ఆర్తి ప్రబంధం – 41

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 40

పరిచయము:

శ్రీ రామానుజుల మనస్సులో ప్రశ్న ఉందని ఊహించి మాముణులు ఇస్తున్న సమాధానము ఈ పాశురము. ప్రశ్న ఈ విధంగా ఉంది. “హే మాముని! నీవు నీ అపరాధాలను చూడకుండా  పెద్ద అనుకూలతను అనుగ్రహించమని కోరుతున్నావు. ఇది చేయ గలిగేదేనా”? అని శ్రీ రామానుజులు ప్రశ్నిస్తున్నారు. దానికి మాముణులు సమాధానమిస్తూ – “స్వామీ! దయచేసి నాపై కనికరం చూపండి. ఈ ప్రకృతి సంబంధము నాచే అనేక అపరాధములు చేయించింది. పాపాలు చేయడంలో నాకు సాటిలేరు ఎవరూ. ప్రతి జీవిని రక్షించి వారందరికీ ముక్తి కల్పించడానికి మీరు ఈ ప్రపంచంలో అవతరించారు. అందువల్ల, మీ ఆశీర్వాదాలను నాపై కురిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను”.

పాశురము 41:

ఎన్నైప్పోల్ పిళై శెయ్వార్ ఇవ్వులగిల్ ఉణ్డో?
ఉనైప్పోల్ పొరుక్కవల్లార్ ఉణ్డో?
అనైత్తులగుం వాళప్పిఱంద ఎతిరాశా మామునివా
ఏళైక్కు ఇరంగాయ్ ఇని

ప్రతి పద్ధార్ధములు:

ఇవ్వులగిల్ ఉణ్డో? – ఈ విశ్వం మొత్తాన్ని వేదికినా
శెయ్వార్ – చేసేవారు
పిళై– పాపాలు
ఎన్నైప్పోల్ – నా వంటి?
ఉనైప్పోల్ – మీలా ఇంకొకటి ఉందా?
పొరుక్కవల్లార్ ఉణ్డో?– ఓపికగా సహిస్తూ  (జనుల అపరాధాలను)?
ఎతిరాశా  – “ఎతిరాశా” అని పేరు ఉన్న
మా – గౌరవనీయులు
మామునివా– యోగులలో సమూహంలో అగ్రగామిగా గౌరవించబడు !!!
ప్పిఱంద– మీ అవతారానికి కారణము
అనైత్తులగుం – (అందరూ) అన్ని లోకాలు
వాళ  – జీవించి (ముక్తి మార్గములో)
ఇరంగాయ్ ఇని – దయచేసి మీ కృప చూపించండి!!!
ఏళైక్కు – చపలం అని పేర్కొనబడే నేను (తాను చూసిన ప్రతీదీ కావాలని కోరుకునే వ్యక్తి)

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు తన కంటే ఎక్కువ పాపాలు చేసిన వారెవరు లేరని చెబుతున్నారు. అలాగే, ఓపికగా క్షమించి స్వీకరించే గొప్ప వ్యక్తి శ్రీ రామానుజులు తప్ప మరెవరూ లేరని వారు తెలుపుతున్నారు. కాబట్టి, తాను చేసిన అసంఖ్యాక పాపాల కారణంగా తనను విశేషముగా ఆశీర్వదించమని శ్రీ రామానుజులను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రపంచంలో శ్రీ రామానుజుల అవతారానికి గల మొట్ట మొదటి కారణం అందరినీ ఉద్ధరించడమేనని వారు వివరిస్తున్నారు. అందుకని తనకు సహాయం చేయమని మాముణులు శ్రీ రామానుజులను వేడుకుంటున్నారు.

వివరణ: 

ఒక వ్యక్తి యొక్క అల్పత్వము  గురించి రామానుజ నూఱ్ఱందాది 48 “నిగరిన్ఱి నిన్ఱ ఎన్ నీశదైక్కు” నుండి ఒక ఉల్లేఖన ఇస్తున్నారు. “పాపాలకు సంబంధించి నాతో తరితూగే వ్యక్తిని వెదకడానికి వెళితే, ఆ వ్యక్తి ఖాళీ చేతులతో తిరిగి రావలసిందే”, “పాపాలు చేయుటలో తనకి మించిన వారు లేరు”, అని మాముణులు చెబుతున్నారు. రామానుజ నూఱ్ఱందాదిలోని అదే పాశురములో “అరుళుక్కుం అహ్ దే పుగల్” అని మరొక వాఖ్యము ఉంది. అనగా, పాపముల వ్యవహరణలో మరియు వాటిని శాంతముగా ఓర్చుకోవడంలో శ్రీ రామానుజులకు సాటి ఉన్న వారు ఈ విశ్వములోనే లేరు అని అర్థము. “హే ఎంబెరుమానారే!!! తమరు నిరంతరము సమస్త లోకాలలోని ప్రతి వస్తువుని మరియు ప్రతి వ్యక్తిని ఈ బంధాల సంకెళ్ళ నుండి ఎలా విముక్తులను చేయాలనే ధ్యానిస్తుంటారు”, అని మాముణులు కీర్తిస్తున్నారు. ఇదే మీ అవతార రహస్యము. వాళ్ళని మెరుగుపరచి ఎలా విముక్తులను చేయాలా నని నిత్యము వారు ఆలోచిస్తుంటారు. అందువల్ల, మీ కృపని నాపై కురిపించమని వేడుకుంటున్నాను. నేను నిరుపేద వర్గానికి చెందినవాడిని. (ఇక్కడ నిరుపేద అనగా  మనస్సు యొక్క బలహీన స్థితిని సూచిస్తుంది. చూసిన ప్రతిదాన్ని అనుభవించాలని మనస్సు కోరుకుంటుంది. ఈ స్థితిని “చపలం” అని పిలుస్తారు).

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-41/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment