేలా చేసి నన్ను సంరక్షించిన తరువాత, తిరుమంత్రంలో అవ్యక్తంగా ఉన్న అన్ని సంబంధాలలో సూచించబడినది మిమ్మల్ని కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా చెప్పిన తరువాత, నా హృదయం మనస్సు చంచలము అయ్యే పరిస్థితి అంటూ ఉంటుందా? (సమాధానం స్పష్టంగా లేదు). “తందై  నఱ్ఱై తారం తనయర్ పెరుంజెల్వం ఎందనక్కు నీయే” (ఆర్థి ప్రబంధం 3)” మరియు “అల్లాద శుఱ్ఱముమాగి” (ఆర్థి ప్రబంధం 54)” లోని అనుకూలమైన వాక్యములను  తెలుసుకోవడం మనకు తగును.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-58/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment