ఆర్తి ప్రబంధం – 5

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

<<ఆర్తి ప్రబంధం – 4

ramanujar-mamunigal

 ఎమ్పెరుమానార్  –  మణవాళ మామునులు

ప్రస్తావన 

క్రింది పాశురములో మణవాళ మామునులు శ్రీ రామానుజులతో ” ఉణర్దు పార్” అనగా “దయచేసి  మరల విచారించుము” అని అడిగెను. దానిని కొనసాగిస్తూ ఈ పాశురమున శ్రీ రామానుజులను అలా అడుగుటకు మామునులకు అధికారము ఎట్లు వచ్చెను, శ్రీ రామానుజులతో వారికి ఉన్న బాంధవ్యము ఏమిటి, ఎందులకు శ్రీ రామానుజులు మామునుల విషయమును అనివార్యముగా తలచి వారి కోరికకు సమ్మతించవలెను అను ప్రశ్నలకు సమాధానము తెలుపుచున్నరు. మామునులు తాను శ్రీ రామనుజుల తనయుడని దృఢముగా చెప్పుచున్నారు. ఈ సంబందమే తన కోరికను అనివార్యముగుటకు బాధ్యత వహిస్తుందని చెప్పుచున్నారు.

పాశురం 5

తన్ పుదల్వన్ కూడామల్ తాన్ పుసికుం భోగత్తాల్
ఇన్బురుమో తందైక్కు యతిరాసా – ఉన్ పుదల్వన్
అన్ఱో యాన్ ఉరైయాయ్ ఆదలాల్ ఉన్ భోగం
నన్ఱో ఎనై ఒళింద నాళ్

ప్రతి పద్ధార్ధం

యతిరాసా – ఓ ఎమ్పెరుమానారే!!!
తన్దైక్కు – తండ్రికి
ఇన్బురుమో – ఆనందము కలుగదు
తన్ – తాను
పుదల్వన్ – తనయుడు
కూడామల్ – అతనితో లేనప్పుడు
తాన్ – మరియు తాను ఒక్కరే (తండ్రి)
పుసికుం – అనుభవించుటకు
భోగతాల్ – ధనము మొడలగు భోగ్యమును
ఉన్ – మీరు (నా తండ్రి)
యాన్ – మరియు నేను
పుదల్వన్ – మీరు నాకు తండ్రి అగుటచే నేను మీ తనయుడను కాదా
అన్ఱో – ఇది నిజము కాదా?
ఉరైయాయ్ – దయ చేసి చెప్పుము.
ఆదలాల్ – అందువలనా
ఉన్ – మీ
భోగం – ఆనందిచు
నాళ్ – (మీరు) ఏ రోజు
ఒళిన్ద – లేకుండా
ఎనై – నేను
నన్ఱో – ఆనందమును ఇచ్చునా

సామన్య అర్ధం

మణవాళ మామునులు ఈ పాశురమున ఒక ఉపమానమును చూపెను. ఏ తండ్రియైననూ, తన తనయుడికి దూరమై ఉండున్నప్పుడు భోగ భాగ్యములను అనుభవించగలరా?. దూరమైన తనయుని గూర్చి చింతిస్తూ భోగముగు అనుభవించలేరు.మణవాళ మామునులు శ్రీ రామానుజులను నేను మీ తనయుడను, మరి నేను ఇంకను ఇక్కడ కష్టపడుచున్నపుడు మీరు పరమపదమున సంతోషమును ఎట్లు పొందగలరని ప్రశ్నించెను.

వివరణ

ఒక తండ్రి యొక్క ప్రియమైన కుమారుడు దేశాతరమున ఉండెను. ఇట్టి స్థితిలో తన చెంత ఉన్న ధనధాన్యాదులను, భోగములను ఆ తండ్రి మాత్రమే ఎలా అనుభవించగలరు. మణవాళ మామునులు శ్రీ రామానుజులను ” ఓ! యతిరాజా! అదే విధముగా, నేను మీ తనయుడనుటలో ఎట్టి సందేహములేదు ( శ్రీ సూక్తిలో “కరియాన్ బ్రహ్మత పితా” అని చెప్పబడి ఉన్నది). ఓ! ఎమ్పెరుమానార్! దయతో తండ్రి – తనయుడన్న ఆ సంబందమును ధృవీకరించుము. ఈ సంబందము అమవాయి సంబందము. కావున “కట్టెళిల్ వానవర్ భోగం (తిరువాయ్ మొళి 6.6.11)”  లో వర్ణించబడిన భోగములను నన్ను విడిచిన రోజు మీచే అనుభవించబడునా. అడియేన్ (మణవాళ మామునులు) నుకు తెలియును మీ తనయుడైన నా నుండి దూరమై మీరు ఆ పరమపదములోని భోగములను అనుభవించలేరని. అందువలన మీరు దయచేసి నన్ను మీ చెంతకు చేర్చుకొనుము” అని ప్రార్ధించిరి.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2016/06/arththi-prabandham-5/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *