జ్ఞానసారము 36

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 35

అవతారిక

                  సచ్చిష్యునికి 108 దివ్యదేశములు , తన ఆచార్యుని శ్రీపాదములే  అని ఈ పాశురములో చెపుతున్నారు.

nammalwar-final

పాశురము

“విల్లార్ మణికొళిక్కుం వేంకడ పొఱ్ కున్ఱు ముదల్

సెల్లార్ పొళిల్ సూళ్ తిరుప్పదిగళ్ ఎల్లాం

మరుళాం ఇరుళోడ మతగతు తన్ తాళ్

అరుళాలే వైత్త అవర్”

ప్రతిపదార్థము

విల్లార్ = ప్రకాశవంతమైన

మణి = రత్నములను

కొళిక్కుం = అనంతముగా ఇచ్చే

వేంకడం పొఱ్ కున్ఱు ముదల్ = అందమైన బంగారు కొండ తిరుమల మొదలు

సెల్లార్ = మేఘములచే ఆవరించబడిన

పొళిల్ = తోటలతో

సూళ్ = నిండిన

తిరుప్పదిగళ్ = దివ్యదేశములు

ఎల్లాం = అన్నీ

మరుళాం ఇరుళ్ = అజ్ఞానముచే అవరింపబడిన చీకటి

ఓడ = త్వరగా తొలగిపోవుటకు

మతగతు = శిష్యిని తల మీద

తన్ తాళ్ = తన శ్రీపాదములను

అరుళాలే = మహా  కృపచేత

వైత్త = పెట్టిన

అవర్ = ఆచార్యులు వారే

వ్యాఖ్యానము

విల్లార్ మణికొళిక్కుం …… ” విల్ ” ప్రకాశము.’ ఆర్ ‘ అసమామైన . ” విల్లార్ ” అనగా అసమాన ప్రకాశావంతమైన మణులు .

నన్మణి వణ్ణనూర్ ఆవియుం కోళరియుం

పొన్ మణియుం ముత్తముం పూమరముం – పన్మణి

నీరోడు పొరుదుగళుం కానముం వానరముం

వేడుముడై వేంగడం      (నాన్ముగన్ తిరువందాది -48)

అన్న పాశురములో  యాళీ ( సింహము ఏనుగు కలిసిన రూపము ) సింహములను ,వెండి ,బంగారము , ముత్యములు ,మణులు మాణిక్యాలు , పూల చెట్లు ,గలగల పారే సెలయేరులు  , అడవులు , కోతులు , వేటగాళ్ళతో నిండిన తిరువేంగడము (తిరుమల) అన్నట్టుగా ….

సెల్లార్ పొళిల్ సూళ్ .……… బాగా ఎత్తుగా వుండి మేఘములు ఈ కొండల మధ్యగా పోతూ వుంటే , ‘పైకి వెళితే మేఘాలను అందుకోవచ్చు కదా! ‘అని అనిపిస్తూ అందముగా ఆహ్లాదముగా కనిపిస్తున్న ….

వేంకడ పొఱ్ కున్ఱు ముదల్.…….. ప్రకృతి వనరులతో , సహజ సుందరముగా , ఆహ్లాదముగా , బంగారు కొండగా విరాజిల్లుతున్న తిరువేంగడము (తిరుమల)మొదలు ….

తిరుప్పదిగళ్ ఎల్లాం.……….పెరుమాళ్ళకు ఇష్టమైన  108 దివ్య దేశముల వరకు అన్నీ ముఖ్యమని భావించే ( ఆచార్య అనుగ్రహము కన్నా మిన్నఅని భావించే)

మరుళాం ఇరుళోడ .…. అజ్ఞానమనే చీకటినితొలగదోయటానికి

మతగతు తన్ తాళ్ అరుళాలే వైత్త అవర్..…….శిష్యుని అనుగ్రహించటానికి  ఆచార్యులు తన శ్రీపాదాల శిష్యుని శిరస్సు మీద ఉంచడానికి కారణము , తన నిర్హేతుకమైన కృప తప్ప మరొక హేతువు కనపడదు . ఒక వేళ శిష్యుడు చేసే శుస్రూషలు కారణమా ? అంటే కాదు .కేవలము శిష్యుడి  మీద తనకున్న ప్రేమ వలననే  అనుగ్రహించారు .  పరమాత్మ వేంచేసి ఉండే శ్రీవైకుంఠము , పాలకడలి, రామకృష్ణాది విభవావతారాలు , సమస్త వస్తువులలోను అంతరముగా నిలిచి వున్న అంతర్యామి, కోవెలలో వేంచేసి వుండే అర్చామూర్తి  అనే ఐదు  రూపములు అమరి వున్న తిరుమలను ఉదహరించడము వలన అవి అన్నీ ఆచార్యుల శ్రీపాదములకు సమము అని చెపుతున్నారు  .అర్థాత్ ఇవన్నీ తనకు ఆచార్యులే అని శిష్యుడు గ్రహించాలి . శ్రీవచన భూషణములో ” పాట్టు కేట్కుం ఇడముం కూప్పిడు కేట్కుం ఇడముం కుదిత్త ఇడముం వళైత్త ఇడముం ఊట్టుం ఇడముం ఇవై ఎల్లాం వగుత్త  ఇడమే ఎన్ఱు ఇరుక్క కడవన్  ” అన్న చూర్ణికను ఇక్కడ అన్వయించుకోవాలి.

పాట్టు కేట్కుం ఇడముం = పరమపదము

కూప్పిడు కేట్కుం ఇడముం = పాలకడలి

కుదిత్త ఇడముం = రామ, కృష్ణాది విభవావతారములు

వళైత్త ఇడముం = అంతర్యామిత్వం

ఊట్టుం ఇడముం = దేవాలయలలో వేంచేసివున్న అర్చారూపము

ఇవై ఎల్లాం  = ఇవి అన్నీ

వగుత్త ఇడమే ఎన్ఱు ఇరుక్క కడవన్= అచార్యులే అని భావించాలి.

కావున శిష్యునికి ఆచార్య స్థానమే, పరమాత్మ వేంచేసి వున్న 108 దివ్యశములు అని చెపుతున్నారు .

ఇరామానుశ నూత్తందాది 106వ పాశురములో ఈ విషయాన్నే

ఇరుప్పిడం వైకుందం వేంగడం మాలిరుంచోలై ఎన్ఱుం

పొరుపుడం మాయనుక్కు ఎన్ బర్ నల్లోర్ అవై తన్నొడుం వందు

ఇరుప్పిడం మాయన్ ఇరామానుసన్ మనత్తు ఇన్ఱవన్ వందు

ఇరుప్పిడం ఎన్ఱన్ ఇదయతుళ్ళే తనకు ఇన్బుఱవే

అన్నారు తిరువరంగత్తముదనార్లు .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/03/gyana-saram-36-villar-manikozhikkum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసంhttp://pillai.koyil.org

Leave a Comment