ఆర్తి ప్రబంధం – 35

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 34

పాశురము 35

అరుళాలే అడియేనై అబిమానిత్తరుళి
అనవరదం అడిమై కొళ్ళ నినైత్తు నీ ఇరుక్క
మరుళాలే పులన్ పోగ వాంజై శెయ్యుం ఎన్ఱన్
వల్వినైయై మాఱ్ఱి  ఉన్ పాల్ మనం వైక్క ప్పణ్ణాయ్
తెరుళారుం కూరత్తాళ్వానుం అవర్ శెల్వ
త్తిరుమగనార్ తాముం అరుళి చ్చెయ్ద తీమై
త్తిరళాన అత్తనైయుం శేర ఉళ్ళ ఎన్నై
తిరుత్తి ఉయ్య క్కొళ్ళుం వగై తేఱుం ఎదిరాశా!!!

ప్రతి పద్ధార్ధములు

అనవరదం –  (ఓ శ్రీ రామానుజ!!) ఎప్పుడూ
నినైత్తు నీ ఇరుక్క – నీవు అనుకుంటున్నావు
అరుళాలే – నీ పరిపూర్ణ కరుణతో
అడియేనై అబిమానిత్తరుళి – నేను పరమపదంలో ఉండేందుకు సరైనవాడినిగానీ ఈ లౌకిక ప్రపంచములో కాదు.
అడిమై కొళ్ళ – నీ నిత్య కైంకర్యులలో నన్ను చేర్చే విషయము గురించి ఆలోచిస్తున్నావా.
పులన్  – ఇన్ద్రియాలు
ఎన్ఱన్ – నా కారణంగా
వల్ – ప్రసిద్దమైన
వినైయై – కర్మలు
వాంజై శెయ్యుం – చాలా కోరుతున్నాయి
పోగ – భౌతిక విషయాలను అనుసరిస్తూ
మరుళాలే – నీ ఈ ఉద్దేశాన్ని కప్పి ఉంచే అజ్ఞానాన్ని
పణ్ణై  – దయచేసి ఆశీర్వదించుము
మాఱ్ఱి  – దృష్థిమల్లించి
మనం వైక్క – హృదయాన్ని మార్చి
ఇన్పాల్  – నీవైపు
తెరుళారుం – తన పేరుకి తగినట్లు జ్ఞానముతో నిండి ఉన్న
కూరత్తాళ్వానుం – శ్రీ కూరేశ
అవర్ శెల్వ త్తిరుమగనార్ తాముం – కూరత్తాళ్వానుల ప్రథమ పుత్రునిగా పుట్టే భాగ్యము కలిగిన పెరియ భట్టర్
అరుళి చ్చెయ్ద – తమను తాము తక్కువగా భావించి
తీమై త్తిరళాన  – అనేకానేక పాప క్రమం
అత్తనయుం – అన్నీ
సేరవుళ్ళ  – ఉన్న వాళ్ళల్లో ఎవరినీ మినహాయించకుండా
ఎన్నైత్ – నా విషయంలో
ఎతిరాశా!!! – యతిరాజ!
తేఱుం – దయచేసి ఆలోచించండి
వగై  – దారి గురించి
తిరుత్తి – సరిదిద్దే మార్గము గురించి
ఉయ్యకొళ్ళుం – నన్ను విముక్తుడిని చేయి

సరళ అనువాదము:

శ్రీ కూరేశులు మరియు వారి పేరుగాంచిన పుత్రుని వినమ్ర రచనలలో,  అనేకానేక పాప పుట్టల క్రమణిక తమ వద్ద ఉందని తెలుపుతున్నారు. ఆ పాపపు మూటలన్నీ తన వద్ద కూడా ఉన్నాయని మామునులు ఈ పాశురములో చెబుతున్నారు. తనను విముక్తులను చేయాలని నిరంతరం ప్రయాసపడుతున్న శ్రీ రామానుజుల నిర్మల ఉద్ద్యేశ్యాన్ని నా పాప కర్మలు గ్రహించనీయకుండా చేస్తున్నాయి. ఇంద్రియాలచే నియంత్రించబడుతున్న తన మనస్సుని తమ వైపు మళ్ళించమని మామునులు శ్రీ రామానుజులను అభ్యర్థిస్తున్నారు.

వివరణ:

“హే! శ్రీ రామానుజా !!! “కూరనాతభట్టాక్య దెశికవరోక్త సమస్తనైచ్యం అధ్యాస్తి అసంకుచితమేవ (యతిరాజ వింశతి 15)” – శ్రీ కూరేశులు వారి కుమారునిగా పుట్టే మహద్భాగ్యాన్ని పొందిన పెరియ భట్టర్ల గొప్ప జ్ఞానాన్ని కీర్తించే వాఖ్యమని మణవాళ మామునులు తెలుపుతున్నారు. వారు శ్రీ కూరేశులకు జన్మించిన కారణంగా, అతన్ని “శ్రీరంగరాజ కమలాపదలాలీ తత్వం” అని పిలుస్తారు. శ్రీ కూరేశులు వారి పుత్రుడు భట్టర్లిద్దరూ అసీమిత వినమ్ర స్వభాము కలవారు. అటువంటి వారే అసంఖ్యాక పాపాలు చేశామని “పుత్వాచనోచ అధిక్రామంగ్యాం (వరదరాజ స్థవం)” లో పేర్కొన్నారు. వారు పేర్కొన్న ఆ  పాపాలన్నీ నాలో పుష్కలంగా ఉన్నాయి. నాలో లేని అవగుణం అంటూ లేదు”. “సెయల్ నన్ఱాగ తిరుతిప్పణికొళ్వాన్” అని కాణ్ణినుణ్ శిఱుతాంబు 10 లో చెప్పినట్లుగా, “హే శ్రీ రామానుజా !!  నీవు అందరినీ సరిదిద్ది వారికి మొక్షాన్ని ప్రసాదించే మార్గాల గురించి చింతన చేస్తుంటావు. నీకు నాపై  ఉన్న దయ కారణంగా, నేను పరమపదానికి సరితూగుతానని నీవు భావించి, నిరంతరమూ ఈ ప్రాపంచిక బంధనముల నుండి నన్ను విడిపించే మార్గల గురించి ఆలోచిస్తుంటావు. పైగా, నన్ను నీ నిత్య కైంకర్యములో ఉపయోగించుకోగలిగే మార్గాల గురించి కూడా నీవు ఆలోచిస్తావు. అయితే, నా క్రూరమైన కర్మలు, నా ఇంద్రియములు నీ ఈ ఉద్దేశ్యాన్ని కప్పివేస్తున్నాయి. “శబ్ధాది భోగ రుచిరన్వహమేదదేహ (యతిరాజ వింశతి 16)” అనే వాక్యము ప్రకారం, నా పాపాలు ఎంత బలమైన వంటే, అవి నన్ను నీ నుండి దూరం చేసి ఈ భౌతిక విషయాలలో నన్ను మరింత చిక్కుకునేలా చేస్తున్నాయి. “తన్పాల్ మనమ్వైక్కత్ తిరుత్తి (తిరువాయ్మొళి 1.5.10)” అని చెప్పినట్లు నీవు దయతో నాకు మార్గనిర్దేశకత్వం చేసి నా ఆలోచనలను మీ వైపు మళ్లించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నా స్వామీ, మీ గురించే చింతన చేసేలా నన్నాశీర్వదించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నా అభ్యర్థనను స్వీకరించండి”.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-35/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment