జ్ఞానసారము 33

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 32

అవతారిక

                  అందుబాటులో వున్న ఆచార్యుని సామాన్య మనిషిగా భావించి వదిలి వేసి అందుకోవటానికి కష్టమైన భగవంతుడిని కోరికలు తీర్చు వాడని భావించి ఆయనను వెదికే మూర్ఖుడు అని ఉదాహరణ సహితముగా ఈపాశురములో చెప్తున్నారు.

“ఎట్ట ఇరుంద గురువై ఇఱైఅన్ఱు ఎన్ఱు

విట్టు ఓర్ పరనై విరుపుఱుదల్ – పొట్టనత్తన్

కణ్ సెంబళితిరుందు కైతురుత్తి నీర్ తూవి

అంబుదత్తై పార్తిరుపాన్ అఱ్ఱు”

ప్రతిపదార్థము

ఎట్ట ఇరుంద = అందుబాటులో వున్న

గురువై = ఆచార్యుని

ఇఱైఅన్ఱు ఎన్ఱు =(తగిన వాడు ) నాయకుడు కాదని

విట్టు = ఉపేక్షించి

ఓర్ పరనై = చేరుకోవడానికి కష్టమైన భగవంతుని

విరుపుఱుదల్ = కోరుకోవటము

పొట్టన = గబుక్కున

త్తన్ కణ్ = తన కన్నులను

సెంబళితిరుందు =మూసుకొని

కైతురుత్తి నీర్ = దాహార్తిని తీర్చుకోవాటనికి ఉంచుకొన్న నీటిని

తూవి = పారబోసి

అంబుదత్తై = మేఘముల వైపు

పార్తిరుపాన్ అఱ్ఱు = నీటి  కోసము చూసేవాడిలా ఉంటుంది

వ్యాఖ్యానము

ఎట్ట ఇరుంద గురువై……అందుబాటులో వున్న అనగా ఈ లోకములోనే ఉన్న అచార్యులని అర్థము. ఎప్పుడై నా ఆశ్రయించటానికి శులభుడు , రక్షించు వాడు , మనసుకు దగ్గరైన వాడు , ఆత్మొజీవనమునకు ఉపకరించు వాడు ,ఎప్పుడు ఏ సందేహము వచ్చినా నివృత్తి చేసే వాడు ఆచార్యుడు అని అర్థము .

ఇఱైఅన్ఱు ఎన్ఱు విట్టు……..ఈయన తగిన వాడు కాదని భావించి 31వ పాశురములో “శరణాగతి తంద  తన్ ఇఱైవన్ తాళే ”( శరణాగతి శాస్త్రాన్ని ఇచ్చిన తన దైవము శ్రీపాదములే శరణము ) అన్న మాటకు విరుధ్ధముగా ఆచార్యుని తనకు దైవముగా  భావించక, మనలాగా సామాన్య మానవుడని  భావించుట .

ఓర్ పరనై విరుపుఱుదల్ …..ఎంతో ఉన్నతమై , పొందుటకు కష్టమైన  భగవంతుని కోరుకొనుట వంటిది . అర్థాత్ శాస్త్రములు క్రమ పధ్ధతిలో అధ్యయనము చేసి తెలుసుకోవలసిన వాడు , ఆశ్రయించుటకు దూరస్తుడు అయిన భగవంతుని ఆశ్రయించాలని భావించుట . ఇది ఎలాంటిదంటే….

పొట్టన.……..అనాలోచితముగా , వెనక వచ్చె విపరీత పరిణామాలాను యోచించకుండా….

త్తన్ కణ్ సెంబళితిరుందు .……కళ్ళు మూసుకొని ముందు వెనక చూసుకోక..

కైతురుత్తి నీర్ తూవి..…….దాహము వేసినపుడు దాహార్తిని తీర్చుకోవడము కోసము భద్రపరచిన నీటిని నేలపాలు చేసినట్లు …..

అంబుదత్తై పార్తిరుపాన్ అఱ్ఱు….….ఆకాశములో మేఘాలను చూసి ,అవి వర్షిస్తే దాహార్తి తీర్చుకుందామని భావించుట .  దీనిని “తొలిల్ల్ ఉవమం”  అంటారు .అంటే చెసే పనిలో ఉపమానము చూపుట . ఆచార్యుని వదిలి భగవంతుని వైపు చూసేవాడు , చేతిలో నీటిని పారబోసుకొని ఆకాశములో మేఘాలవైపు చూసేవాడూ సమానమైన మూర్ఖులని నిరూపిస్తున్నారు . శ్రీవచభూషణము 449 లో “విడాయ్  పిఱందపోదు కరస్థమాన ఉధగత్తై  ఉపేక్షిత్తు జీమూత జలదయుం, సాగర సలిలత్తైయుం, సరీ సలిలత్తైయుం వాపీ కూప పయసుకలయుం వాంజిక్క కడవన్ అల్లన్” ( దాహము వేసినప్పుడు కరస్థమైన నీటీని ఉపేక్షించి మేఘములలోని నీటి కోశము , సముద్రపు నీటిని , నదులు నీటిని , సరస్సులలో నీటిని , భావిలో నీటిని కోరుకున కూడదు )అని ఈ విషయముగా ప్రస్తావించి వున్నారు .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలముhttp://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-33-etta-irundha-guruvai/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసంhttp://pillai.koyil.org

Leave a Comment