ఆర్తి ప్రబంధం – 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

<< ఆర్తి ప్రభందం – 1

Ramanuja_Sriperumbudur

ఇరామానుశాయ నమ ఎన్ఱు సిందిత్తిరా
మనుసరోడు ఇఱైప్పోళుదు – ఇరామాఱు
సిందిప్పార్ తాళిణైయిల్ సేర్న్ది రుప్పార్ తాళిణైయై
వందిప్పార్ విణ్ణోర్గళ్ వాళ్వు

ప్రతి పద్ధార్ధం

వాళ్వు – శాశ్వతమైన ధనము
విణ్ణోర్గళ్ – నిత్య సూరులు
తాళిణైయై – వారి ఇరు పాదకమలములను
వందిప్పార్ – నమస్కరించువారి
సేర్న్దిరుప్పార్ – కలిసి ఉందురు
తాళిణైయిల్ – ఇరు పాదకమలములను
సిందిప్పార్ – తలచువారిని
ఇఱైపోళుదు – చాల తక్కువ సమయమైనను
ఇరామాఱు – వారిచే జీవించుటకు నిర్దేశించు
మనుసరోడు – అట్టి మనుషులతో
సిందిత్తిరా – చింతించని
ఇరామానుశాయ నమ ఎన్ఱు– ” రామానుజాయ నమ” అని శ్రీ రామానుజులను గూర్చి

సామన్య అర్ధం

కొందరు (మొదటి వర్గం) ” రామానుజాయ నమ” అని కూడ స్మరించలేరు. మరికొందరు (రెండవ వర్గం) వీరితో అతి తక్కువ సమయమునకు కూడ చేరి ఉండ కూడదని తలెచెదరు. ఇంకొందరు (మూడవ వర్గం) ఈ రెండవ వర్గం వారి గొప్పతనమును తెలుసుకొని, వారి పాదకమలములకు సాష్టాంగముగా దండములు సమర్పించుదురు. నిత్యసూరులు మూడవ వర్గం వారి రెండు పాదపద్మములే వారి నిత్య ధనముగ తలిచెదరు.

ప్రస్తావన

తిరువాయ్ మొళి లో మొదటి పాశురములోనే నమ్మాళ్వార్లు ” తొళుదు ఎళు ఎన్ మనమే” అని చెప్పెను. నమ్మళ్వార్లు తన మనసును శ్రీమన్ నారాయణుని చరణములందే పడి ఉండవలెనని చెప్పెను. ఇంకను నమ్మళ్వార్లు, రెండవ దశకమున ” వణ్ పుగళ్ నారణన్ (తిరువాయ్ మొళి 1.2.10)” లో “నారాయణుని” నామములను జపించుట గూర్చి చెప్పెను . అదే విధముగా మణవాళ మామునులు రెండవ పాశురమున “రామానుజుల” నామమును ఘోషించెను. మొదటి పాశురము ” అన్వయం” (దృవీకరణము) కాని రెండవ పాశురము “వ్యతిరేకం”. దేని ప్రాధాన్యతను చెప్పవలెననెచో, దానిని పాటించే మార్గము ఉండును. మొదట ఆ విషయము యొక్క గొప్పతనమున/ ప్రాధాన్యము  గూర్చి చెప్పెదము. ఇది అన్వయం. తరువాత ఆ విషయము తప్ప మిగిలిన వాటి యొక్క అధమ స్వభావము గూర్చి చెప్పెదము. ఇది వ్యతిరేకము.మొదటి పాశురములో మణవాళ మామునులు యతిరాజుల విశిష్టతను గూర్చి వివరించెను. రెండవ పాశురములో “రామానుజాయ నమ” అను వాక్యాము తప్ప మిగిలిన వాటి యొక్క అధమత్వమును తెలిపెను. ఇట్లు అన్వయ వ్యతిరేకము అను యుక్తితో మణవాళ మామునులు యతిరాజుల గొప్పతనమును కొనియాడెను.

వివరణ

మన ధర్మ గ్రంధములన్నియూ “రామానుజాయ నమ” అను మంత్ర మును నిరంతరము చింతించ వలెనని నిర్దేశించెను.కాని చాల మందికి ఇది తెలియుట లేదు, కొందరికి తెలిసినా పాటించుటలేదు. వీరిని “ప్రతికూలులు” లేదా వెతిరేకముగా నిలుచు(వారి మొక్షమునకు) వారు అని సూచించెదరు. వీరు జీవనాధరము అనగా రామానుజులను గూర్చి జపించుట మరియు ధ్యానించుట చేయరు. వీరిని జీవనాధారం లేని వస్తువుగా చెప్పెదరు మరియు నాలుగు కాళ్ల గల ఆవు వంటి జంతువుతో పొల్చెదరు. ఇంకొక వర్గం వారు ఇట్టి “ప్రతికూలులను” చూచి భయపడెదరు మరియు వారితో కొద్ది పాటి సమయము కూడా కలిసి ఉండుటకు ఇష్టపడరు. ప్రతికూలులను చూచి భయపడు ఈ వర్గం వారిని “అనుకూలులు” లేదా మొక్షమును ఆకంక్షించువారు అని పిలుచుదురు. మరియొక్క వర్గం వారు ఈ అనుకూలుల పాదపద్మములనే ఆశ్రయించెదరు. “అరుమ్పేఱు వానత్తవర్క్కు (ఙ్ఞాన సారం 4)”లో చెప్పినట్లు నిత్యసూరులు , అనుకూలులను ఆశ్రయించి ఇట్టి వారినే కొనియాడెదరు.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2016/06/arththi-prabandham-2/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment