ఆర్తి ప్రబంధం – 27

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 26

paramapadham

ప్రస్తావన

మునుపటి పాశురములో మణవాళ మామునులు “ఒళి విసుమ్బిల్ అడియేనై ఒరుప్పడుత్తు విరైన్దే” అని శ్రీ రామానుజులను అడిగెను. వారు శ్రీ రామానుజులను తామను పరమపదమునకు చేర్చుటను త్వరితపరచే ప్రక్రియ తెలపమని కోరెను. “వానే తరువాన్ ఎనక్కాయ్ (తిరువాయ్ మొళి 10.8.5)” అను ప్రబంద వాక్యానుసారం, శ్రీ రామానుజులు కూడా మణవాళ మామునుల పరమపదమునకు చేరాలనే దృఢమైన ఆర్తిని పూర్తి చేసెదనని చెప్పెను. పరమపదమును చేరుట నిశ్చయమగుటచే, మణవాళ మామునులు తన మనసుకు, ఇక నుండి చేయతగినవి మరియు చేయతగనవి చెప్పుచున్నరు. ఈ భౌతిక ప్రపంచ అవరోధములయందు ద్యాస ఉంచకూడదని ప్రారంభించెను. పరమపదమునందు తన స్థాననము ఖాయమైన నేపద్యమున చేయతగిన పనుల గూర్చి చెప్పుట కొనసాగించెను.

పాశురం 27

ఇవ్వులగినిల్ ఇని ఒన్ఱుమ్ ఎణ్ణాదే నెన్జే
ఇరవుపగల్ ఎతిరాసర్ ఎమక్కు ఇనిమేల్ అరుళుమ్
అవ్వులగై అలర్మగళ్కోన్ అన్గిరుక్కుమ్ ఇరుప్పై
అడియార్గళ్ కుళాన్గళ్ తమై అవర్గళ్ అనుభవత్తై
ఇవ్వుయిరుమ్ అదుక్కు ఇట్టుప్పిఱందు ఇళందు కిడందదు
ఎన్నుమ్ అత్తై ఎన్ఱుమ్ అదుక్కు ఇడైచువరాయ్ కిడక్కుమ్
వెవ్వినైయాల్ వన్ద ఉడల్ విడుమ్ పొళుదై విట్టాల్
విళైయుమ్ ఇన్బమ్ తన్నై ముఱ్ఱుమ్ విడామల్ ఇరున్దు ఎణ్ణే!

ప్రతి పద్ధార్ధం

నెన్జే – ఓ! మనసా!!!
ఎణ్ణాదే – ఆలోచించచకు
ఒన్ఱుమ్ – ఏదైనన
ఇవ్వులగినిల్ – ఈ ప్రపంచము గూర్చి
ఇని – ఇకనుండి
ఎణ్ణే! – ఆలోచించు
విడామల్ ఇరున్దు – నిరంతరముగా
ఇరవుపగల్ – రేయింపగలు
అవ్వులగై – పరమపదమును
ఎతిరాసర్ – శ్రీ రామానుజ
ఇనిమేల్ అరుళుమ్ – భవిష్యత్తులో ప్రసాదించును
ఎమక్కు – మాకు
అలర్మగళ్కోన్ – సర్వశక్తి, సర్వసాక్షియగు శ్రీమన్నారాయణుడు, అలమేలుమంగ (తామర పువ్వుయందు                                    అమరియున్న పెరియ పిరాట్టికి పతిని (గూర్చి తలచుము)
ఇరుక్కుమ్ ఇరుప్పై – దివ్యమైన సింహాసనమున వారు విరాజిల్లు విధమును (తలచుము)
అన్గు – పరమపదమున
అవర్గళ్ అనుభవత్తై – అనుభవ పాత్రమగు నేను (వారి గూర్చి తలచుము)
కుళాన్గళ్ తమై – సమూహము
ఎన్ఱుమ్ –  ఎల్ల వేళల (తలచుము)
ఎన్నుమ్ అత్తై – వాటిని
ఇట్టుప్పిఱన్దు – ఇంకను పాత్రుడౌట
ఇళన్దు కిడన్దదు – అవకాసం చేజార్చుకొనుట (నిత్యసూర్యుల యొక్క అనుభవ పాత్రుడగు) 
ఇవ్వుయిరుమ్ – ఈ ప్రాణమైనను
అదుక్కు ఇడైచువరాయ్ కిడక్కుమ్ –  వాటికి అడ్డుగా ఉండు విషయమును గూర్చి (తలచుము)
వన్ద – కారణమగు
వెవ్వినైయాల్ – క్రూరమై పాపములు (ఈ శరీరముతో సంబందముచే)
ఉడల్ విడుమ్ పొళుదై – ఈ దేహము పతనముగు సమయమున (తలచు) 
అదుక్కు – అనుభవం కలుగుట (గూర్చి తలుచుము)
విట్టాల్ –   ఈ దేహ పతనము చెందునప్పుడు
విళైయుమ్ –  తుదకు కారణమగు
ఇన్బమ్ తన్నై – నిత్యమైన  సుఖము
ముఱ్ఱుమ్ – పై చెప్పబడిన వాటిని (గూర్చి తలచుము)

సామాన్య అర్ధం

మణవాళ మామునులు తన మనస్సును ఈ ఆత్మా పరమపదము నందు అనుభవించబోవు దివ్యమైన సమయమును గూర్చి తలచమని అడుగుచుండెను. ఇది  పరమపదమునకు పోవు ఆశక్తిని పెంపొందించిన శ్రీ రామునుజులచే అనురహించబడినది అని మామునులు చెప్పెను. మణవాళ మామునులు తన మనస్సు తో పరమపదము గూర్చి, దివ్య దమ్పతులైన శ్రీమన్నారాయణుని మరియు పిరాట్టి గూర్చి, వారి భక్తులను గూర్చి, అట్టి భక్తిలు అనుభవించు ఒక వస్తువుగ ఉండె అవకాశమును గూర్చి,  కాని ఇప్పుడు ఆ ఆనందమును అనుభవించ లేక పోవు దురదృష్టము గూర్చి, భాగవతుల కైంకర్యము చేయుటకు ఆత్మకు కలుగు ఆటంకములను గూర్చి, విఘాతములుగా ఉండు పాపముల గూర్చి, ఆ పాపములకు కారణముగా ఉండె ఈ దేహము గూర్చి, ఈ దేహమును విడుచు గడియ గూర్చి, ఆ తరువాత పరమపదమునకు చేరు సమయమును గూర్చి విచారించమని చెప్పెను.

వివరణ

ఓ! నా మనసా! బంధమున కు కారణమగు మార్గమైనా అలాగే మోక్ష మార్గమైనా రెండింటికీ నీవే బాధ్యుడివి (పరమపదము ద్వారా)” అని మణవాళ మామునులు తన మనస్సుకి చెప్పుకుంటున్నారు. “అత దేహావసానేచ త్యక్త సర్వేదాస్బృహః” – ఈ భౌతిక ప్రపంచం పట్టించుకోకుండా ఉండవలసిన విషయాలతో నిండి ఉందని వివరించే సామెత ఇది. “ప్రకృతి ప్రాకృతుంగళ్” అని సమిష్టిగా పిలువబడే ఈ విషయాలను నిశ్శేషంగా పూర్తిగా విస్మరించాలి..  అల్పమైన, నశ్వరమైన ఈ విషయాలను అవలంబించదగనివి”. అని మామునులు ముందుకు సాగుతూ, ” ఓ! నా మనసా! నాలో పరమపదము చేరుకోవాలనే కోరికను ఎంబెరుమానార్లు ప్రేరేపించారు. కావున, ఇకపై, ఈ క్రింది విషయాలను గురించి ఎల్లప్పుడూ ధ్యానించమని నేను నీకు చెప్పబోతున్నాను, ఎంబెరుమానార్లు మనకి అనుగ్రహించే “పరమపదం” అని పిలువబడే అద్భుతమైన దివ్య లోకాము గురించి ధ్యానించు, శ్రీ మన్నారాయణుని గురించి ధ్యానించు, వారి దివ్య పత్ని అయిన పెరియ పిరాట్టి గురించి ధ్యానించు, ఆ పరమపదంలో వారి సింహాసనముపై గంభీరముగా ఆసీనులై ఉన్నవారి గురించి చింతన చేయి. దివ్య సుగంధములతో రూపుదిద్దుకొని పెరియ పిరాట్టి పద్మాసీనమై ఉంది. “ఎళిల్ మలర్ మాదరుం తానుం ఇవ్వేళులగై ఇన్బం పయక్క ఇనిదుడన్ వీఱ్ఱిరుందు” (తిరువాయ్మొళి 7.10.1) లో వర్ణించినట్టుగా ఆవిడ దివ్య సింహాసనముపై తన దివ్య పతి అయిన శ్రీమన్నారాయణునితో ఉంది. ఈ దివ్య దంపతుల నిత్యసేవలో ఉన్న ఆ దివ్య భక్తుల (“అడియార్ కుళంగళై – తిరువాయ్మొళి 2.3.10) గురించి ఆలోచించుము.  వాళ్ళు నిన్ను ఆస్వాదించుట చూసి నీవు పొందే ఆనందం గురించి ఆలోచించు. నీవు ఆత్మగా ఆ అర్హత కలిగున్నప్పటికీ, ఇప్పుడు ఆ భక్తులకు ఆనందదాయకము కాని నీ దురదృష్టం గురించి ఆలోచించు. ఆఖరికి ఈ శరీరము రాలిపోయే ఆ క్షణము గురించి ధ్యానించుము. మొదట ఈ నష్థానికి కారణమైన అడ్డంకుల గురించి ధ్యానించు. మనమది సాధించడంలో అన్నింటి కంటే పెద్ద అవరోధమైన ఈ శరీనము గురించి ధ్యానించు. “పొల్లా ఒళుక్కుం అళుక్కుడంబుం” అని తిరువిరుత్తం 1 లో చెప్పినట్టుగా, ఈ శరీరము కొరకు ఎన్ని పాపాలు చేసి ఉంటామో వాటి గురించి ధ్యానించు. ఆఖరికి ఈ శరీరము రాలిపోయే ఆ క్షణము గురించి ధ్యానించుము. ఈ శరీరాన్ని విడిచిన అనంతరం ఈ ఆత్మ అనుభవించే శాశ్వత పరమానందము గురించి ఆలోచించు.  ఈ విషయాలన్నింటి గురించి రాత్రింబగళ్ళు ధ్యానించు. ఇవి ఆత్మ “ఆలోచించాల్సిన విషయాలు”. నిరంతము ఈ అంశాలను ధ్యానించు. “ఇవ్వులగిల్ ఇని ఒన్ఱుం ఎణ్ణాదే” అన్న ఈ వాక్యము, నమ్మాళ్వార్ల తిరువాయ్మొళి 10.6.1 లోని “మరుళ్ ఒళి నీ” పాశురమును పోలి ఉంది. రెండూ అర్చావతార ప్రాముఖ్యతను తెలుపుతున్నాయి.  

అడియేన్ వైష్ణవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/10/arththi-prabandham-27/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *