ఆర్తి ప్రబంధం – 12

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<<ఆర్తి ప్రబంధం – 11

emperumAnAr-thiruvAimozhippiLLai-mAmunigaL

ఎమ్పెరుమానార్ – తిరువాయ్ మొళి పిళ్ళై – మామునిగళ్

ప్రస్తావన

ఇంతకు మునుపటి పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజులను తమకు వడుగ నంబి యొక్క స్థితిని ప్రసాదించమని విన్నపించెను. శ్రీ రామానుజులు ” ఓ! మణవాళ మాముని ! మీరు వడుగ నంబుల స్థితిని ప్రసాదించమని ఆడుగుచ్చున్నారు. కాని అట్లు చేయుటకు మీకు మాతో ఏ సంబంధమున్నది ?”అని అడిగెను.  ఈ కాల్పనిక ప్రశ్నకు మణవాళ మామునులు ” ఓ! ఎమ్పెరుమానారే ! మీకు మరియు నాకు  సంబంధము ఉన్నది. తమ ఆచార్యులైన తిరువాయ్ మొళి పిళ్ళైల ద్వార ఆ సంబంధము స్థాపించబడినది” అని చెప్పెను.

పాశురం 12

తెసమ్ తిగళుమ్ తిరువాయ్ మొళిప్ పిళ్ళై
మాసిల్ తిరుమలైయాళ్వార్ ఎన్నై
నేసత్తాల్ ఎప్పడియే ఎణ్ణి నిన్బాల్ సేర్త్తార్
ఎతిరాసా అప్పడియే నీ సెయ్దరుళ్

ప్రతి పద్ధార్ధం

తెసమ్ – అన్ని లోకములు
తిగళుమ్ – కీర్తిచే ప్రకాశముగా మెరుస్తూ ఉన్న
తిరువాఇమొళిప్ పిళ్ళై – తిరువాయ్ మొళినే తన జీవనాధారముగా ఉన్నందువలన ఆ పేరు పొందిన తిరువాయ్ మొళిప్ పిళ్ళైను
మాసిల్ – కళంకము లేకుండుటచే ఆచార్య్లుగా అభిమానము పొందిన
తిరుమలైయాళ్వార్ – శ్రీశైలనాథ అని ప్రసిద్ధమైన
ఎన్నై – అపరిమితమైన కరుణకు పాత్రమైన నేను
నేసత్తాల్ – కృపచే
ఎప్పడియే ఎణ్ణి – నేను ఎట్లు ముక్తి పొందెదను అను ఆలోచనే
నిన్బాల్ – మీ దివ్య చరణ కమలములందు మాత్రమే అందరికి ఆశ్రయము
సేర్త్తార్ – ఎట్లు మీ పాదపద్మములందు చేర్చెను
ఎతిరాసా – ఎమ్పెరుమానారే
అప్పడియే నీ సెయ్దరుళ్ – మీరూ నన్ను ఆశీర్వదించి ముక్తి ప్రసాదించుము

సామాన్య అర్ధం

ఈ పాశురమున మణవాళ మామునులు శ్రీ రామానుజులను వారి దివ్య కటాక్షముచే ముక్తి ప్రసాదించమని ప్రార్ధించెను. మణవాళ మమునులు తమ మదిలో శ్రీ రామానుజులు వారితో ఉన్న ఏ సంబంధముచే/కారణముచే కటాక్షించవలెనని ప్రశ్నించెనని ఊహించెను. ఆ ప్రశ్నకు మణవాళ మామునులు తమ, శ్రీ రామానుజులకు మధ్య సంబంధము తమ ఆచార్యులైన తిరువాయ్ మొళి పిళ్ళైల చే ఏర్పరచబడినది అని సమాధానము చెప్పెను. తిరువాయ్ మొళి పిళ్ళైలు తమ మీద కరుణ చూపి, ముక్తి ప్రసాధించ వలెనని ఆలోచించెను. అందునకు వారు శ్రీ రామానుజుల దివ్య పాద చరణములను ఆశ్రయించమని చూపి అవియే ముక్తి పొందుటకు ఒకే మార్గమని చెప్పెను.

వివరణ

మణవాళ మామునులు మొదటి రెండు వాక్యములలో తమ ఆచార్యులైన తిరువాయ్ మొళి పిళ్ళైల గొప్ప తనము వివరించెను. వారు శ్రీ రామానుజులతో, ” ఓ ఎమ్పెరుమానారే! అడియేన్ల ఆచార్యులైన తిరువాయ్ మొళి పిళ్ళై, నమ్మాళ్వార్ల పాద పద్మాములయందు శరణు కొరి ఆశ్రయించెను. కావున వారు మీ చరణములయందూ శరణు పొందెను. శ్రీవైష్ణవ పూర్వాచార్యులను తప్ప, ‘శేషి’ కాని ఎవ్వరిని వారు ఆశ్రయించలేదు. వారు ఙ్ఞానము, ఆధ్యాత్మిక విషయములందు భక్తి,మరియు లౌకిక సుఖములందు విరక్తి తో సంపుర్ణముగా వెలసియుండెను. వారి కీర్తి ఒక ఊరిలోనే కాకుండా ప్రపంచ నలుమూలలోనూ ప్రకాశించెను. వారి  పేరు సూచించునట్లే, తిరువాయ్ మొళియే వారి జీవనాధారం. తిరువాయ్ మొళిని తీసీనచో వారు జీవించలేరు. ఏ దోషము లేని వారు, తనను ఆచార్యునుగా ప్రకటించుటను  కూడ ఇష్ట పడుకపోవుటయేగాక, దానిని పాప కార్యముగా భావించెదరు.శైలనాధులని పిలవబడు వారు, అడియేనందు మిక్కిలి కరుణను చూపి, ముక్తి ప్రసాదించుటకు ఆలోచించెను. అందునకు వారు సంతోషించి , ముక్తి పొందుటకు శ్రీ రామానుజుల చరణ కమలమును ఆశ్రయించమని చెప్పెను. కావున తమను కరుణించి ఈ సంసారసాగరమునుండి  ముక్తిని ప్రసాదించమని మిమ్ము ప్రార్ధిస్తున్నాము.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/07/arththi-prabandham-12/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment