జ్ఞానసారము 37

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 36

images

అవతారిక

                  తన ధనము , ప్రాణము , దేహము అన్నీ ఆచార్యుని సొత్తుగా భావించే శిష్యుని హృదయములో  శ్రీమన్నారాయణుడు కొలువై వుంటాడని స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు ఈ పాశురములో చెపుతున్నారు .

“పొరుళుం ఉయిరుం ఉడంబుం పుగలుం

తెరుళుం గుణముం సెయలుం అరుళ్ పురింద

తన్నారియన్ పొరుట్టా చంగఱ్పం సెయ్బవర్ నెంజు

ఎన్నాళుం మాలుక్కు ఇడం”

ప్రతిపదార్థము

పొరుళుం = తన సంపద

ఉయిరుం = ప్రాణము

ఉడంబుం = దేహము

పుగలుం = నివాసము

తెరుళుం  = బుధ్ధి

గుణముం = మంచి గుణములు

సెయలుం = తాను నిర్వహించే క్రియలు అన్నీ

అరుళ్ పురింద = తనపై కృపను చూపి శిష్యునిగా స్వీకరించిన

తన్నారియన్ పొరుట్టా = తన ఆచార్యులదిగా

చంగఱ్పం సెయ్బవర్ = భావించే వారి

నెంజు = హృదయము

మాలుక్కు = పరమాత్మకు

ఎన్నాళుం = ఎప్పటికీ

ఇడం = నివాస స్థానమవుతుంది

వ్యాఖ్యానము

పొరుళుం …..తన సమస్త సంపదను

ఉయిరుం …తన ప్రాణమును

ఉడంబుం …దేహమును

పుగలుం….తన నివాసమును

తెరుళుం…..తన బుధ్ధి కుసలత, జ్ఞానము మొదలైనవాటిని

గుణముం …..తన మంచి గునమునులను

సెయలుం …..తాను చేయు సమస్త క్రియలను

అరుళ్ పురింద తన్నామురియన్ పొరుట్టా…ఎంతో కృపతో తనకొ మంత్రోపదేశము చేసిన ఆచార్యులదిగా

చంగఱ్పం సెయ్బవర్ నెంజు….ఎప్పటికీ భావించే వారి హృదయము

ఎన్నాళుం మాలుక్కు ఇడం…… సర్వకాల సర్వావస్తలలోను భగవంతునికి ప్రీతికరమైన స్థానము …..  ఏ శిష్యుడు తన సమస్త పరికరములను తన ఆచార్యునిదిగా భావిస్తాడో అతని హృదయము  భగవంతునికి సర్వకాల సర్వావస్తలలోను ప్రీతికరమైన స్థానము అవుతుంది అని ఈ పాశుర భావము . మధుర కవులు ” తేవు మత్తు అరియేన్” ,“అన్నైయాయ్ అత్తనాయ్  ఎన్నై ఆండిడుం  తన్మయాన్ శఠకోపన్ ఎన్ నంబియే”, అని ఆచార్యులైన శఠకోపులే సమస్తమని విస్వసించినవారు .  స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు  “తెరుళారుం మధురకవి నిలై తెళిందోన్ వాళియె” కీర్తింపబడ్డారు.  ఆండాళ్ కూడా తమ ఆచార్యులైన విష్ణుచిత్తులే సమస్తమన్న విశ్వాసము కలిగి వుండింది.  ఆమె తన నాచ్చియార్ తిరుమొళిలో  “విల్లుపుదువై విట్టుతుచిత్తర్ తంగళ్ దేవరై  వల్ల పరిసు వరువిపరేల్ అదు కాండుమే ‘ (నాచ్చియార్ తిరుమొళి 10-10).అన్న మాట ఇక్కడ గ్రహించతగినది .

అడియేన్ చూడామణి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/03/gyana-saram-37-porulum-uyirum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసంhttp://pillai.koyil.org

Leave a Comment