శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః జ్ఞానసారము << పాశురము 38 అవతారిక పై పాశురముల సారము ఆచార్యల ఔన్నత్యమును తెలియజేయుట , అది తెలిసుకున్నవారు , ఆచార్యుని శ్రీపాదముల యందు భక్తి కలిగి వున్న వారు గొప్ప జ్ఞానులు. ఆ గురు భక్తిని తెలుసుకోలేని లోకులు వీరిని మీద ‘ భగవంతుడి కన్నా గురువునే గొప్పగా భావించి వారి వెనక తిరుగుతున్నారన్న ‘ నిందను మోపు వారికి ఈ పాశురములో జవాబు కనపడుతుంది . భగవంతుడి విషయములో ఆయన స్వరూప , రూప, విభవములను తెలుపు కథల యందు ప్రేమ కలిగియున్న భగవద్భక్తులు ఆచార్యుల గొప్పదనమును గ్రహించక , ‘ భగవంతుడి యందు కాక మానవ మాత్రుడైన ఆచార్యుల యందు ప్రేమను కలిగి వున్నారు ‘అని మాట్లాడే వారికి ఇక్కడ సమాధానము దొరుకుతుంది . ఆచార్యుల యందు భక్తి చేయువారిని నిందిస్తే ఆ నింద వారికి స్తుతియే అవుతుంది కాని నింద కాదు . ఇది నిందాస్తుతి అలంకారములాగా అమరుతుంది . ఇక్కడ ఒక చిన్న … Read more