ఆర్తి ప్రబంధం – 23

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 22

paramapadhanathan

ప్రస్తావన

క్రిందటి రెండు పాశురములలో మణవాళమామునులు తమ ఆచార్యులైన తిరువాయ్ మొళి పిళ్ళైల మరియు పరమాచార్యులైన ఎమ్పెరుమాన్ల అనుగ్రహము గూర్చి వర్ణించెను. వారి ఇరువురి కరుణ తమపై ఉన్నందువలన, మణవాళ మామునులు వారి అనుగ్రహం విఫలమవనందువలన తాను తప్పక పరమపదము చేరి పరమాత్మ యొక్క సాన్నిధ్యమును అనుభవించెదను అని చెప్పెను. మణవాళమామునులు అతిశీఘ్రముగా “దివ్యస్థాన మండప” మున “దివ్య సింహాసన” మును అధిరోహించి ఉన్న ఎమ్పెరుమాన్ను అనుభవించవలెనని ఆశించెను. 

పాశురం 23

అడియార్గళ్ కుళాన్గళ్ అళగోలక్కమ్ ఇరుక్క
ఆనంతమయమాన మామణి మండపత్తు
పడియాదుమిల్ పడుక్కైయాయ్ ఇరుక్కుమ్ అనంతన్
పణమామణిగళ్ తమ్మిన్ ఒళి మణ్డలత్తిల్ ఇడైయిల్
వడివారుమ్ మామలరాళ్ వలవరుగు మఱ్ఱై
మణ్మగళుమ్ ఆయ్మగళుమ్ ఇడవరుగుమ్ ఇరుక్క
నడువాగ వీఱ్ఱిరుక్కుమ్ నారణనైక్ కడుగ
నాన్ అనుభవిక్కుమ్ వగై నల్గు ఎన్ ఎతిరాసా!!!

ప్రతి పద్ధార్ధం

ఎన్ ఎతిరాసా – ఓ! యతిరాజ!
కడుగ – (మీరు) శీఘ్రముగా
నల్గు – అనుగ్రహము
నాన్ – మాపై
అనుభవిక్కుమ్ వగై – అనుభవించుటకు
నారణనై – శ్రీవైకుంఠనాధుని
నడువాగ వీఱ్ఱిరుక్కుమ్ –  తామరపువ్వు వలే, మెరుపుల నడుమ ఉన్న దట్టమైన నీలిమేఘముల వలే, శ్రీభూనీళాదేవేరుల నడుమ ఆసీనులైన అన్ని జగములను ఏలువారగు
వడివారుమ్ మామలరాళ్ – “వైడ్వాయ్ నిన్ వలమార్బినిల్ వాళ్గిన్ఱ మన్గై (తిరుపల్లాన్డు 2)” లో వర్ణించ్చినట్లు అసమానమైన సౌందర్యమునకు మరియు మృదువైన స్వభావము గల పెరియ పిరాట్టి (శ్రీ దేవి అమ్మవారు)
వలవరుగు – కుడి వైపు
మఱ్ఱై మన్మగళుమ్ ఆయ్మగళుమ్ – భూమిదేవి మరియు నీళాదేవి
ఇడవరుగుమ్ ఇరుక్క – ఎడమ వైపు.
అడియార్గళ్ కుళాన్గళ్ – వీరేగాక నిత్యసూరుల మరియు ముక్తుల యొక్క అందమైన సమాహారము
( అనంతులు, గరుడాళ్వార్లు, విష్వక్సేనులు మొదలగు నిత్యసూరులు; పరాంకుశులు మరియు పరకాలులు వంటి ముక్తులు). ఇది చూచుటకు ముత్యము మరియు రత్నములతో కూడిన హారమువలే ఉండెను
అళగోలక్కమ్ ఇరుక్క – అందముగా గూర్చినట్టి
ఆనందమయమాన మామణి మన్డపత్తు – “తిరుమామణి మండపం” అను అనంత ఆనందముతో ప్రకాశించు దైవీక పీఠము
పణమామణిగళ్ తమ్మిన్ ఒళి మణ్డలత్తిల్ ఇడైయిల్ – వారి శిరస్సు నుండి వెదజల్లు దివ్యకాంతి
పడియాదుమిల్ – అసమానమైన
పడుక్కైయాఇ ఇరుక్కుమ్ – (శ్రీమన్నారాయణునికి) శయ్యగా ఉండు
అనంతన్ – “అనంతాళ్వాన్” అను వారు

సామాన్య అర్ధం

ఈ పాశురములో మణవాళమామునులు శ్రీరామానుజులను, తాము పరమపదము చేరి శ్రీ వైకుంఠనాధుని అనుభవించుటకు, వారిని శీఘ్రముగా అనుగ్రహించకోరెను. మణవాళమామునులు శ్రీ వైకుంఠనాధులను శ్రీ, భూ, నీళా దేవేరుల మధ్య తిరుమామణి మండటపమున విశిష్టులైన అనంత, గరుడ, విష్వక్సేనాదులగు నిత్యసూరులు మరియు ఆళ్వార్లు, ఆచార్యుల వంటి ముక్తులు చుట్టి ఉండగ ఆసీనులై ఉండెనని వర్ణించెను.

వివరణ

మణవాళమామునులు ” ఓ! యతిరాజ! “అడియార్గళ్ కుళాన్గళ్ (తిరువాయ్ మొళి 2.3.10)” మరియు “మామణి మంటపతు అన్తమిల్ పేరిన్బత్తడియార్ (తిరువాయ్ మొళి 10.9.11)” అను ప్రబంధ వాక్యములో పేర్కొనట్లు నిత్యసూరులు మరియు ముక్తులు అందముగా అనుక్రమించెను. అనంత, గరుడ, విష్వక్సేన మొదలగు నిత్యసూరులతోను, పరాంకుశ, పరకాల మరియు యతివరాది ముక్తులతోను. అందమైన ముత్యములు మరియు రత్నములతో కూర్చిన హారము వలే నిత్యసూరులు మరియు ముక్తులు “ఆనందమయాయమండపరత్నాయ నమః” అని వర్ణించబడు, అనంతమైన ఆనందము వెదజల్లు, మిక్కిలి ప్రకాశముతో వెలుగొందు “తిరుమామణి మండపం” మున కూడి ఉండిరి. ఆ మండపములో ” శ్రీమన్నారాయణునికి నిత్యమైన సేవకు మారుపేరైన వారు,  మృదుత్వము మరియు శీతలమునకు అసమానమైన విశిష్టమైన పన్నగపు శెయ్యయగు అనంతులు ఉండును. “ఆయిరమ్ పైన్తలై అనన్తన్ (పెరియాళ్వార్ తిరుమొళి 4.3.10)”, “సిఱప్పుడైయ పణన్గళ్ మిసైచ్చెళుమణిగళ్ విట్టెరిక్కుమ్ (పెరియాళ్వార్ తిరుమొళి 4.9.7)”, అన్డ్ “దెయ్వచ్చుడర్ నడువుళ్ (పెరియ తిరుమడల్ 1)” మొదలగు   అనేక ప్రబంద వాక్యములలో అనంతుని గూర్చి చెప్పబడి ఉన్నది. “వడివాయ్ నిన్ వల మార్బినిల్ వాళ్గిన్ఱ మన్గై (తిరుప్పల్లాణ్డు 2) మరియు “వడిక్కోల వాళ్ నెడున్కణ్ (ఇరణ్డామ్ తిరువన్దాది 82)” అని ప్రబంధములలో కీర్తించబడిన పెరియపిరాట్టి (అమ్మవారు), వారి సౌందర్యము మరియు కోమల స్వభావముచే గుర్తించబడెను. వారు శ్రీమన్నారాయణునికి కుడి వైపున అమరిఉండును. ఎడమ వైపు శ్రీదేవి యొక్క నీడయగు భూ, నీళ దేవేరులు ఉండును. శ్రీమన్నారాయణులు ఈ దేవేరుల నడుమ తామర వలే, మూడు మెరుపుతీగెల మధ్య ఉన్న దట్టమైన నీలిమేఘమువలే ఆసీనులై ఉండెను. వారు “వాళ్పుగళ్ నారణన్ (తిరువాయ్ మొళి 10.9.1)” అను వాక్యమున పేర్కొనట్లు ఈ జగములను ఏలుటకు అక్కడ ఆసీనులైన (“వీఱ్ఱిన్దు యేళులగమ్ తనిక్కోల్ సెల్ల (తిరువాయ్ మొళి 4.5.1) శ్రీవైకుంఠనాధుడు. ఓ యతిరాజ! జగదాచార్యా! మా మీద మీ అనుగ్రహమును కురిపీంచి ఆ శ్రీవైకుంఠనాధుని అనుభవించుటకు శీఘ్రముగా కరుణించుము” అని ప్రార్ధించెను.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/arththi-prabandham-23/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment