ఆర్తి ప్రబంధం – 42

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 41

పరిచయము:

శ్రీ రామానుజులు తమ మనస్సులో, “అకించన్యము” (తన కంటు ఏమీ లేకపోవడం)” మరియు “అనన్యగతిత్వం (వేరే ఆశ్రయం లేకపోవడం)” తో ఉన్న మాముణులను తాను పొందడం ఎంత అదృష్థము అని భావిస్తున్నారు. శ్రీ రామానుజులు సంతోషించి, వారి ఇవ్వవలసిన వాటి గురించి ఆలోచిస్తున్నారు. ప్రేమ, భక్తి  కలిగి ఉన్న మాముణులను ఆశీర్వదించడం ప్రారంభించారు. మన ఇంద్రియాల వినాశకర ప్రభావాలను చిత్రీకరించిన “ఉణ్ణిలావియ (తిరువాయ్మొళి 7.1)” ను ఈ సమయంలో మాముణులు వివరించడతో తమ “అనన్యగతిత్వ” గుణాన్ని మరింత వ్యక్తపరచారు. మాముణుల నుండి ఇది వింటూ, వారిని వెంటనే రక్షించకపోతే తాను ఇక జీవించలేనన్న స్థితికి శ్రీ రామానుజులు చేరుకుంటారు.

పాశురము 42:

ఐంపులంగళ్ మేలిట్టు అడరుంపొళుదు అడియేన్
ఉన్ పదంగళ్ తమ్మై నినైత్తు ఓలమిట్టాల్
పిన్బు అవైతాం ఎన్నై అడరామల్ ఇరంగాయ్ ఎతిరాశ
ఉన్నై అల్లాల్ ఎనక్కు ఎణ్డొ?

ప్రతి పద్ధార్ధములు:

ఐంపులంగళ్ – (నా)  ఐదు ఇంద్రియాలు
మేలిట్టు – నాపై ఎంత అధిక ప్రభావము ఉండిందంటే
అడరుంపొళుదు – ప్రతి ఒక్కరు తమ తప్పులను
అడియేన్– (అప్పుడు) నేను, నా స్వామి శ్రీ రామానుజుల నిత్య దాసుడు
నినైత్తు –  ధానించు (గజేంద్రుడు భగవానుడిని ధ్యానించి నట్లే).  మొసలి గజేంద్రుని కాలు పట్టుకొని నదిలోకి లాగాలని ప్రయత్నించినపుడు, ఆ ఏనుగు ఎదిరించి పోరాడసాగింది. ఇలా 1,000 దేవ సంవత్సరాలు వారి మద్య యుద్దము జరిగింది. (మనిషి యొక్క ఒక సంవత్సరము దేవతలకు ఒక దినము). అలా అంత కాలం తరువాత, మొసలి బలము పెరిగి ఏనుగు నేలపై తన పట్టు కోల్పోవడం ప్రారంభించింది. మొసలి ఉండేది నీళ్ళల్లో కాబట్టి నీటిలో దాని శక్తి రెట్టింపు అవడం ప్రారంభించింది. అలాగే, ఏనుగు ఉండేది భూమిపైన కాబట్టి ఏనుగు తన శక్తిని నేలపైనే చూపించగలదు. కానీ ఇప్పుడు, యుద్ధంలో మొసలి పైచేయిగా ఉన్నందున, అది ఆ ఏనుగుని నీటిలోకి మరింతగా లాగి, ఏనుగు యొక్క తొండము తప్పా మిగతా శరీరమంతా నీటిలోకి లాగేసింది. ఈ సమయంలో, గజేంద్రుడు తన శత్రు నాశనము చేసి  తనను రక్షించ గలిగే వాడు శ్రీమన్నారాయణుడు తప్పా మరెవరూ కాదని గ్రహించారు. “నారాయణావో” అని ఆర్తితో పిలుస్తూ తనను రక్షించమని గజేంద్రుడు ప్రార్థించాడు. ఎలాగైతే గజేంద్రుడు ఆర్తితో పిలిచాడో, మాముణులు తన నిస్సహాయతని గ్రహించి శ్రీ రామానుజులను రక్షించమని ఆర్తితో పిలుస్తున్నారు).
ఉన్ – మీరు
పదంగళ్ తమ్మై – పాద పద్మాలు.
ఓలమిట్టాల్– (అదే సమయములో నీ దివ్య చరణాలను ధ్యానిస్తూ) ఒకవేళ మీ దివ్య “రామానుజ” నామముతో మిమ్మల్ని పిలిచితే
ఎతిరాశ – ఓ!!! యతుల నాయకుడా
పిన్బు – ఇకపై  (మీ తామర పాదాలను ద్యానిస్తూ నీ నామాన్ని ఆర్తితో జపించి)
ఇరంగాయ్ – దయచేసి ఆశీర్వదించండి
ఎన్నై – నేను
అవైతాం – అధిక హాని కలిగించే ఇంద్రియములు
అడరామల్ – నాపై దాడి చేయకుండా.
ఉణ్డొ? – మరొక రక్షకుడు ఉన్నాడా? (నీవే ఏకైక రక్షకుడవు, మరెవరూ లేరు కనుక)
ఎనక్కు – నాకు
ఉన్నై అల్లాల్ – నీవు తప్పా?

“ఉన్ పదంగళ్ తమ్మై నినైందోలమిట్టాల్ప” అనే వాఖ్యానికి అర్ధము – రామానుజులను తమ మనస్సులో ధ్యానిస్తూ “ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం” అని గట్టిగా ఆర్తితో పిలవాలి.

సరళ అనువాదము:

ఈ పాశురములో, శ్రీ రామానుజులే తనకు ఏకైక రక్షకుడు అని మాముణులు చెబుతున్నారు. అనేక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రజలందరికీ వారే రక్షకులు. తన నిస్సహాయతను గ్రహించి, శ్రీమన్నారాయణను తన ఏకైక రక్షకుడిగా విశ్వసించిన గజేంద్రునితో మాముణులు తనను తాను పోల్చుతూ తన “అనన్యగతిత్వం” గుణాన్ని స్థాపిస్తున్నారు. అదేవిధంగా, మాముణులు, శ్రీ రామానుజుల దివ్య పాద పద్మాలను ధ్యానిస్తూ, తన ఆత్మ రక్షణ కొరకు వారి నామాన్ని ఆర్తితో గట్టిగా పలికారు.

వివరణ: 

మాముణులు తన పంచేంద్రియాలు తనపై దాడిచేస్తున్నాయని, తనని వేర్వేరు దిక్కుల్లోకి లాగుతున్నాయని వివరిస్తున్నారు. “కోవై ఐవర్ ఎన్ మెయ్ కుడియేఱి (పెరియ తిరుమోళి 7.7.9)” అనే ప్రబంధంలో చెప్పినట్లుగా, ప్రతి ఇంద్రియము నన్ను తన దాసునిగా చేసుకొని వాటి అవసరాలను తీర్చమని నన్ను వేధిస్తున్నాయి. ఆ సమయంలో, నా స్వామి శ్రీ రామానుజుల నిత్య దాసుడనైన నేను, సహాయం చేయమని మీ నామ స్మరణ చేస్తూ ఆర్తితో పిలిచాను. మొసలి పట్టులో చిక్కుకున్న గజేంద్రుడు సహాయం కోసం శ్రీమన్నారాయణని పిలిచిన ఘట్టానికి ఈ ఘట్టము పోలినది. “గ్రాహం ఆకర్షతే జలే” అనే వాఖములో చెప్పినట్లుగా, మొసలి తన స్వస్థానమైన నీరులో శక్తిని పొందుతుంది. గజేంద్రుని కాలుని నీళ్ళల్లోకి లాగినప్పుడు,  “మనసా చింతయన్ హరీం (విష్ణు ధర్మం)” అన్న వాఖ్యము ప్రకారం గజేంద్రుడు శ్రీమన్నారాయణున్ని తన మనస్సులో ధ్యానించాడు.  ఇది “నారాయణావో” అని సర్వరక్షకుడు అయిన నిన్ను నేను పిలిచాను”..

నా పంచేంద్రియాలు నన్ను జయించి నన్ను నియంత్రించే స్థితి ఆత్మకు పూర్తిగా హానికరము, అలా కానివ్వద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. హే యతుల రాజా!!! మీరు తప్పా నన్ను రక్షించగల వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అందువల్ల, మీరు నన్ను కాపాడాలి”. “ఉన్ పదంగళ్ తన్నై నినైందోలమిట్టాల్” అనే వాఖ్యానికి, “శ్రీ రామానుజుల దివ్య పాద పద్మాలే తనకు ఏకైక ఆశ్రయం” అని తన మనస్సులో మాముణులు భావించి, వారి గురించి వారి  దివ్య పాద పద్మాలను అమితంగా ధ్యానిస్తూ “శ్రీ రామానుజా” అని ఆర్తితో పిలిచారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-42/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment