ఆర్తి ప్రబంధం – 59

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 58

పరిచయము:

మాముణులు ఎంబెరుమానార్లతో ఇలా అంటున్నారు – “నాకు మరియు మీ పాద పద్మాల మధ్య ఉన్న సంబంధాన్ని నేను అర్థం చేసుకున్నాను (స్వాచార్యులైన  తిరువాయ్మొళి పిళ్ళైలకు ధన్యవాదాలు). నా ఈ శరీరాన్ని నాశనం ఎప్పుడు అయ్యి, ఆ తరువాత పెరియ పెరుమాళ్ళు (ఆత్మ శ్రేయస్సుని కోరేవారు) గరుడున్నిఅధీష్థించి వచ్చి తమ శ్రీముఖాన్ని నాకు ఎప్పుడు చూపిస్తారు? ఎంబెరుమానారే, మీరు ఈ పని ఎప్పుడు చేస్తారో దయచేసి చెప్పండి?” అని అడుగుతున్నారు.

పాశురము 59:

ఎందై తిరువరంగర్ ఏరార్ గరుడన్ మేల్
వందు ముగమ్ కాట్టి వళి నడత్త చిందై శెయ్దు
ఇప్పొల్లా ఉడంబుతనై పోక్కువదు ఎన్నాళ్కొలొ?
శొల్లాయ్ ఎతిరాశా! శూళ్ందు!!!

ప్రతి పద్ధార్ధములు:

ఎందై – (దేహాన్ని ఆత్మ విడిచిపెట్టే సమయంలో) నా యొక్క తల్లి తండ్రి
తిరువరంగర్ – పెరియ పెరుమాళ్ళు నివాసుడై ఉన్న కోయిల్ (శ్రీ రంగం) లో
ముగమ్ కాట్టి – నాకిష్ఠమైన కస్తూరి తిలకాన్ని, చిరు మందహాసాన్ని మొదలైనవి చూపిస్తారు.
వందు – నా వద్దకి వచ్చి
ఏరార్ గరుడన్ మేల్ – అందమైన వారి గరుడుని పైన
వళి నడత్త –  “అర్చరాది మార్గం” అనే దివ్య దారిగుండా తీసుకొని వెళతారు
ఎతిరాశా! – ఎంబెరుమానారే
శొల్లాయ్ – దయచేసి నాకు చెప్పండి
ఇప్పొల్లా ఉడంబుతనై పోక్కువదు ఎన్నాళ్కొలొ? – నా యొక్క ఈ నీచమైన శరీరం నాశనమై, ఆత్మ నిన్ను చేరుకునే రోజు ఎప్పుడు వస్తుంది?
చిందై శెయ్దు – దయచేసి ఆలోచించండి
శూళ్ందు –  దాని గురించి నాకు వివరించండి, దాని యొక్క ఖచ్చితత్వం గురించి తెలుసుకొని సంతోషిస్తాను. దయచేసి ఆలోచించండి.

సరళ అనువాదము:

శ్రీ రామానుజులను, తన ఈ శరీరాన్ని ఎప్పుడు తిరిగి తీసుకొని, తన కోసమే అంకిమై ఉన్న ఈ ఆత్మని ఏ రోజు విముక్తి చేస్తరని మాముణులు అడుగుతున్నారు. అది ఎప్పుడు జరగాలని నిర్ణయించుకున్నారని వారిని అడుగుతున్నారు. తమ చివరి క్షణాలలో ఏమి జరుగుతుందో కూడా వివరించారు. శ్రీరంగంలో ఉన్న పెరియ పెరుమాళ్ళు తన అందమైన గరుడునిపైన వస్తారని, “అర్చరాది మార్గం” గుండా తనని పరమపదానికి తీసుకువెళతారని మాముణులు వివరిస్తున్నారు.

వివరణ: 

“హే! శ్రీ రామానుజా! ముక్తి పొందాలనే ఏకైక లక్ష్యముగా ఉన్న నా ఈ శరీరాన్ని మీరు ఎప్పుడు ఏ రోజు నాశనం చేయబోతున్నారు? ఈ శరీరాన్ని విడిచిపెట్టే నా అంతిమ క్షణాలలో  “కోయిల్”/“శ్రీరంగం”లో నివాసుడై ఉన్న నా తల్లియు  తండ్రియు అయిన పెరియ పెరుమాళ్ళను నేను చూస్తాను. “అం చిరై పుళ్ పాగన్” అని తిరునేడుంతాండగం 6వ పాశురములో వర్ణించినట్లుగా, వారి అతి అందమైన గరుడునిపైన వేంచేస్తారు. ఆతడి కస్తూరి తిలకాన్ని, “నల్ కదిర్ ముత్త వెణ్ణగై చెయవాయ్” అని పెరియ తిరుమొళి 4.4.5 వ పాశురములో వర్ణించిన ఆతడి చిరునవ్వుని, చంద్రుడి లాంటి ఆతడి శ్రీముఖాన్ని నాకు దర్శింపజేస్తాడు. “శ్రీరంగంలో ప్రియమైనవాడిగా” లేదా “అరంగతుఱైయుం ఇంతుణైవనాన తాం” అని పెరియ తిరుమొళి 3.7.6 వ పాశురములో వర్ణించిన విధంగా, “నయామి పరమాం గతిం (వరాహ చరమ శ్లోకము) లో చెప్పినట్లుగా “అర్చరాది మార్గం” గుండా తనని పరమపదానికి తీసుకువెళతారని మాముణులు వివరిస్తున్నారు.  “అన్ చరణం తందు ఎన్ సన్మం కళైయాయే”, అని నమ్మాళ్వార్లు తిరువాయ్మొళి 5.8.7వ పాసురములో పలికినట్లుగా, ఎంబెరుమానారే !!! మీ పాద పద్మాలను నాకు ఎప్పుడు ప్రసాదించి, నా ఈ జనన మరణ చక్రానికి పూర్ణ విరామం ఎప్పుడు ఇవ్వబోతున్నారు? అని మాముణులు అడుగుతున్నారు.

మీరు ఎప్పుడు నా ఈ శరీరాన్ని తిరిగి తీసుకొని ఈ ఆత్మను మీ సొంతము  చేయబోతున్నారు?  “పూర్ణే చతుర్దశే వర్షే” అని శ్రీ రామాయణం శ్లోకములో చెప్పినట్లుగా, అయోధ్యా రాజ్యానికి తిరిగి రావడానికి శ్రీ రాముడికి ఖచ్చితంగా 14 సంవత్సరాల కలము ఇవ్వబడింది.  శ్రీ రాముడు ఖచ్చితమైన ఆ కాలపరిమితి తరువాత తిరిగి వస్తారని తెలిసినందున భరతుడు వూరడి చెందాడు. “అరురోహరతం హృష్ఠః” అనే వాఖ్యము ప్రకారం, చీకటి తరువాత వెలుగుని చూడవచ్చని అతను కొంత ఆనందాన్ని పొందాడు. ఏదేమైనా, ఈ ఊరడింపులని నేను ఇక భరించలేకపోతున్నాను. కావున, దయచేసి నాకు సంతోషాన్నిచ్చే సమాధాన్ని ఇవ్వండి. ఇక్కడ “శూళ్ందు” అనే పదాన్ని “అవావర చ్చూళ్” (తిరువాయ్మొళి 10.10.11) మరియు “శొల్లు నీయాం అఱియ చ్చూళ్ందు” (పెరియ తిరువందాది 16)” అనే పదబంధంలో ఉపయోగించినప్పుడు అదే అర్థాన్ని కలిగి ఉంటుంది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-59/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment