ఆర్తి ప్రబంధం – 37

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 36

పరిచయము

శ్రీ రామానుజులు తమతో ఏదో చెబుతున్నారని మాముణులు ఊహిస్తున్నారు. శ్రీ రామానుజులు తమ మనస్సులో ఏమి ఆలోచించి ఉండవచ్చో దానికి సమాధానమే ఈ పాశురము. శ్రీ రమానుజులు ఇలా వివరిస్తున్నారు – “హే! మామునీ! ఇంద్రియాల చెడు ప్రభావాల గురించి తలచుకొని భయపడుతున్నావు. చింతించకుము. ఇంద్రియాలు, పాపాల ఆగ్రహానికి నిన్ను నేను బలి కాకుండా చూస్తాను. అయినప్పటికీ, భయపడుతున్న నిన్ను నేను ఇంకా ఈ భౌతిక ప్రపంచములో  ఉంచడానికి కారణం ఉంది. “ఆర్థి అధికారా పూర్తిక్కెనుమదు ముఖ్యం” అనే ఒక సూక్తి ఉంది, ఈ వాఖ్యము ప్రకారం మనము ఆర్తి (ఆసక్తి) మరియు అధికారము (విముక్తి పొంది పరమపదానికి వెళ్ళే అర్హత) సంపాదించాలి. ఆ రెండూ పొందే వరకు, ఇక్కడే ఈ భూమిపైనే ఉండాలి. కావున, ఒకసారి నీవు పరమపదానికి వెళ్ళడానికి అవసమైన ఉన్నత ఆసక్తి నీలో ఉండి, నీవు యోగ్యత పరంగా నిజంగా అర్హుడివైతే, నీవు పరమమపదానికి చేరుకునేలా నేను చూస్తాను. ఆ సమయం వరకు, నీవు ఇక్కడే ఉండాలి”.  “హే! శ్రీ రామానుజ! ఈ జీవితంలో నాకు ఇంతవరకు ఎటువంటి అర్హత లేదు. నేను భవిష్యత్తులో ఇక ఎలాంటి అర్హతను పొందుతాను? నాకు కావలసిన అర్హతలను నాలో కలుగజేయక పోవడానికి కారణం ఏమిటి? పరమపదానికి వెళ్ళడానికి అర్హత పొందే మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను మీరు ఎందుకు తొలగించడం లేదు? మీరు ఆ అవరోధాలను ఎందుకు తొలగించడం లేదు? నన్ను పరమపదానికి ఇంకా ఎందుకు  తీసుకెళ్లడం లేదు? అని మాముణులు ప్రశ్నిస్తున్నారు.

పాశురము 37

ఇన్ఱళవుం ఇల్లాద అదిగారుం మేలుం ఎనక్కు
ఎన్ఱు ఉళదాం శొల్లాయ్ ఎదిరాశా! కున్ఱా
వినై త్తొడరై వెట్టి విట్టు మేలై వైగుందత్తు
ఎనై క్కడుగ ఏఱ్ఱాదదెన్?

ప్రతి పద్ధార్ధములు

శొల్లాయ్ – (ఎంబెరుమానారే!) దయచేసి నాకు చెప్పండి.
ఇన్ఱళవుం– ఇంత వరకు
ఇల్లాద అదిగారుం – (నాకు) అర్హత లేదు (పరమపదాన్ని చేరుకునే)
మేలుం – (ఈ కారణంగా) ఇప్పటి నుండి
ఎనక్కు– నాకు
ఎన్ఱుళదాం – ఎప్పుడు అవుతుంది? లేదా అసలు అవుతుందా? పరమపదాన్ని చేరుకునే అర్హత నేను ఎప్పుడు పొందుతాను? (ఇప్పుడు అవుతుందా?)
ఎదిరాశా– ఓ ఎంబెరుమానారే!!!
యేన్? – నీవు ఎందుకు?
క్కడుగ ఎన్నై ఏఱ్ఱాదదు – నన్ను త్వరగా తోసుకెళ్ళకుండా
మేలై – అతి గొప్పదైన
వైగుందత్తు – పరమపదము
వెట్టి విట్టు –  తొలగించడంతో
కున్ఱా –  క్షీణించని
వినై త్తొడరై – పాప కర్మ సంబంధము

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు తన పాపాల మూటని తొలగించకపోవటానికి కారణమేమిటని శ్రీ రామానుజులను అడుగుతున్నారు. మాముణులను పరమపదానికి తీసుకెళ్లడానికి శ్రీ రామానుజులు ఆలస్యముగా వ్యవహరించడంలో కారణం ఏమిటి. అర్హత కారణం అయితే, తాను పరమపదానికి వెళ్ళడానికి ఎప్పటికీ అర్హత పొందలేనని మాముణులు అభిప్రాయపడుతున్నారు. వారిలో అణువు మాత్రము కూడా ఆ యోగ్యత లేనిదని, తాను పరమపదానికి వెళ్ళడానికి అర్హుడు కారని మాముణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో వారు ఈ అర్హతలను ఎలా పొందగలరని శ్రీ రామానుజులను ప్రశ్నిస్తున్నారు.

వివరణ:  

మాముణులు ఇలా వివరిస్తున్నారు – “ఇన్ఱు తిరునాడుమెనక్కరుళ ఎణ్ణుగిన్ఱాయ్” అన్న సూక్తిలో చెప్పినట్లుగా, గతంలో కొంచము కూడా ఆ ఆసక్తి లేని నాకు, ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఆ అర్హతను (పరమపదము వెళ్ళడానికి) ఎలా పొందుతాను? ఇంతవరకు ఎన్నడూ లేని యోగ్యత ఇప్పుడు ఎలా పుట్టుకు వస్తుంది. శ్రీ రామానుజా!!!! దీని గురించి మీరు నాకు వివరించాలి. “తొన్మావల్వినై తొడర్” అని చెప్పినట్లుగా, ఎప్పటికీ తరగని నా పాప సంబంధము నా పరమపద యాత్రలో ఖచ్చితంగా అడ్డంకి అవుతుంది. మీరు నా ఈ పాపాలను ఎందుకు తొలగించి, “మేలై వైకుంటతితుత్తుమ్” (తిరువాయ్మొళి 8.6.11)” లో వర్ణించిన గొప్ప పరమపదానికి నన్ను ఎందుకు తీసుకెళ్లడం లేదు. నాకు పరమపదాన్ని ఎందుకు ప్రసాదించడం లేదు? పరమపదానికి వెళ్ళాలనే కోరిక నాలో ఉన్న తరువాత కూడా అజ్ఞానంతో పీడింపబడుతున్న ఈ భూమిపై ఇంకా ఎందుకు ఉంచావు? ఎందుకు నన్ను వెంటనే తీసుకెళ్లడం లేదు? నేను శక్తి లేని వాడిని, ఈ విషయంలో ఏదైనా చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది. నేను పరమపదము చేరుకోడానికి అవసరమైన చర్యలు మీరు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి? దయచేసి చెప్పండి.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-37/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *