ఆర్తి ప్రబంధం – 25

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 24

EmperumAnar_thirukoshtiyur

ప్రస్తావన

ఈ పాశురములో మణవాళమామునులు,   శ్రీరామానుజుల మదిలో ఒక  ప్రశ్న  ఉదయించెనని భావించి, దానికి సమాధానము ఇచ్చెను.   శ్రీ రామానుజులు ” ఓ! మణవాళమామునీ! మీరు చేసిన పాపములను లెక్కించక, కైంకర్యము చేయుటకు ఆకాంక్షిస్తున్నారు. మేము ఇప్పుడు ఈ విషయమున ఏమి చేయవలెను.” అని ప్రశ్నించెనని మణవాళమామునులు భావించెను. దీనికి మామునులు ” ఓ! శ్రీ రామానుజా! మమ్ము మీరు మీ చెంత చేర్చుకున్న రోజునుండి నేటి వరకు మీరు మా పాపకర్మములను సహనముతో క్షమించిరి. మాకు అర్హతలేనప్పటికి మీరు మేము పరమపదమును చేరుటను ధృవీకరించిరి. ఇంకను మీరు ఆలస్యము చేయక మాకు త్వరగా మోక్షము ప్రసాదించండి” అని సమాధానముగా  ప్రార్ధించెను.

పాశురం 25

ఎన్ఱు నిర్హేతుకమాగ ఎన్నై అభిమానిత్తు
యానుమ్ అదఱిన్దు ఉనక్కేయాయిరుక్కుమ్ వగై సెయ్దాఇ
అన్ఱు ముదల్ ఇన్ఱళవుమ్ అనవరతమ్ పిళైయే
అడుత్తడుత్తుచ్ చెయ్వదు అనుతవిప్పదు ఇనిచ్చెయ్యేన్
ఎన్ఱు ఉన్నై వందు ఇరప్పదాం ఎన్ కొడుమై కణ్డుమ్
ఇగళాదే ఇరవుపగల్ అడిమై కొణ్డు పోన్దాయ్
ఇన్ఱు తిరునాడుమ్ ఎనక్కు అరుళ ఎణ్ణుగిన్ఱాయ్
ఇనిక్ కడుగచ్ చైదరుళవేణ్డుం ఎతిరాసా!!!

ప్రతి పద్ధార్ధం

ఎతిరాసా – ఓ! యతిరాజా! మా ఆచార్యా!
ఎన్ఱు – ఆ రోజు నుండి
నిర్హేతుకమాగ – (ఎప్పుడైతే మీరు) ఏ కారణము లేక
ఎన్నై – మా యందు మీ దృష్టి ప్రసరించెనో
అభిమానిత్తు – ” మేము (మణవాళ మామునిగళ్) మీ వారమని”
యానుమ్ – మేము కూడ
అదఱిన్దు – అది తెలుసుకున్నాము
ఉనక్కే – మీకు మాత్రమే (కైంకర్యము చేయుటకు)
ఆయిరుక్కుమ్ – (మమ్ము తయారు పరుచుకొనెను) మీకు మాత్రమే చెందిన వస్తువు అని
సెయ్దాయ్ – మేరే ఇది చేసారు కదా?
వగై – మాకు మీ పట్ల ఉన్న ఇట్టి విధమగు విషయమును
అన్ఱు ముదల్ – ఆనాటి నుండి
ఇన్ఱళవుమ్ – నేటి వరకు
అనవరతమ్ – (మేము) ఎల్లప్పుడు
అడుత్తడుత్తు – నిరంతరము
చైవదు – చేయుచున్నాము
పిళైయే – పాపకర్మములు మాత్రమే
అనుతవిప్పదు – మరియు ఆ పాపములను తలచి వెంటనే పశ్చాత్తాపమునొందును
ఇని – ఇంకను
చెయ్యేన్ ఎన్ఱు – మేము చేయవలదని (అట్టి పాపములను)
ఉన్నై వన్దు ఇరప్పదామ్ – మేము మీ వద్ద వచ్చి మీ సహాయము కోరెదము
ఎన్ కొడుమై కణ్డుమ్ – మీరు, అట్టి భయంకరమైన మా పాపములను చూచి కూడా
ఇగళాదే – మమ్ము నిరాకరించలేదు
అడిమై కొణ్డు పోన్దాయ్ – మీరు మమ్ము మీ పాదపద్మములందు కైంకర్యము చేయుటకు అనుమతించిరి
ఇరవుపగల్ – రేయింబగలు
ఇన్ఱు – (నిలుపక) నేడు
ఎణ్ణుగిన్ఱాయ్ – మీరు విచారించెదరు
అరుళ – అనుగ్రహించి
ఎనక్కు – మాకు
తిరునాడుమ్ – పరమపదమును
ఇనిక్ కడుగ – కావున త్వరగా
చైదు అరుళవేణ్డుమ్ – దానిని అనుగ్రహించుము

సామాన్య అర్ధం

ఈ పాశురమున మణవాళమామునులు, శ్రీ రామానుజులను తమకు త్వరగా పరమపదము చేరుటకు చీటి ఇవ్వవలెనని అడిగెను. “మణవాళమామునులు తన వారని” తలచి శ్రీ రామానుజులు తమ పాదపద్మములందు తనను చేర్చుకున్న నాటి నుండి నేటి వరకు, తాము నిరంతరము ఎనలేని పాపములను చేయుచుండెనని మణవాళమామునులు చెప్పెను. ఆ పాపకర్మములను చేసిన వెంటనే అది తలచి పశ్చాత్తాపము చెందెదను, కాని ఆ పాపములను చేయుటకొనసాగుచుండెనని మణవాళమామునులు చెప్పెను. ఇదియే చాల కాలముగా కొనసాగుచుండెను. మరియు ఇన్నిరోజులు, శ్రీ రామానుజులు తమ ఈ పాపములను లెక్కించనూలేదు, ఇంకను ద్వేషించనూలేదు. మారుగా వారి చరణకమలమున ప్రతినిత్యము కైంకర్యము చేయుటకు అనుమతించెనని మణవాళమామునులు పలికెను. ఈనాడు కూడ శ్రీ రామానుజులు, మణవాళమామునులకు పరమపదమును అనుగ్రహించుటకు ఆలోచించుచుండెను. మణవాళమామునులు శ్రీ రామానుజులను, ఒకవేళ ఇదియే ఇప్పటికీ స్థితియనగా, ఎందులకు ఈ ఆలస్యము, త్వరగా తనను అనుగ్రహించమని కోరెను.

వివరణ

మణవాళమామునులు , ” ఓ!! యతిరాజా! ‘ఈ ఆత్మ మీకు చెందినది’ అని తలచుటచే మీరు ఈ ఆత్మను అనుగ్రహించినారు. ఏ కారణము లేకనే మీరు ఈ కార్యమును చేసారు. మాకు అది తెలియును, మీ కృపకు ధన్యవాదములు. మేము మీకు మాత్రమే చెందిన ఒక వస్తువేయైననూ, మీ చరణకమలములను ఆశ్రయించిన నాటి నుండి నేటి వరకు మేము నిరంతరము పాపకర్మములను మాత్రమే చేయుచున్నాము. వాటిని చేసిన వెంటనే పశ్చాత్తాపము చెంది మీ సాయమును కోరెదము. మీరు మేము చేసిన పాపములను చూచి మమ్ము తోసివేయనూలేదు, ద్వేషించనూలేదు. కాని వాటికి విరుద్ధముగా, మీరు మాకు మీ పాదపద్మములయందు ఎల్లప్పుడు కైంకర్యము చేయుటకు అనుమతించిరి. అంతయేగాక, మీరు నేడు గొప్ప వారికే యోగ్యమగు పరమపదమును, మాకు అనుగ్రహించవలెనని తలచుచున్నరు. మాకు ఏవిధమునను పొందుటకు అర్హతలేని పరమపదమునకు చీటి ఇచ్చుటకు మీరు ఆలోచించుచున్నారు. అట్టి ఆలోచన మీకు ఉన్నప్పుడు, ఇంకను ఎందులకు ఆలస్యము? దయచేసి మమ్ము త్వరగా అనుగ్రహించండి” అని శ్రీ రామానుజులను ప్రార్ధించెను.

అడియేన్ వైష్ణవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/arththi-prabandham-25/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

0 thoughts on “ఆర్తి ప్రబంధం – 25”

Leave a Comment