Category Archives: Other

ఆర్తి ప్రబంధం – 31

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 30

emperumAnAr-nammAzhwAr

పరిచయము: 

మునుపటి పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజులకు పలుమార్లు మంగళం పాడటం మనము చూశాము. అందరూ ప్రీతితో అలవరచుకోవలసిన విషయమది. ఈ పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజుల శౌర్యానికి నమస్కరిస్తూ మంగళం పాడుతున్నారు. అయితే వేద విరుద్దమైన అర్థాలను భోదించు వారిని, ఆ వేదార్థముల అసలు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోని వారి వాదనలను నాశనం చేసిన శ్రీ రామానుజుల శౌర్యాన్ని కీర్తిస్తున్నారు. మునుపటి పాశురములో శ్రీ రామానుజుల తిరుమేనికి మంగళాలు అందించగా, ఈ పాశురములో వారి గుణానుభవము చేస్తున్నారు.

 పాశురము 31

అరుశమయ చ్చడి అదనై అడి అఱుత్తాన్ వాళియే!!!
అడర్ందు వరుం కుదిట్టిగళై అఱత్తుఱందాన్ వాళియే!!!
శెఱు గలియై చ్చిఱిదుం అఱ తీర్ త్తు విట్టాన్ వాళియే!!!
తెన్నరంగర్ శెల్వ ముఱ్ఱుం తిరుత్తి వైత్తాన్ వాళియే!!!
మఱైయదనిల్ పొరుళ్ అనైత్తుం వాయ్ మొళిందాన్ వాళియే!!!
మాఱనుఱై శెయ్ద తమిళ్ మఱై వళర్ త్తోన్ వాళియే!!!
అఱమిగు నఱ్పెరుంబూదూర్ అవదరిత్తాన్ వాళియే!!!
అళగారుం ఎతిరాశర్ అడియిణైగళ్ వాళియే!!!

ప్రతి పద్ధార్ధములు

వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
అడి అఱుత్తాన్ –  వేర్లతో సహా పెకిలించి నాశనం చేసినవాడు
అరుశమయ చ్చడి అదనై – వేదాలలో చెప్పబడిన దాని ప్రకారం నడుచుకోని ఆరు సిద్దాంతములు.
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
అఱత్తుఱందాన్ – పూర్తిగా తరిమి కొట్టినవాడు
అడర్ందు వరుం –  అందరూ కలిసి పెద్ద సంఖ్యలో వచ్చినవారు
కుదిట్టిగళై– వేదములను వక్రీకరించిన, “నాన్ మఱైయుం నిఱ్క క్కుఱుంబుసెయ్ నీసరుం మాణ్డనర్” అన్న వాఖ్యములో వలే “కుదృష్థులు” అని అర్థం
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
తీర్ త్తు విట్టాన్ – నాశనం చేసినవాడు
శెఱు గలియై – “కళి” అని పిలువబడే ప్రమాదకరమైన, విస్తృతంగా వ్యాపించి ఉన్న దుష్ట శక్తి
అఱ – వదలకుండా
చ్చిఱిదుం – ఒక చిన్న అణువు
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
తిరుత్తి వైత్తాన్ – ఆదేశించి పరిపాలించినవాడు
శెల్వ ముఱ్ఱుం – సమస్థ సంపద
తెన్నరంగర్ –  అందముతో నిండి ఉన్న పెరియ పెరుమాళ్ (శ్రీ రంగనాధుడు)
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
వాయ్ మొళిందాన్ –  తమ దివ్య వాక్కులను మనకి అందించిన (శ్రీ భాష్యం)
పొరుళ్ అనైత్తుం – అన్ని శాస్త్రములలో
మఱైయదనిల్ – వేదాలలో ప్రచారం చేయబడిన
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
వళర్ త్తోన్ – ప్రచారం చేసి వ్యాప్తి చేసినవాడు
తమిళ్ మఱై – తమిళ వేదము
ఉఱై శెయ్ద – ఇవ్వబడిన
మాఱన్ – నమ్మాళ్వార్
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
అవదరిత్తాన్ – అవతరించినవాడు
నఱ్పెరుంబూదూర్ – “శ్రీపెరుంబుదూర్” అని పిలువబడే పవిత్ర దేశం
అఱమిగు – తమిళ వేదంలో చెప్పబడిన విధంగా “సంపూర్ణ శరణాగతి” ని వ్యాప్తి చేయుట
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
అడియిణైగళ్ – ఏకైక ఆశ్రయం, పాద పద్మములు
ఎతిరాశర్ – శ్రీ రామానుజులు
అళగారుం – సౌదర్యము మొదలైన గుణాలతో నిండి ఉన్న

సరళ అనువాదము:

శ్రీ రామానుజులు చిరకాలం వర్ధిల్లాలని మణవాళ మామునులు ఈ పాశురములో కోరుకుంటున్నారు. (1) వేద విరుద్దమైన ఆరు మహావృక్షాల లంటి సిద్దాంతాలను మటుమాయం చేసినవారు (2) వేద అపరాధులను తరిమికొట్టినవారు (3) ఈ ప్రపంచములో కలిని కలిప్రభావాన్ని నామరూపాలు లేకుండ చేసినవారు (4) శ్రీరంగాన్ని పునరుద్ధరింపజేసి, పూజా విధానములను క్రమబద్ధీకరింప చేసినవారు (5 “శ్రీ భ్యాష్యం” రూపంలో మనందరికీ వేదముల యదార్థములను ప్రసాదించినవారు (6) ఆసక్తిగల వాళ్ళల్లో తిరువాయ్మొళి సారాన్ని ప్రచారం చేసినవారు (7) అద్భుతమైన శ్రీపెరంబుదూర్లో అవతరించినవారు.  అందరికీ ఏకైక ఆశ్రయమైన అటువంటి శ్రీ రామానుజుల దివ్య శ్రీ పాదాలు చిరకాలము వర్ధిల్లాలి.

వివరణ:

మణవాళ మామునులు శ్రీ రామానుజుల స్వరూప లక్షణాలకు మంగళం పాడుతున్నారు. మొదట, వారు ఆరు మహా వృక్షముల వంటి వేద విరుద్దమైన సిద్దాంతములను వాటి వేర్లతో సహా పెలికి నామరూపములు లేకుండా సర్వనాశనం చేసిన మహానుభావునిగా శ్రీ రామానుజులను ప్రశంసిస్తూ కీర్తి పాడటం ప్రారంభిస్తున్నారు. “సాఖ్యోలుఖ్యాక్షపాదక్ష్పణక కపిలపతంజలి మదాణుసారిణః” అనే వాఖ్యము ప్రకారం, వేద విరుద్దమైన ఆరు తత్వశాస్త్రములున్నాయి. శ్రీ రామానుజులు వాటిని మూలముతో సహా పూర్తిగా నాశనం చేశారు. వాళ్ళందరినీ ఉక్కిరి బిక్కిరి చేసిన శ్రీ రామానుజులుకు మణవాళ మామునులు కీర్తి పాడుతున్నారు.  “నాన్ మఱైయుం నిఱ్క క్కుఱుంబు సెయ్ నీసరుం మాణ్డనర్ (ఇరామానుశ నూఱ్ఱందాది 99)” అనే ప్రబంధంలో వివరించినదాని ప్రకారంగా – వీళ్ళందరు ఎరెవరో కాదు, వేదములను వక్రీకరించినవారే అని అర్థమౌతుంది. “కలి” కారణంగా వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అలోచనలను విసృతంగా ప్రచారం చేసి వ్యాప్తి చేయగలిగారు, ఈ ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తారు. “అఱుసమయం పోనదు పొన్ఱి ఇఱందదు వెంకలి” అని ఇరామానుశ నూఱ్ఱందాది 49 వాఖ్యములో వివరించబడింది. ఏదేమైనా, ఈ ప్రపంచంలో కలిని, దాని ప్రభావాన్ని జాడని లేకుండా శ్రీ రామానుజులు నిర్ధారించారు. మణవాళ మామునులు అటువంటి దయగల శ్రీ రామానుజులకు కీర్తి పాడుతున్నారు. దీని తరువాత,  “శ్రీమన్ శ్రీరంగశ్రీయం అనుభద్రవాం అనుదినం సంవర్ధయా” అన్న వాఖ్యము ప్రకారం, శ్రీరంగ సంపదను, ఆ దివ్య క్షేత్రము యొక్క దినచర్యను క్రమబద్ధీకరించిన శ్రీ రామానుజులకు మంగళం పాడుతున్నారు. 

వేదములు వాటిని వివరించే వ్యక్తిపై ఆధారపడి ఉండుట చేత అవి నిత్యము భయం భయంగా ఉండేవి. వేదములను సమగ్రంగా అన్వయించక పోతే వాటి అసలు ఉద్దేశ్యాన్ని పొందలేరుము, అందువల్ల అనువాదంలో చాలావరకు కోల్పోయే అవకాశం ఉంది. శ్రీ రామానుజులు వేదార్థములను పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత “శ్రీ భ్యాష్యం”ని (వేద వ్యాసుని బ్రహ్మ సూత్రాలకు భాష్యము) రచించి వేదముల యొక్క ఈ భయాన్ని తొలగించగలిగారు. వేదముల నిగూఢ అర్ధముల సారాన్ని వ్యాప్తి కూడా చేశారు. ఇంతటి మహోపకారాన్ని మనకందించిన శ్రీ రామానుజులను మణవాళ మామునులు కీర్తిస్తున్నారు.  తిరువాయ్మొళి యొక్క తనియన్ల లో, “వాళర్త ఇడత్తాయి ఇరామానుశ” అని ఒక వాఖ్యము ఉంది.  తమిళ వేదముగా ప్రఖ్యాతిగాంచిన “తిరువాయ్మొళి“ని ప్రచారము చేసిన శ్రీ రామానుజులకు మణవాళ మామునులు మంగళము పాడుతున్నారు. తిరువాయ్మొళిలో తెలుపబడిన శరణాగతి  సారాన్ని ప్రజలలో వ్యాప్తింపజేశారు. ఇది సామాన్యులకు చేరువ కావడానికి శ్రీపెరుంబుదూర్లో అవతరించిన శ్రీ రామానుజులు మాత్రమే కారణమని చెప్పవచ్చు. మానవాళికి చేసిన ఈ అద్భుతమైన సేవకు మణవాళ మామునులు వారికి వందనాలు సమర్పించుకుంటున్నారు.

చివరగా, మణవాళ మామునులు “సౌందర్యంతో నిండి ఉన్న శ్రీ రామానుజుల అద్భుతమైన దివ్య పాదయుగళి దీర్ఘకాలం జీవించనీ” అని చెప్పి ముగిస్తున్నారు. “అళగారుం” అనే పదం “అడియిణైగల్”కి (పాద పద్మములు) నామవాచకంగా  ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిలో చూపించినచో, ఆ రెండు పాదాలు రెండు అందమైన తామర పువ్వులతో సమానంగా ఉంటాయని అర్థము చేసుకోవచ్చు. అంతే కాదు, ఇది శ్రీ రామానుజుల దివ్య పాదముల సహజ సౌందర్యాన్ని కూడా సూచిస్తుంది. “అఱమిగు నార్ పెరుంబూదుర్” అనే వాక్యముకి శ్రీ రామానుజులు ధర్మ ఉపాసకులైన వ్యక్తి అని అర్ధం, “ఇరామానుసన్ మిక్క పుణ్ణియన్ (ఇరామానుశ నూఱ్ఱందాది 91)” అనే ప్రబంధ వాఖ్యములో చూపబడింది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/12/arththi-prabandham-31/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – 11 – 20

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<<తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 1 – 10

Mahavishnu-universes-2

పాశురము 11

అవతారిక: ఆళ్వార్లు సకల చేతనాచేతన పదార్థాలు తనలాగానే పరమాత్మ ఎడబాటును సహించలేక విలపిస్తున్నట్లు భావించి పాడిన తిరువాయ్మొళి భావాన్ని ఈ పాశురంలో  మాముణులు వివరిస్తున్నారు.

వాయుం తిరుమాల్ మరై య  నిర్క ఆట్రామై
పోయ్ వింజి మిక్క పులంబుదలాల్   ఆయ
అరియాదవట్రోడు అణ్ఐన్ దళుద మాఱన్
శెరివారై నోక్కుమ్ తిణిన్ దు

ప్రతిపదార్థము :
వాయుం = పొంద తగిన
తిరుమాల్ = శ్రీఃపతి (మహాలక్ష్మికి పతి)
మరైయ  నిర్క =  దృగ్గోచరము కాకపోవటము వలన
ఆట్రామై పోయ్ వింజి = విచారము ద్విగుణీకృతమై
మిక్క పులంబుదలాల్   = మిక్కిలి కలవరించి
ఆయ అరియాదవట్రోడు = ఎవరికీ అంతు పట్టనంత దుఃఖమును
అణ్ఐన్ దు  = పొంది
అళుద  = విలపించిన  
మాఱన్ = ఆళ్వార్లు
శెరివారై = భక్తులను
తిణిన్దు నోక్కుమ్ = దయతో నిశ్చలమైన చూపులను సారిస్తారు.  

భావము: పరమాత్మ తన భక్తులను అనుగ్రహించకుండా, తాను కనపడకుండా ఉన్నారు. అది  సహించలేని  ఆళ్వార్లు మిక్కిలి దుఃఖంతో విలపించారు. అంతే  కాక అచేతనములను చూసి అవి కూడా తనలాగా పరమాత్మ కనపడక విలపిస్తున్నాయని భావించి వాటిని ఆలింగనము చేసుకొని విలపించారు. ఇలాంటి ఆళ్వార్ల భక్తులు తమ కరుణాద్రుక్కులను మనపై ప్రసరించి ఉజ్జీవింప చేస్తారు.

పాశురము 12

అవతారిక: పరమాత్మ పరత్వాన్ని కిందటి దశకంతో సంబంధం లేని విధంగా  ఆళ్వార్లు ఈ దశకంలో అనుభవించారు. దానిని లోకులకు కూడా తెలియజేయాలని ఈ దశకంలో  పాడారు అని ఇక్కడ మాముణులు భావిస్తున్నారు.

తిణ్ణిదా మారన్ తిరుమాల్ పరత్తువైత
నణ్ణియవదారత్తే నంగురైత్త వణ్ణ మరిందు
అట్రార్గళ  యావరడిక్కే ఆంగవర్ పాల్
ఉట్రారై మేలిడాదూన్

ప్రతిపదార్థము:
తిణ్ణిదా మారన్ = ధృడ విశ్వాసము గల మాఱన్ (ఆళ్వార్లు)
తిరుమాల్ = పరమాత్మ  
పరత్తువైత  = పరత్వాన్ని
అవదారత్తే నణ్ణి = ఆయన అవతారాలలో చూపిన విధానాన్ని
నంగురైత్త వణ్ణ మరిందు = తెలుసుకున్న ఆళ్వార్లు తమ పాశురాలలో  చక్కగా వివరించారు  
అట్రార్గళ  యావర్ = ఆళ్వార్ల
అవర్ అడిక్కే = వారి శ్రీపాదములకే
ఆంగు = అక్కడ
అవర్ పాల్ ఉట్రారై = మహావిశ్వాసముతో దరి చెరినవారిని
ఉన్ = ఈ లోకంలోని శారీరక సంబంధములు
మేలిడాదు = ఏమి చేయలేదు  

భావము: పరమాత్మ  పరత్వాన్ని ఆయన అవతారాలలో చూపి కృప చేశారని ధృడ విశ్వాసముతో మాఱన్ (ఆళ్వార్లు) తమ పాశురాలలో పాడారు. అందుకే ఆయన (ఆళ్వార్లు) శ్రీపాదములను మహా విశ్వాసముతో చెరిన వారిని లోకంలోని లౌకిక బంధనాలు ఏమి చేయ జాలవు అని మాముణులు మనకు ప్రబోధిస్తున్నారు.

పాశురము 13

అవతారిక: ఆళ్వార్లు పరమతంతో తనకు ఏకత్వము కలిగిన విధానాన్ని అనుభవించారు. ఆ కాలంలో తనతో పాటుగా ఉండి  పరమాత్మ  గుణానుభవం చేసి తన సత్తను పెంపు చేయటానికి అనుకూలురను వెతుకుతున్న విధంగా ఉన్న శ్రీసూక్తులను ఇక్కడ అనుగ్రహించారు.

ఊనమరవే వందు ఉళ్ కలంద మాలినిమై
యానదు అనుభవిత్తర్కూమ్ తుణయియా – వానిల్
అడియార్ కుళామ్ కూడ ఆశై యుట్ర మారన్
అడియారుడనెమ్ జే యాడు

ప్రతిపదార్థము :
నెమ్ జే = ఓ మనసా
ఊనమరవే = దోషములే లేని స్వామి  
వందు = వచ్చి
ఉళ్ కలంద = నాతో  కలసిన
మాలినిమై యానదు = స్వామి యొక్క కలయిక వలన కలిగిన తీయదనమును
అనుభవిత్తర్కూమ్ = అనుభవించినవారికి
ఆమ్ తుణయియా = తోడుగా వుండడానికి
వానిల్ = పరమపదములో
కుళామ్ కూడ = గోష్టిగా చేరాలని
ఆశై యుట్ర = కోరుకున్న
అడియార్ = దాసులకు  (భక్తులు )
మారన్ = నమ్మాళ్వార్లు
అడియారుడన్  = దాసులతో తోడుగా
యాడు = ఉండుగాక  

భావము: ఆళ్వార్లు అనుకూలరితో చేరి ఉన్నారు.  దోషములే లేని స్వామివ్వచ్చి కలిశారు. ఆ స్వామి యొక్క కలయిక వలన కలిగిన తీయదనమును తోటి భక్తులతో పంచుకోవాలనుకున్నారు. ఆ అనుభవము నిరంతము అనుభవిస్తున్న పరమపదములోని నిత్యసూరుల గోష్టితో చేరాలని కోరుకున్నారు. అలాంటి మాఱన్ అనే నమ్మాళ్వార్లు దాసులకు తోడుగా ఉండుగాక.

పాశురము 14

అవతారిక: ఈ పాశురము తల్లి భావనలో చెప్పబడింది. నాయిక అవస్థను తల్లి పరమాత్మకు, ఆయన భక్తులకు వివరిస్తున్నారు. నమ్మాళ్వార్లు తిరువాయ్మొళిలోని ఆడి ఆడి అనే దశకంలో చెప్పిన  తల్లి అవస్థను మాముణులు ఇక్కడ వివరిస్తున్నారు.

ఆడి మగిళ్ వానిల్ అడియార్  కుళామ్ గుళుడన్
కూడి ఇన్బమ్ ఎయిదా కురైయదనాల్ వాడిమిగ
అణ్పుట్రార్ నిలమై ఆయ్ న్దురైక్క మొగిత్తు
తుణ్పుత్తార్ మారన్ అందో 

ప్రతిపదార్థము:
ఆడి మగిళ్ = ఆనందంగా నృత్యం చేసి  ( ఆనందించే భగవంతుడికి )
వానిల్ = పరమపదములో  
అడియార్  కుళామ్ గుళుడన్ =  భక్తుల గుంపుతో కూడి
కూడి = చేరి
ఇన్బమ్ ఎయిదా కురైయదనాల్ = ఆనందం పొందలేదన్న కలత వలన
మిగవాడి = చాలా వాడిపోయి
అణ్పుట్రార్ = ప్రేమాస్పదులు ( మధురకవి ఆళ్వార్ల వంటి వారు )
తన్ నిలమై = తన స్థితిని  
ఆయ్ న్దురైక్క = విశ్లేషించి
మొగిత్తు = వివరించడానికి
తుణ్పుత్తార్ = బాధ పడ్డారు
మారన్ అందో = అయ్యో మారన్ !

 భావము: నమ్మాళ్వార్లు నాయికా భావనలో పరమపదంలో ఉండే నిత్యసూరుల గోష్టిలో చేరి వారితో కూడి ఆనంద నృత్యం చేయలేకపోయానని కలత చెందారు. అది చూసిన తల్లి తన కుమార్తె పడే వేదనను వివరించినట్లు నమ్మాళ్వార్లె పాడుతున్నారు.  పరమాత్మకు ఎంతో ప్రేమాస్పదులైన మధురకవి ఆళ్వార్ల వంటి వారు ఈమె బాధను చూసి జాలిపడి, ఆమె దుఃఖాన్ని విశ్లేషించి వివరించడానికి కూడా మాటలు చాలక బాధపడ్డారు కదా! అయ్యో! మారన్! అని తల్లి కలత చెందినది అని నమ్మాళ్వార్లు పడిన విషయాన్ని మాముణులు ఈ పాశురంలో పాడారు.

పాశురము 15

అవతారిక: పరమాత్మ నిత్యసూరులను కూడి తన ఆయుధాలు, ఆభరణాలతో సహా వచ్చి ఆళ్వార్లకు దర్శన భాగ్యం కలుగజేశారు. ఆళ్వార్ల దుఃఖాన్ని పోగొట్టారు అని ఆళ్వార్లే ఇంతకు ముందు ‘ఆడి ఆడి’ లో పాడారు. ఇప్పుడు పరమాత్మ ఆళ్వార్లతో చేరడం వలన కొత్తగా పొందిన కాంతిని చూసి సంతోషిస్తున్నారు అని ‘అన్ దామత్తు’ లో పాడారు దానినే మాముణులు ఇక్కడ పాడారు.

అన్ దామత్తన్ పాల్ అడియార్ గాళోడిరైవన్
వన్ దారత్తాన్ కలందదర్ వణ్ మయినాల్  శన్ దాబమ్
తీరనద శడగోపన్  తిరువడిక్ కే నెన్ జమే
వాయ్ న్ద అన్ బై నాడోరుమ్ వై 

ప్రతిపదార్థము :
నెన్ జమే = ఓ హృదయమా!
అన్ దామత్తన్ పాల్ =  ఆ శ్రీవైకుంఠముపై ప్రేమతో  
లో అడియార్ గాళోడు  = ఆయుధాలు, ఆభరణాల రూపంలో  ఉన్న నిత్యసూరులు, ముక్త పురుషులను  ధరించి
ఇరైవన్ త్తాన్  = సర్వేశ్వరుడు తానే
వన్ దార  = వచ్చి ఆర్తిని పోగొట్టి  
కలందదర్ = కూడి ఉన్నట్లుగా
వణ్ మయినాల్  = భావించటం వలన
శన్ దాబమ్ = ఆర్తి, సంతాపము  
తీర్ న్ద =  తీరింది అని
శడగోపన్ = అంటున్న నమ్మాళ్వార్ల
తిరువడిక్ కే = శ్రీపాదాలపైనే  
వాయ్ న్ద అన్  బై =  యోగ్యమైన భక్తిని
నాడోరుమ్ వై = నిరంతరము కలిగి యుండునట్లు చేయి మనసా ! 

భావము: ఓ హృదయమా! ఆ శ్రీవైకుంఠముపై ప్రేమతో ఆయుధాలు, ఆభరణాల రూపంలో  ఉన్న నిత్యసూరులు, ముక్త పురుషులను ధరించి సర్వేశ్వరుడు తానే  వచ్చి ఆర్తిని పోగొట్టి కూడి ఉన్నట్లుగా భావించాను. అందువలన నా ఆర్తి, సంతాపము తీరింది అని అంటున్న నమ్మాళ్వార్ల శ్రీపాదాలపైనే  యోగ్యమైన భక్తిని నిరంతరము కలిగి యుండు నట్లు చేయి మనసా! అని మాముణులు ప్రార్థిస్తున్నారు.

పాశురము 16

అవతారిక: ఆళ్వార్లు తనను ఎంత అనుభవించినా తీరని అతృప్తామృత మని ఇంత సేపు పాడారు. ఇంతలో తనలో అల్పత్వాన్ని ఆరోపించుకొని నైచ్యయానుసంధానం చేసి వెళ్లిపోతారా! అని పెరుమాళ్లు సందేహించారు అని ఆళ్వార్లు పాడిన విషయాన్నే మాముణులు ఈ పాశురంలో సంక్షిప్తంగా చెప్పారు. 

వైకుందన్ వందు * కలందఱ్పిన్ వాళ్ మాఱన్*
శెయ్ గిన్ఱ * నైచ్చి యత్తై చ్చిందిత్తు * నైగిన్ఱ
తన్ మైదనై కండు * ఉన్నైత్తాన్ విడేనెన్ఱురైక్క *
వన్మై యడైందాన్ * కేశవన్ * (16)

ప్రతిపదార్థము:
వైకుందన్ = నిత్య విభూతి నాయకుడు  
వందు * కలందఱ్పిన్ = వచ్చి కలిసిన తరువాత  
వాళ్ = ఉజ్జీవయించిన
మాఱన్* = ఆళ్వార్లు
శెయ్ గిన్ఱ * నైచ్చి యత్తై = చేస్తున్న నైచ్యానుసంధానాన్ని  
కండు = చూసి
చ్చిందిత్తు *=  చింతించి, ఆందోళన చెందుతున్న
నైగిన్ఱ తన్ మైదనై = పరమాత్మ కరిగిపోవటాన్ని  
కండు = చూసి భయపడ్డారు (అప్పుడు ఆళ్వార్లు)
* ఉన్నైత్తాన్ విడేనెన్ఱురైక్క *=  నేను నిన్ను వదిలి వెళ్ళి పోనని చెప్పగా
కేశవన్ *=  కేశిని సంహరించినవాడు
వన్మై యడైందాన్ * =  స్థిమితపడ్డాడు 

 భావము: నిత్యవిభూతి నాయకుడు వచ్చి కలిసిన తరువాత మాఱన్ అనే నమ్మాళ్వార్లు ఉజ్జీవయించారు. పరమాత్మ ఔన్నత్యాన్ని చూసి, తన దోషాలను చూసి నైచ్యానుసంధానం చేశారు నమ్మాళ్వార్లు.  అది చూసిన పరమపదనాధుడు ఈయన తనను వదిలి వెళ్లిపోతారేమోనని చింతించి, ఆందోళన చెందారు. పరమాత్మ ఆందోళనతో  కరిగి పోవటాన్ని చూసి నమ్మాళ్వార్లు భయపడ్డారు. అప్పుడు ఆళ్వార్లు నేను నిన్ను వదిలి వెళ్ళి పోనని చెప్పగా  కేశిని సంహరించిన కేశవుడు  స్థిమితపడ్డాడు అని ఒక దశకం మొత్తంలో నమ్మాళ్వార్లు వివరించిన విషయాన్ని మాముణులు ఈ పాశురంలో చెప్పారు.

పాశురము 17

అవతారిక: ఈ పాశురములో  ఆళ్వార్ల సంబంధీకులు, ముందు ఏడుతరాలు వెనక ఏడుతరాలు కూడా  ఉజ్జీవించి తేజస్సును పొందుతారు అని చెపుతున్నారు.

కేశవనాల్ ఎన్దమర్గళ్ * కీళ్ మే లెళుపిఱప్పుమ్ *
తేశడైందారెన్ఱు * శిఱందురైత్త * వీశుపుగళ్
మాఱన్ మలరడియే * మన్నుయిర్కెల్లాం ఉయ్ గైక్కు
ఆఱెన్ఱు నెంజే అణై* 

ప్రతిపాదార్థము:   
నెంజే = ఓ మనసా  
కేశవనాల్  =  కేశిని సంహరించిన వాడి వలన 
ఎన్దమర్గళ్ * =  నా సంబంధీకులు 
కీళ్ మేలెళుపిఱప్పుమ్ *=  ముందు ఏడు తరాలు వెనక ఏడు తరాలు 
తేశడైందారెన్ఱు * =  తేజస్సును పొందారు అని
శిఱందురైత్త *=  గొప్పగా చెప్పినట్లు
వీశుపుగళ్  =  అంతటా వ్యాపించిన కీర్తి కల
మాఱన్ =  ఆళ్వార్ల యొక్క  
మలరడియే *=  తామరల వంటి దివ్యా పాదలను
మన్నుయిర్కెల్లాం =  ఉజ్జీవింపగోరే వాళ్ళందరికి
ఉయ్ గైక్కు ఆఱెన్ఱు =  ఉజ్జీవించే మార్గమని తెలుసుకొని  
అణై* = శరణాగతి చెయ్యి 

భావము: ఓ మనసా! కేశిని సంహరించిన వాడి కృప వలన ఆళ్వార్ల సంబంధీకులు, ముందు ఏడుతరాలు వెనక ఏడుతరాలు కూడా  తేజస్సును పొందుతారు అని పరమాత్మ ఘనంగా చెప్పారు, ఆళ్వార్లు దశదిశల కీర్తి వ్యాపించిన వారు.  ఈ లోకంలో ఉజ్జీవింపగోరె వాళ్ళందరికి ఆయనే మార్గమని తెలుసుకొని ఆళ్వార్ల యొక్క తామరల వంటి దివ్యా పాదలకు శరణాగతి చెయ్యి‘ అని ఈ పాశురంలో మాముణులు కేశవన్ తమర్ అనే దశకంలో నమ్మాళ్వార్లు చెప్పిన విషయాలను క్లుప్తంగా చెప్పారు. 

పాశురము 18

అవతారిక: ఈ పాశురములో పరమాత్మ కళ్యాణ గుణాలలోని మోక్ష ప్రదత్వమును, కారుణ్య గుణాన్ని కీర్తిస్తున్నారు. నమ్మాళ్వార్ల అణైందవర్గళ్ తమ్ముడనే అనే దశక సారాన్నిఈ పాశురంలో చెపుతున్నారు.

అణైందవర్గళ్ తమ్ముడనే * ఆయనరుట్కాళామ్ *
కుణందనైయే కొండు* ఉలగైకూట్ట * ఇణంగిమిగ
మాశి ఉపదేశం శెయ్ * మారన్ మలరడియే *
వీశుపుగళ్ ఎమ్మావీడు * 

ప్రతిపదార్థము :
అణైందవర్గళ్ తమ్ముడనే *=  నిత్యసూరులతో  చేరి పరమాత్మ కైంకర్యములో ఈడుపడి  
ఆయనరుట్కాళామ్ *= కృష్ణుడి కృపాకు పాత్రులై  
కుణందనైయే కొండు*= మోక్షాధికారం పొంది 
ఉలగై  = నిత్య సంసారులను
కూట్ట * =  చేరడానికి  
కూట్ట * =  చేరడానికి
మాశు ఇల్  = దోష రహిత 
ఉపదేశం = ఉపదేశమును  
శెయ్ = కృపతో చేయండి
మారన్ = నమ్మాళ్వార్ల
మలరడియే *=  తామరల వంటి తాపమును పోగొట్టే శ్రీపాదాలు  
వీశుపుగళ్ = వ్యాపించిన కీర్తి 
ఎమ్మావీడు = పరమపదమే మాకు నివాస స్థానము

భావము: ఆళ్వార్లు కృపతో దోష రహితమైన  పరమాత్మ కళ్యాణ గుణాలలోని మోక్ష ప్రదత్వాన్ని, కారుణ్య గుణాన్ని కీర్తిస్తున్నారు. నిత్యసూరులతో  చేరి పరమాత్మ కైంకర్యములో ఈడుపడి కృష్ణుడి కృపకు పాత్రులై మోక్షాధికారం పొందడానికి  సంసారులకు తగిన సూచనలను ఇచ్చారు. సంసారులు పరమపదాన్ని చేరడానికి అర్హతలను పొందాలంటే తాపమును పోగొట్టే తామరల వంటి నమ్మాళ్వార్ల  శ్రీపాదాలే నిత్య నివాస స్థానముగా చేసుకోవాలని ఈ పాశురంలో మాముణులు చెప్తున్నారు. 

పాశురము 19

అవతారిక:  ఈ పాశురములో పేరుమాళ్ళపై  ఆళ్వార్లకు ఉన్న దృఢ విశ్వాసాన్ని మాముణులు మనకు తెలియజేస్తున్నారు. అటువంటి ఆళ్వార్ల శ్రీపాదాలే మనకు రక్ష అని కూడా అంటున్నారు.  

ఎమ్మావీడుం వేండా * ఎందననుక్కు ఉన్ తాళిణైయై *
అమ్మా అమైయుమెన * ఆయ్ందురైత్త * నమ్ముడైయ
వాళ్ ముదలాం మాఱన్ మలర్ తాళిణైశూడి *
కీళ్మై యత్తు నెంజే * కిళర్ *

ప్రతిపదార్థము :
అమ్మా = ఓ ప్రభూ !
ఎమ్మావీడుం వేండా = ఎంతో ఉన్నతమైన పరమపదము కూడా నాకు వద్దు   
ఎందననుక్కు ఉన్ తాళిణైయై = నాకు నీ శ్రీపాదలే
అమైయుమెన = (నా తలపై) అమరుతాయని
ఆయ్ందురైత్త = దృఢంగా చెప్పిన
నమ్ముడైయ వాళ్ ముదలాం = మా ఉజ్జీవనానికి హేతువయిన
మాఱన్ = ఆళ్వార్ల
మలర్ తాళిణై = పూవులవంటి శ్రీపాదాలను  
శూడి = తలపై ధరించి ఉజ్జీవించాలి
నెంజే = ఓ మనసా!
కీళ్మై యత్తు = అంత కంటే అల్పమైన ఫలితాలనిచ్చే కోరికలు లేకుండా చేయి
కిళర్ = నువ్వు కూడా ఉజ్జీవిస్తావు

భావము: ఓ మనసా! ఎంతో ఉన్నతమైన పరమపదము కూడా నాకు వద్దు నాకు నీ శ్రీపాదలే (నా తలపై) అమరుతాయని అని దృఢంగా చెప్పారు ఆళ్వార్లు. మా ఉజ్జీవనానికి హేతువయిన అటువంటి ఆళ్వార్ల పూవులవంటి శ్రీపాదాలను తలపై ధరించి ఉజ్జీవించాలి ఓ మనసా! నువ్వు అంత కంటే అల్పమైన ఫలితాలనిచ్చే కోరికలు లేకుండా చేయాలి. అలా చేస్తే  నువ్వు కూడా ఉజ్జీవిస్తావు అని మాముణులు అంటున్నారు.

పాశురము 20

అవతారిక: తిరుమాలిరుంజోలై మలై పెరుమాళ్ళను చేరి పరమపదాన్ని పొందమని ఆళ్వార్లు చెప్పిన విషయాన్ని మాముణులు ఈ పాశురములో చెపుతున్నారు .

కిళరొళి శేర్ కీళురైత్త * పేఱుకిడైక్క *
పళరొళి మాళ్ * శోలైమలైక్కే * తళర్వఱవే
నెంజై వైత్తు చ్చేరు మెనుం * నీడుపుగళ్ మాఱన్ తాల్ *
మున్ శెలుత్తువోం ఎమ్ముడి *

ప్రతిపదార్థము :
కీళురైత్త = మునుపే చెప్పిన విధంగా
కిళరొళి శేర్ = లేత కాంతితో ప్రకాశమానంగా విరాజిల్లుతున్న  
పేఱుకిడైక్క = పరమపదమును చేరడానికి 
వళరొళి మాళ్ = నిరంతరం ప్రవర్తమానమవుతున్న కాంతిని కలిగి వున్న
శోలైమలైక్కే= తిరుమాలిరుంజోలై మలై పెరుమాళ్ళను (పెరుమాళ్లు వేంచేసి ఉన్న కొండ)  
తళర్వఱవే = అలసట లేని హృదయంతో
నెంజై వైత్తు = ఏకాగ్ర చిత్తంతో 
చ్చేరు మెనుం = చేరుకోండి అని చెపుతున్న  
నీడుపుగళ్ = కీర్తిమంతుడైన
మాఱన్ = ఆళ్వార్ల
తాల్ మున్ = శ్రీపాదల ముందు  
ఎమ్ముడి = నా శిరస్సును
శెలుత్తువోం = నిలుపుతాను

భావము: కిందటి పాశురంలో చెప్పిన విషయానికి ఈ పాశురంలో ఇంకా కొంత వివరణ చేరుస్తున్నారు. లేత కాంతితో ప్రకాశమానంగా విరాజిల్లుతున్న పరమపదమును చేరడానికి నిరంతరం ప్రవర్తమానమవుతున్న కాంతిని కలిగి వున్న తిరుమాలిరుంజోలై మలై పెరుమాళ్ళను అనుమానం లేని హృదయంతో, ఏకాగ్ర చిత్తంతో ఆశ్రయించండి అని ఆళ్వార్లు తిరువాయ్మొలిలో  చెప్పారు. అటువంటి  కీర్తిమంతుడైన ఆళ్వార్ల శ్రీపాదల ముందు నా శిరస్సును నిలుపుతాను అని మాముణులు ఈ పాశురములో చెపుతున్నారు. 

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/10/thiruvaimozhi-nurrandhadhi-11-20-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 30

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 29

ramanujar-srirangam-2
పరిచయము: 

మణవాళ మామునులు ఈ పాశురములో,  శ్రీ రామానుజులను ఆపాదమస్తకం కీర్తిస్తూ మంగళాసాననాలు అందిస్తున్నారు. అనేక ఇతర తత్వవేక్తలతో చర్చించిన తరువాత శ్రీ రామానుజులు అలసిపోయి ఉంటారని మణవాళ మామునులు భావిస్తున్నారు. శ్రీ రామానుజులు  శ్రీ భాష్యం మరియు తిరువాయ్మొళి రూపములో తన చేతిలో ఉన్నట్టుగా మణవాళ మామునులు భావిస్తున్నారు. ఇలా అద్భుతంగా ఆసీనులై ఉన్న శ్రీ రామానుజులను మణవాళ మామునులు తలంచుకుంటూ వారి తిరుమేని యొక్క ప్రతి భాగాన్ని కీర్తిస్తూ, చిర కాలం వర్ధిల్లాలని కోరుకుంటారు.

పాశురము 30

శీరారుం ఎదిరాశర్ తిరువడిగళ్ వాళి
తిరువరైయిల్ శాఱ్ఱియ శెందువరాడై వాళి
ఏరారుం శెయ్యవడివు ఎప్పొళుదుం వాళి
ఇలంగియ మున్నూల్ వాళి ఇణై త్తోళ్గళ్ వాళి
శోరాద తుయ్య శెయ్య ముగచ్చోది వాళి
తూముఱువల్ వాళి తుణైమలర్ క్కణ్గళ్ వాళి
ఈరా ఱు తిరునామ మణింద ఎళిల్ వాళి
ఇని తిరుప్పోడెళిల్  ఞ్ఙానముత్తిరై వాళియే!!!

ప్రతి పద్ధార్ధములు

వాళి – చిరకాలం జీవించు!!!
ఎదిరాశర్ –  శ్రీ రామానుజులు
తిరువడిగళ్ – మనోరంజకమై మన శిరస్సులకు ఆభరణము లాంటి వారి పాద పద్మలు
శీర్ ఆరుం – మంగళ గుణాలతో నిండి ఉన్న
వాళి – చిరకాలం జీవించు!!
శెందువరాడై – ప్రకాశవంతమైన సూర్యుని రంగుతో ఉన్న కాషాయ వస్త్రం
శాఱ్ఱియ –  శ్రీ రామానుజులు ధరించిన
తిరువరైయిల్ – వారి తిరుమేని
వాళి – చిరకాలం జీవించు!!!
ఎప్పొళుదుం – అన్ని సమయాల్లో
శెయ్యవడివు – దివ్య తేజోమయమైన వారి దివ్య మంగళ విగ్రహము
ఏరారుం – అంతటా సౌందర్యముతో నిండి ఉన్న
వాళి – చిరకాలం జీవించు!!!
ఇలంగియ మున్నూల్ – వారు గొప్ప వేదోపాసకులన్న వాస్థవాన్ని స్థాపింపజేసే యజ్ఞోపవీతము. వారి శరీరముపై సాయంకాలపు ఆకాశములో మెరుపు లాంటి ఆ దారము చిరకాలము వర్ధిల్లాలి!!!
వాళి – చిరకాలం జీవించు!!!
ఇణై త్తోళ్గళ్ – 1) బంగారు కల్పవృక్షపు కొమ్మలను పోలి ఉన్న భుజాలు (2) మోక్షాన్ని  ఇవ్వగలిగేవి (3) మనిషిని బంధవిముక్తులను చేసే శక్తిని కలిగి ఉన్నవి (4) ఉద్ధరించి మోక్షాన్ని  ఇవ్వగలిగే కారణంగా పుష్ఠిగా ఆరోగ్యంగా కనిపించే భుజాలు (5) అందమైన తులసి మాలలతో అలంకరించబడి ఉన్న భుజాలు.
వాళి – చిరకాలం జీవించు!!!
శోరాద తుయ్య శెయ్య ముగచ్చోది – అనంత పరిశుద్దమైనవి శ్రీ రామానుజుల భుజములు. దీనికి కారణము (1) శ్రీమన్నారాయణుడు మరియు వారి భక్తులను చూచుట ద్వారా పొందిన ఆనందము (2) భక్తేతరులైన వారి వాద్వివాదనలను నశ్వరం చేసిన కారణంగా.
వాళి – చిరకాలం జీవించు!!!
తూముఱువల్ – ముఖం మీద స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన, అప్పుడే వికసించిన పువ్వుని పోలి ఉన్న అందమైన చిన్ని చిరుమందహాసము. ఆ చిరుమందహాసము (1) శరణార్థులను రక్షించడం వలన (2) భగవత్ సంబంధం వలన వచ్చినది.
వాళి – చిరకాలం జీవించు!!!
తుణైమలర్ క్కణ్గళ్ – వారి దివ్య నేత్రయుగళి (ఎ) శ్రీరంగశ్రీ (పెరియ పెరుమాళ్), (బి) శ్రీ రామానుజుల చేత  సరిదిద్దబడిన శ్రీవైష్ణవశ్రీ (ఈ ప్రపంచములో శ్రీ రామానుజుల దివ్య పాదముల యందు శరణాగతులైన వారందరూ ఇందులోకి వస్తారు). ఆ దివ్య నేత్రములు అతని యందు శరణాగతులైన వారందరినీ కరుణతో చూస్తాయి. వారి దివ్య చూపు మనపై పడి మనల్ని పరిశుద్దులను చేస్తాయి.
వాళి – చిరకాలం జీవించు!!!
ఈరాఱు తిరునామ మణింద ఎళిల్  – మెరిసే గులాబీ వంటి వారి తిరుమేనిపై పన్నెండు దివ్య ప్రశాంతమైన “తిరుమన్ కాప్పు” / “ఊర్ధ్వ పుండ్రాలు”. బంగారపు పర్వతంపైన (శ్రీ రామానుజులు దివ్య శరీరము) తెల్లని తామరలు (తిరుమన్ కాప్పు) చూసినట్లుంది. ఈ తిరుమన్ కాప్పు ముందు వివరించిన  శ్రీ  రామానుజుల మంగళ గుణములకు ప్రతీకగా నిలిచి శ్రీవైష్ణవశ్రీని నలుమూలలా వ్రాపించేలా చేస్తుంది.
వాళి – చిరకాలం జీవించు!!!
ఞ్ఙానముత్తిరై – “పర తత్వ” జ్ఞానమును అందిస్తున్న శ్రీ రామానుజుల జ్ఞాన ముద్ర
ఇని తిరుప్పోడు – పద్మాసనములో ఆసీనులై ఉన్న
యెళిల్ – అందమైనది (సంస్కృత తమిళ వేదముల సారముకి ప్రతీక అయిన ముద్ర కాబట్టి)

సరళ అనువాదము:

ఈ పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజులకు మంగళాసాసనాలు పాడుతున్నారు. వారి దివ్య పాద పద్మాల నుండి ప్రారంభించి, వారు ధరించిన కాశాయ వస్త్రాలకి, వారి దివ్య తిరుమేనికి, వారి బ్రహ్మ సూత్రం, వారి బలమైన భుజాలకు, వారి అందమైన చిరుమందహానికి, కృపతో నిండి ఉన్న నేత్రములకు, వారి ఊర్ధ్వపుండ్రాలకు, చివరకు వారి జ్ఞాన ముద్రకి మంగళాసాసనాలు పాడుతున్నారు.

వివరణ:

ఈ పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజులను కీర్తిస్తున్నారు. వారు శ్రీ రామానుజుల దివ్య పాద పద్మాల నుండి మంగళం పాడడం ప్రారంభించి,  వారి దివ్య పాదాలు నిత్యం వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. వారి దాసులు ఆతృతగా అభిలషించే స్వరూప, రూప, గుణము వంటి మంగళ గుణాలతో సంపూర్ణుడైన శ్రీ రామానుజులు, యతులకందరికీ నాయకుడి వంటివారు.  “అమరర్ సెన్నిపూ (తిరుకురుందాండగం 6)”,  “ఇరామానుశన్ అడిప్పూ  (ఇరామానుశ నూఱ్ఱందాది 1)” గా వర్ణించబడినట్లుగా, శ్రీ రామానుజుల  దివ్య పాద పద్మములు మన శిరస్సులపై అలంకరింకొని పూర్తిగా ఆనందించతగినవి. అటువంటి దివ్య పాదాలకు ఏ హాని కలుగకుండా నిత్యము వర్ధిల్లాలి.  తరువాత, శ్రీ రామానుజులు దివ్య తిరుమేనిపై వారు ధరించిన దివ్య కాషాయ వస్త్రానికి మణవాళ మామునులు మంగళం పాడుతున్నారు. వారి వస్త్రాలు నిత్యం వర్ధిల్లాలని వారు కోరుకుంటున్నారు. [కాషాయ వస్త్రానికి కారణం వివరించబడింది ఇక్కడ. కాషాయ రంగును వివరించడానికి మన పెద్దలు అందించిన రెండు అంశాలు పరిగణలోకి తీసుకోబడ్డాయి. (i) శ్రీ వచన భూషణము – ఒక చూర్ణికలో ఇలా చెప్పబడింది “ఆఱు ప్రకారత్తాలే పరిశుద్ధాత్మ స్వరూపత్తుక్కు తత్సామ్యం ఉణ్డాయిరుక్కుం (శ్రీ వచన భూషణము 240)”.  ఈ చూర్ణిక యొక్క సారాంశం ఏమిటంటే, ఆత్మ తన నిజ స్వరూపాన్ని గ్రహించినపుడు, అట్టి ఆత్మను పెరియ పిరాట్టితో సమానంగా చెప్పవచ్చు. ఒక ఆత్మని ఆరు లక్షణాలతో విశదపరచ వచ్చు  (1) అనన్యార్హ శేషత్వం, అంటే శ్రీమన్ నారాయణుడు తప్ప మరెవరికీ సేవకుడిగా ఉండకపోవడం  (2) అనన్య శరణత్వం, శ్రీమన్ నారాయణుడు తప్ప మరెవరినీ ఆశ్రయించక పోవడం (3) అనన్య భోగ్యత్వం, అంటే శ్రీమన్ నారాయణునికి తప్ప మరెవరికీ భోగ్య వస్తువు కాకపోవడం, (4) సంశ్లేషత్తిల్ దరిక్కై, అంటే శ్రీమన్ నారాయణుడితోనే ఉండగలగడం (5) విశ్లేషత్తిల్ దరియామై, అంటే శ్రీమన్ నారాయణుడి వియోగము భరించకపోవడం. (6) తదేక నిర్వాహ్యత్వం, అంటే శ్రీమన్ నారాయణునిచే మాత్రమే నియంత్రించబడటం. శ్రీమన్ నారాయణుని కృప కారణంగా ఈ ఆరు గుణాల నిజ స్వరూపాన్ని ఆత్మ గ్రహించగలిగినప్పుడు, ఈ ఆరు లక్షణాలను నిత్యము ఎరిగిన నాయకి స్వరూపిణి అయిన పెరియ పిరాట్టితో ఆ ఆత్మ సమానమై ఉంటుంది. ఇప్పుడు రెండవ అంశం “సీతకాషాయవాసిని” అన్న వాఖ్యం. సారాంశంగా, కాషాయ రంగు “పారతంత్ర్యానికి” (తన స్వామిపై ప్రశ్నించ కుండా అతని ఆజ్ఞ ప్రకారం నడుచుకొనుట) మరియు “అనన్యార్హత్వం” (శ్రీమన్ నారాయణుడికే ఆత్మ కట్టుబడి ఉండుట) ని సూచించే రంగు అని చెప్పవచ్చు. సూర్యుడి వర్ణంలో సమానంగా ఉన్న ఈ రంగు శ్రీ రామానుజుల యొక్క తిరుమేనిని చక్కగా అలంకరిస్తుంది అని మణవాళ మామునులు ఈ అందమైన కాషాయ వస్త్రాన్ని వర్ణిస్తున్నారు. తరువాత, శ్రీ రామానుజుల యొక్క దివ్య మంగళ విగ్రహానికి మణవాళ మామునులు మంగళం పాడుతున్నారు. తమ శరణాగతులకు శ్రీ రామానుజుల దివ్య తిరుమేని అతి మనోహరంగా కనిపిస్తుందని మణవాళ మామునులు వర్ణిస్తున్నారు. అత్యున్నత సౌందర్య లావణ్యాలతో నిండి ఉంటుంది వారి తిరుమేని. అప్పుడే వికసించిన పుష్పాలలాగా మృదువుగా అతి కోమలంగా  ఉంటుంది వారి తిరుమేని.  “రూపమేవాస్యై తన్మహిమాన మాసష్తే” అని అన్నట్లు, పరమాత్మ (శ్రీమన్ నారాయణ) వారి లోపల ప్రకాశిస్తున్న కారణంగా శ్రీ రామానుజుల దివ్య శరీరం దివ్య తేజస్సును వెదజల్లుతూ ప్రకాశవంతంగా ఉంది. మణవాళ మామునులు అటువంటి దివ్య రూపానికి కీర్తి పాడుతున్నారు,  “నిత్యం నిత్య క్రుతితరం” అన్న శాస్త్ర వాఖ్యము ప్రకారం వారి దివ్య స్వరూపము శాశ్వతంగా వర్ధిల్లాలని కోరుతూ మణవాళ మామునులు శ్రీ రామానుజులకు మంగళం పాడుతున్నారు. తరువాత, శ్రీ రామానుజులు గొప్ప వేద ఉపాసకులని సూచిస్తున్న వారి పవిత్ర యజ్ఞోపవీతానికి మణవాళ మామునులు మంగళం పాడుతున్నారు. శ్రీ రామానుజుల దివ్య తిరుమేనిపై వారి యజ్ఞోపవీతము  సంధ్య సమయమున ఆకాశంలో కనపడు వెండి తీగలతో సమానంగా గోచరిస్తుంది. అటువంటి పవిత్రమైన యజ్ఞోపవీతము  చిర కాలం వర్ధిల్లాలి అని కోరుతూ కీర్తిస్తున్నారు.

తరువాత, మణవాళ మామునులు శ్రీ రామానుజుల అందమైన భుజాలు చిరకాలము వర్ధిల్లాలని కోరుకుంటూ మంగళము పాడుతున్నారు.  శ్రీ రామానుజుల భుజాల యొక్క గొప్పతనాన్ని మణవాళ మామునులు విస్తారంగా వివరించారు. “బాహుచ్చాయమవ అష్టబ్దోస్యపలకో మాహాత్మనః” అన్న వచనముల ప్రకారం, శ్రీ రామానుజుల భూజాలు – ఆశ్రయించిన వారికి తోడు నీడని అందించే స్వర్ణ కప్లవృక్షము వంటిది. ఎవరికైనా మోక్షం ప్రసాదించగలవు ఆ భుజాలు. ఈ ప్రపంచంలోని నిస్సహాయులను ఉద్ధరించి వారికి ముక్తిని ఇవ్వగల సామర్థ్యము కలిగిన భుజములవి. నిస్సహాయులను ఉద్ధరించి వారికి ముక్తిని ఇవ్వగల సామర్థ్యము కలవి కాబట్టి ఆ భుజాలు పెద్దవి, విశాలమైనవి. జ్ఞానసారం పాశురము “తోళర్ చుడర్ త్తి శంగుడయ సుందరనుక్కు (జ్ఞానసారం 7)” లో శ్రీ రామానుజుల భుజాలు శక్తివంతమైనవని వివరించబడింది. తులసి, వకుళం మరియు నళినాక్ష పుష్ప మాలలతో అలంకరించబడిన శ్రీ రామానుజుల సాటిలేనటువంటి భుజాలు ఎప్పటికీ వర్ధిల్లాలని కోరుతూ మణవాళ మామునులు మంగళం పాడుతున్నారు. తరువాత, మణవాళ మామునులు శ్రీ రామానుజుల శ్రీ ముఖం వైపు చూసి మంగళం పాడటం ప్రారంభిస్తారు. “బ్రహ్మవిధ ఇవ సౌమ్యాతే ముఖం పాధి”, “ముగచ్చోది మలర్దదువో (తిరువాయ్మొళి 3.1.1)” వంటి ప్రామాణిక పదబంధాల ప్రకారం, శ్రీ రామానుజుల ముఖ తేజస్సుకి హద్దులు లేవు, అతి స్వచ్ఛమైనది, దివ్య తేజోమయమైనది వారి శ్రీముఖము. దీనికి కారణము (1) శ్రీమన్నారాయణుడిని, వారి భక్తులను చూడటం వలన లభించే ఆనందం వల్ల వచ్చిన తేజస్సు (2) భక్తులు కానివారి వాదనలను నాశనం చేసినందుకు.

తరువాత, శ్రీ రామానుజులు యొక్క అందమైన మనోహరమైన చిరునవ్వుకు మణవాళ మామునులు కీర్తి పాడుతున్నారు. ఈ ప్రబంధము ప్రకారం, “స విలాసస్స్మితాధారం భిప్రాణం ముఖ పంకజం” – శ్రీ రామానుజుల ముఖాన్ని ఒక అందమైన తామర పుష్పముతో పోల్చారు. ముఖం అని పిలువబడే ఈ తామరపుష్పములో,  “నిన్ పల్ నిలా ముత్తం తవళ్ కదిర్ ముఱువల్ సెయ్దు (తిరువాయ్మొళి 9.2.5) – ఆ తామరలో నుండి ఒక అందమైన చిరునవ్వు ఉద్భవించింది అని నమ్మాళ్వార్లు తిరువాయ్మొళిలో  వర్ణించారు. ఈ చిరునవ్వుకి కారణం ఏమిటంటే, (1) భక్తులను రక్షించడం ద్వారా పొందిన ఆనందం,  (2) శ్రీమన్నారాయణునితో తాము కూడి ఉండుట కారణంగా పొందిన ఆనందం.  వికసిస్తున్న పువ్వుని పోలి ఉన్న చల్లని చంద్రుని లాంటి అందమైన ఈ చిరునవ్వుని  చిరకాలము వర్దిల్లాలని కోరుతూ మణవాళ మామునులు దివ్య తేజస్సుని వెదజల్లుతున్న ఆ చిరమందహాసముకి మంగళం పాడుతున్నారు. దీని తరువాత, మణవాళ మామునులు శ్రీ రామానుజుల దివ్య నేత్రాలకు మంగళం పాడుతున్నారు, ఈ రెండు నేత్రాలు  శ్రీ రంగనాథుని, శ్రీవైష్ణవశ్రీ – శ్రీ రామానుజులు చేత సరిదిద్దబడిన వాళ్ళని ఎల్లప్పుడూ చూస్తుంటాయి. ఆ దివ్య నెత్రాలు నిరంతరం తన తోటి వారిపైన కారుణ్యము కార్చుతూ ఉంటాయి. “అమలంగళాగ  విళిక్కుం (తిరువాయ్మొళి 1.9.9)”లో చెప్పినట్టుగా, అజ్ఞానమును తొలగించి తన శరణాగతులను ఆ నేత్రాలు సర్వదా అనుగ్రహిస్తు ఉంటాయి.  అటువంటి అద్భుతమైన వారి నేత్రద్వయం చిరకాలము ఉండాలని మణవాళ మామునులు కోరుకుంటున్నారు. తరువాత, పన్నెండు ఊర్ధ్వపుండ్రముల అలంకరణతో ఉన్న శ్రీ రామానుజుల దివ్య తిరుమేని సౌదర్యానికి మణవాళ మామునులు మంగళం పాడుతున్నారు. “తిరుమన్ కాప్పు” (ఊర్ధ్వపుండ్రములు) బంగారు శిఖరంపై వికసించిన తెల్లటి పద్మ పుష్పముని పోలి ఉన్నట్టు శ్రీ రామానుజులను వర్ణిస్తున్నారు. స్వర్ణమయంగా మెరుస్తున్న శ్రీ రామానుజుల దివ్య తిరుమేనిపై, ఊర్ధ్వపుండ్రములు దివ్యంగా ప్రకాశిస్తున్నాయి.  శ్రీ రామానుజుల ఈ దివ్య సౌదర్యం నిత్యము వర్ధిల్లాలని మణవాళ మామునులు కోరుకుంటున్నారు.

చివరిగా, మణవాళ మామునులు శ్రీ రామానుజుల యొక్క వేళ్ళ ముద్రను కీర్తిస్తున్నారు. వారి ఆ ముద్ర చిరకాలము  వర్ధిల్లాలని మణవాళ మామునులు కోరుకుంటున్నారు. శ్రీమన్నారాయణుని సంకల్పము మేరకు శ్రీ రామానుజులు ఈ భూలోకముపైన అవతరించి, ఈ భౌతిక ప్రపంచములో వారి భక్తులను గానీ లేదా వారి ప్రత్యర్థులను గానీ అందరినీ శ్రీమన్నారాయణుని కృపతో జయించారు. ఇన్ని కార్యాలను సుసంపన్నం కావించిన కారణంగా గంభీరంగా పరమహంసలా ఆసీనులై ఉన్నారు “వైయం మన్ని వీఱ్ఱిరుందు (తిరువాయ్మొళి 4.3.11) లో చెప్పినట్లుగా, విషయముల మధ్య తేడాలను గమనించగల విలక్షణమైన సామర్థ్యం గురువులకి ఉంటుంది.  తిరుమంగై ఆళ్వారులు “అన్నమదాయ్ ఇరుందంగు అఱ నూల్ ఉరైత్త (పెరియ తిరుమొళి 11.4.8)” అని కూడా మన దృష్ఠికి తెస్తున్నారు. అందుకని వాళ్ళను హంసలతో పోలుస్తారు.  యతులకు రాజైన శ్రీ రామనుజులు తమ శిష్యుల మధ్య జ్ఞాన ముద్రతో పద్మాసనంలో  గంభీరంగా ఆసీనులై కనిపిస్తున్నారు, అని “పద్మసనోపవిష్టం పాదద్వోపోదముద్రం” (పరాంకుశాష్టకం)లో వివరించబడింది. “శ్రీమత్ తదంగ్రియుగళం” లో “శ్రీ” ని ప్రయోగించిన మాదిరిగా, ఈ పాసురంలోని “సీరారుం” అనే వాక్యాన్ని పాద పద్మాలకు విశేషణంగా భావించాలి.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/11/arththi-prabandham-30/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 29

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 28

bhagavad_ramanuja_2011_may-624x907

పరిచయము: 

మణవాళ మామునులు ఈ పాశురములో  శ్రీ రామానుజుల యొక్క దిగ్విజయాలను, పరమపద మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులను నాశనం చేసే బాధ్యతను వహించే శ్రీ రామానుజులను కీర్తిస్తున్నారు.  శ్రీ రామానుజులు తన ప్రత్యర్థులను, వేద విరుద్దులను, వేదములలో చెప్పబడిన వాటిని వక్రీకరించిన వారిని ఎలా ఓడించారో మణవాళ మామునులు వివరిస్తున్నారు. శ్రీభాష్యము మొదలైన వంటి గ్రంధ సారముని ఉపయోగించి వారిని ఓడించారు. మణవాళ మామునులు శ్రీ రామానుజుల యొక్క విజయాలను ప్రశంసిస్తూ వారికి మంగళములు పాడుతున్నారు.

పాశురము 29

శారువాగ మదం నీఱు శెయ్దు శమణచ్చెడిక్కనల్ కొళుత్తియే
శాక్కియ క్కడలై వఱ్ఱవిత్తు మిగుశాంగియక్కిరి ముఱిత్తిడ
మాఱుశెయ్దిడుగణాద వాదియర్గళ్ వాయ్దగర్ త్తఱమిగుత్తుమేల్
వందు పాశుబదర్ శిందియోడుం వగైవాదుశెయ్ద ఎదిరాశనార్
కూఱుమాగురు మదత్తొడోంగియ కుమారిలన్మదం అవఱ్ఱిన్ మేల్
కొడియ తర్ క్కశరమ్విట్టపిన్ కుఱుగియమాయవాదియరై వెన్ఱిడ
మీఱివాదిల్వరు పాఱ్కరన్మద విలక్కడి క్కొడి ఎఱిందు పోయ్
మిక్కయాదవమదత్తై మాయ్ త్త పెరువీరర్ నాళుం మిగ వాళియే (29)

ప్రతి పద్ధార్ధములు

శారువాగ మదం నీఱు శెయ్దు – (శ్రీ రామానుజులు) “ప్రత్యక్షమేకం చార్వాకః” అని పిలువబడే “చారువాకం” అనగా కళ్ళ ముందు కనిపించేది మాత్రమే నిజమని నమ్ము సిద్దాంతాన్ని కాల్చి బూడిద చేశారు.
శమణచ్చెడిక్కనల్ కొళుత్తియే – “సమణం”  అని పిలుబడే కలుపుమొక్క లాంటి జైన మతాన్ని శ్రీ రామానుజ కాల్చివేస్తారు.
శాక్కియ క్కడలై వఱ్ఱవిత్తు – (శ్రీ రామానుజులు) తమ తేజస్సుతో “సాక్కియం” (బౌద్ధ) మతమనే సాగరాన్ని జలము లేకుండా ఖాళీ చేస్తారు.
మిగుశాంగియక్కిరి ముఱిత్తిడ(శ్రీ రామానుజులు) ప్రబలమైన “సాంఖ్యం” అనే మతాన్ని నాశనం చేశారు (విశాల పర్వతము వంటి)
తగర్ త్తు –  (శ్రీ రామానుజులు) వారి వాదనలను ఉపయోగించి
వాయ్ – వాదనలను ముందు పెట్టడం
మాఱుశెయ్దిడుగణాద వాదియర్గళ్ – “ప్రతి వాదన” “కాణద వాదిగళ్” అనే ఒక సమూహము.
అఱమిగుత్తుమేల్ వందు – ఒక దాని తరువాత ఒకటి కొట్టుకుంటూ
పాశుబదర్ శిందియోడుం వగై – తన కుటుంబ సమేతంగా రుద్రుడిని ప్రాణాలను దక్కీంచుకొనుటకు ఎలా పరిగెత్తించారో అలాగ, శివ భక్తులు కూడా పరిగెత్తవలసి వచ్చింది.
వాదుశెయ్ద ఎదిరాశనార్ – వారి వాదనలను ఉపయోగించి యతిరాజులు
కొడియ తర్క చరం విట్టపిన్ అవఱ్ఱిన్ మేల్ – (శ్రీ రామానుజులు) “తర్క” అనే బాణాలతో దాడి చేశారు. (వాదనలను జయించే ఒక కళ)
కూఱుం – అర్థంలేని వాదన
మా – బలముగల (వ్యక్తుల సంఖ్య పరంగా)
గురు మదత్తోడు  “ప్రభాకర మతం” అని పిలువబడే ఒక మతం
కుమారిలన్మదం –  “భట్ట మతం” అని పిలువబడే ఒక మతం.
కుఱుగియమాయవాదియరై వెన్ఱిడ – (శ్రీ రామానుజు) “మాయావాద” సిద్దాంతస్తులు నివసించే చోటికి వెళ్లి దారిలో వచ్చిన ప్రతి ఒక్కరి వదనలను జయించారు.
పాఱ్కరన్మద విలక్కడి క్కొడి ఎఱిందు పోయ్ – (శ్రీ రామానుజ) “భాస్కర” మతస్తుల వాదలను పెలికి పారేసి ముందుకి సాగిపోయారు.
మీఱివాదిల్వరుం – ఈ “భాస్కర” మతస్తులు శ్రీ రామానుజను జయించాలని గర్వంతో వచ్చారు.
మిక్కయాదవమదత్తై మాయ్ త్త – (భాస్కర సిద్దాంతాన్ని జయించి, శ్రీ రామానుజ) అధిక సంఖ్యలో అనుచరులున్న “యాదవప్రకాశ” మతాన్ని పూర్తిగా నాశనం చేశారు
నాళుం మిగ వాళియే!!! – దీర్ఘకాలం జీవించండి
పెరువీరర్ –  అసమానమైన శౌర్యము కలిగిన ఎంబెరుమానార్

సరళ అనువాదము:

ఈ పాసురములో శ్రీ రామానుజులు సాధించిన దిగ్విజయాలను మణవాళ మామునులు కీర్తిస్తున్నారు. ప్రత్యేకంగా వారి కాలములో ప్రబలమైన/ ప్రసిద్ధమైన కొన్ని తత్వాల జాబితా ఇక్కడ ఇస్తున్నారు. “చారువాక”, “సమణం”, “సాఖ్యం”, “సాంఖ్యం”, “కాణావాధి”, “పాసుపత”, “ప్రభాకర”, “బట్ట”, “మాయావాద”, “యాదవ” మొదలైన తత్వ శాస్త్రములపై  శ్రీ రామానుజులు సాధించిన విజయాలను మణవాళ మామునులు కీర్తిస్తున్నారు. శ్రీ రామానుజుల విజయములు ప్రతిదినం వృద్ధి పొందాలని వారికి మంగళం పాడుతూ  మణవాళ మామునులు పూర్తిచేస్తున్నారు.         

వివరణ:

“చారువాక మతం” అని పిలువబడేది ఒక తత్వశాస్త్రం, దీని ప్రాథమిక సిద్ధాంతం “ప్రత్యక్షమేవ చార్వాకః” (చార్వాకులు కంటికి కనిపించే వాటిని మాత్రమే అంగీకరిస్తాడు), శ్రీ రామానుజులు తన దహింపజేసే వాదనా కిరణాలతో ఆ సిద్దాంతాన్ని బూడిదలో కాలిపి వేస్తారు. శ్రీ రామానుజులు “సమణం” (జైన మతం) అని పిలువబడే సిద్దాంతాన్ని కాల్చి దగ్దం చేసి వేస్తారు. వారి దహింపజేసే వాదనా కిరణాలతో “సాఖ్య మతం” అని పిలువబడే సముద్రాన్ని నీటి బొట్టు కూడా లేకుండా బంజరు భూమిగా మార్చి వేస్తారు. పెద్ద స్థాయిలో వ్యాపించి ఉన్న “సాంఖ్య మతం” పేరుతో  ఒక తత్వశాస్త్రము ఉండేది. పెద్ద స్థాయిలో వ్యాపించి ఉన్నందున దాన్ని ఒక మహా పర్వతంతో పోల్చేవారు. అయినప్పటికీ, శ్రీ రామానుజులు వజ్రాయుధము లాంటి తమ వాదనలతో ఆ పర్వతాన్ని సర్వనాశనం చేస్తారు. ప్రతివాదనలకు పేరుగాంచిన “కాణాద్వాదిగళ్” అని పిలువబడే ఒక సమూహం ఉండేది. శ్రీ రామానుజులు తమ వాదనలతో వాళ్ళ ప్రతి వాదనలను దగ్దం చేస్తారు.

“పాసుపతులు” అనే పేరుతో పిలువబడే మరొక సమూహం ఉండేది. ఈ బృందానికి చెందిన చాలా మంది శ్రీ రామానుజులపై వాదించి గెలవాలనే ఉద్దేశ్యముతో పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అయినప్పటికీ, శ్రీ రామానుజులు తమ తర్క వితర్క వాదనలతో వారిని చెల్లాచెదరు చేస్తారు. బాణాసుర యుద్ధంలో రుద్రుడిని కుటుంబ సమేతంగా శ్రీ కృష్ణుడు ఎలా  చెల్లాచెదరు చేసి పరిగెత్తించారో అలాగ.  “ప్రభాకర సిద్ధాంతం” మరియు “భట్ట సిద్ధాంతం” ల వైపు శ్రీ రామానుజులు శక్తివంతమైన బాణాలను గురి పెట్టి వాళ్ళను పతనం చేస్తారు. ఇలా చేసిన తరువాత, మాయావాద శాస్త్రాన్ని  అనుసరించే వారి నివాస ప్రదేశాలకు అతను వెళతారు. అప్పట్లో వాళ్ళ ప్రభావం దూర దూరం వరకు వ్యాపించి ఉండేది. శ్రీ రామానుజులు తమ వాదనలను ప్రయోగించి వారిని ఓడిస్తారు, “వాదిల్ వెన్ఱాన్ నమ్మిరామానుసన్ (ఇరామానుశ నూఱ్ఱందాది 58)” అన్న వాఖ్యములో కీర్తించబడింది. “భాస్కర సిద్ధాంతం” వాళ్ళు  శ్రీ రామానుజుల ముందు వాద్వివాదమునకు దిగినప్పటికీ, శ్రీ రామానుజులు వారిని ఓడించడమే కాక, వారు వేసిన బాటలో ఎవ్వరూ నడవకుండా చేస్తారు. “యాదవ సిద్ధాంతం” అనుచరులు పెద్ద సంఖ్యలో శ్రీ రామానుజులను ఓడించాలనే లక్ష్యంతో జట్టుగా కలిసి వస్తారు. శ్రీ రామానుజులు వారి సిద్ధాంతము కూడా జాడ లేకుండా చేస్తారు.

ఈ తత్వాలను ఖండించి ఓడించిన శ్రీ రామానుజుల విజయాలు దినదినము పెరగాలని  మణవాళ మామునులు కోరుతున్నరు.   

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/10/arththi-prabandham-29/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 28

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 27

srivaishna-guruparamparai

పరిచయము:

తాము ఎన్నడూ శ్రద్ధ చూపని వాటిపైన శ్రద్ధ కల్పించి ఆ కార్యములను సుసంపన్నం చేసేలా చేసిన శ్రీ రామానుజుల అనుగ్రహమును మణవాళ మామునులు అనుభవిస్తున్నారు. మణవాళ మామునులు వారి పూర్వ జీవితంలో అన్నీ సత్కార్యములే చేసినా కానీ వారికి పరమపదానికి వెళ్ళడంపై పెద్ద ఆసక్తి ఉండేది కాదు. శ్రీ రామానుజులు వారిని అనుగ్రహించి, పరమపదము చేరుకోవాలనే కోరికను ప్రేరేపించిన తరువాత మాత్రమే, మాత్రమే, వారు పరమపదము చేరుట పై దృష్టి సారించారు. అందుకని మణవాళ మామునులు ఈ పాశురములో శ్రీ రామానుజులు తనకి అనుగ్రహించిన ఈ అపురూపమయిన ఆశీర్వాదమును  ప్రశంసిస్తున్నారు.

 పాశురము:

పండు పలవారియరుం పరులగోరుయ్య
ప్పరివుడనే శెయ్దరుళుం పల్గలైగళ్ తమ్మై
క్కండదెల్లాం ఎళుది అవై కఱ్ఱిరుందుం పిఱర్ క్కు
క్కాదలుడన్ కఱ్పిత్తుం కాలత్తై క్కళిత్తేన్
పుండరీగై కేళ్వనుఱై పొన్నులగుదన్నిల్
పోగ నినైవొన్ఱుం ఇన్ఱి ప్పొరుంది ఇంగే ఇరుందేన్
ఎండిశైయొం ఏత్తుం ఎదిరాశన్ అరుళాలే
ఎళిల్ విశుమ్బైయన్ఱి ఇప్పోదెన్ మనం ఎణ్ణాదే

ప్రతి పద్ధార్ధం

పణ్డు – ముందు
కాలత్తై క్కళితేన్ – నేను నా జీవితాన్ని అలా గడిపాను
క్కాదలుడన్ – ప్రేమగా
కఱ్పిత్తుం – ప్రచారము చేస్తూ / శిక్షణ ఇస్తూ
పిఱర్కు –  ఇతరులకు
అవై కఱ్ఱిరుందుం – నా గురువుల వద్ద నేను నేర్చుకున్న
క్కండదెల్లాం – గ్రంధాలలో నేను చూసిన జ్ఞానం
ఎళుది – నేను నేర్చుకున్న దాని గురించి రాశాను
పల్గలైగళ్ తమ్మై – ఆ పుస్తకాల సంగ్రహము
శెయ్దరుళుం – ఉదారముగా ఇవ్వబడిన
పలవారియరుం – “ఆత్మ యొక్క అభ్యున్నతి, శ్రేయస్సు” గురించి ఎల్లప్పుడూ ధ్యానించి, సిద్ధాంతాల కొరకు నిలబడిన గురువులు
ప్పరివుడనే – ఈ చేతనుల పట్ల కరుణతో (ఆ పుస్తకాలను) ఇచ్చారు
పరులగోరుయ్య – ఈ లోకములోని చేతనులు ఉద్ధరింపబడాలని (బంధముక్తి)
ప్పొరుంది ఇంగే ఇరుందేన్ – ఈ విభూతిలో సంతోషముగా ఉండేవాడిని
పోగ నినైవొన్ఱుం ఇన్ఱి – వెళ్ళాలని అణువు మాత్రము కూడా కోరిక లేకుండా
పొన్నులగుదన్నిల్ – “నిత్య విభూతి” అని పిలువబడే పరమపదం
ఉఱై  – నివాస స్థానమైన
పుండరీగై కేళ్వన్ – దివ్య కమల పుష్పములో ఆసీనమై ఉన్న పెరియ పిరాట్టి యొక్క దివ్య పతి,  శ్రీమన్నారాయణ
ఇప్పోదెన్ మనం ఎణ్ణాదే – నా మనస్సు ఇక దేని గురించి ఆలోచించదు.
ఎళిల్ విశుమ్బైయన్ఱి – ఆహ్లాదభరితమైన పరమపదము తప్పా
ఎదిరాశన్ అరుళాలే – ఎంబెరుమానార్ల ఆశీర్వాదము (ఆ కారణంగా)
ఎండిశైయొం ఏత్తుం – అతను అష్థ దిక్కులలోని వాళ్ళ ప్రశంసలను  అందుకుంటున్న వ్యక్తి

సరళ అనువాదము:

మణవాళ మామునులు అంతకుముందు వారు తన జీవితాన్ని ఎలా గడిపినారో వివరిస్తున్నారు. ప్రేమపూర్వకంగా ఆచర్యులు ఈ ప్రపంచానికి అందించిన గ్రంధాలను వారు చదివేవారు. వారు వాటిని క్రమంగా చదివి, వాటిని అనుసరిస్తూ, అందులోని  రహస్యాల గురించి తెలియని వారికి బోధిస్తూ ఉండేవారు. మణవాళ మామునులకు పరమపదానికి వెళ్ళాలని  ఎటువంటి ఆలోచన లేదా ఆసక్తి ఉండేది కాదు. అయినను, ఉభయ దేవేరులతో దివ్య భక్తుల నిత్య నివాసమైన శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉన్న పరమపదమును చేరుకోవాలనే కోరికను తనకనుగ్రహించిన ఎంబెరుమానార్ల కృపని వారు కీర్తిస్తున్నారు.

వివరణ:

“ఈ ప్రపంచములో అజ్ఞానులను ఉద్దరించాలనే ఏకైక ఉద్దేశ్యముతో అందించిన మన పూర్వాచర్యుల గ్రంధాలను ఇదివరలో నేను చదివాను” అని మణవాళ మామునులు తెలుయజేస్తున్నారు. ఆ గ్రంధాలను వేర్వేరు ఆచార్యులు రచించినప్పటికీ, అవన్నీ ఏక కంఠంతో పలికినట్లు అందులో ఒకే అభిప్రాయం ప్రతిధ్వనించింది. చేతనుల పట్ల కరుణతో మన ఆచార్యలు ఆ గ్రంధాలను మనకిచ్చారు. ఆ సమయంలో ఎంతో ఆసక్తితో చేతికి వచ్చిన ప్రతి గ్రంధాన్ని నేను అధ్యయనం చేసాను. “తెరిత్తు ఎళుది (నాన్ముగన్ తిరువందాది 63)”లో చెప్పినట్లుగా, నేను నా ఆచార్యుల నుండి వాటిని క్రమమైన పద్ధతిలో అధ్యయనము చేశాను.  వాటిని నేర్చుకోవడమే కాకుండా, ఆ గ్రంధాలలో పేర్కొన్న వాటికి అనుసరించాను కూడా. క్రమంగా ఈ గ్రంధాల గురించి తెలియని వారికి వాటిని బోధించడం ప్రారంభించాను. ఈ పుస్తకాల ఉద్దేశ్యాన్ని వారికి తెలిపడం, తద్వారా వారి ఆత్మ శ్రేయస్సుకి  ప్రయోజనకరంగా ఉంటుందని వారికి బోధించడం జరిగింది. ఈ రకంగా నేను నా సమయాన్ని గడిపే వాడిని.  శ్రీమన్నారాయణుడు నివాసముండే పరమపదానికి చేరుకోవాలనే ఆసక్తి నాకు ఎప్పుడూ ఉండేది కాదు. నేను ఈ ప్రపంచ సుఖాలను అనుభవిస్తూ, పెరియ పిరాట్టి యొక్క భర్త  శ్రీమన్నారాయణుడు  (ముదల్ తిరువందాది 67 లో “తామరైయాళ్ కేళ్వన్” అని వర్ణించినట్లు) ఉండే చోటు గురించి పట్టించుకోలేదు.  “పరమపదం” అని పిలువబడే ఆ అద్భుతమైన ప్రదేశానికి వెళ్లాలన్న కోరిక నాకు ఎప్పుడూ కలగలేదు.

“ఎంబెరుమానార్ల ఆశీర్వాదాలతో తన కృపా వర్షాన్ని నాపై కురిపించే వరకు, పరమపదానికి వెళ్ళాలనే ఆసక్తి నాకు కలుగలేదు.” అని మణవాళ మామునులు కొనసాగిస్తున్నారు. వారి దయని ఖచ్చితంగా అష్ట దిక్కులలో అందరూ కీర్తించాల్సిన  విషయం. వారి ఆశీస్సులను పొందిన నేను ఎంత అదృష్టవంతుడిని. ఇక పరమపదానికి వెళ్లడం తప్ప మరే విషయము గురించి నా మనస్సు ఆలోచించుట లేదు. ఇది మన స్వామి అనుగ్రహముతో తప్ప మరిదేనితో సాధ్యము కానిది.  ఎంబెరుమానార్ల కృప గురించి నొక్కి చెప్పే “అరుళాలే” అన్న పదము “తేఱ్ఱత్తు ఏకారం” లోనిది.

 స్పష్ఠీకరణ :

“అరుళాలే” అనే పదంలో, రచయిత పిళ్ళైలోకం జీయర్ “తేఱ్ఱత్తు ఏకారం” గురించి ప్రస్తావించారు. ఇది తమిళ వ్యాకరణం, దీనికి కొంచెం వివరణ అవసరం. తమిళ వ్యాకరణంలో “ఏకారం” అనేది రెండు రకాలు. మొదటిది “తేఱ్ఱత్తు ఏకారం”. ఇది “ఉరుది” లేదా “నిశ్చయత” లేదా “ఏకగ్రీవత” ని సూచిస్తుంది. ఉదాహరణకి – తిరుప్పావై 1 వ పాశురములో ఆండాళ్ దానిని అందంగా వివరించింది. “నారాయణనే” లో, ఆండాల్ “ఏకారం” ను ఉపయోగించింది అంటే నారాయణుడు మాత్రమే పఱై (పర ప్రయోజనం) ఇవ్వగలడు మరెవరూ కాదు అని. మోక్షం ఎవరు ఇవ్వగలరో, మరెవరూ ఇవ్వలేరనే వాస్తవం గురించి ఖచ్చితంగా చెప్పడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఇది “తేఱ్ఱత్తు ఏకారం”. “పిరినిలై ఏకారాం” రెండవ రకము. “అది కూడా” అని దాని అర్థం.  “నమక్కే” అనే ఉదాహరణలో , అంటే నారాయణుడు మనలాంటి వ్యక్తులకు పఱై ఇస్తారని ఆండాళ్ ఉపయోగించిందని అర్థం. మనమెవరు? మనము తిండి, నిద్ర, ఇతర ప్రాపంచిక సుఖాలను వెదుక్కుంటూ, అవే అలౌకిక సుఖాలనుకొని తిరిగే సాధారణ (అల్ప) మానవులము. అతి అల్పమైన, తెలివిలేని మానవులమైన మనలాంటి వాళ్ళకు కూడా (నమక్కే), నారాయణుడు అనుగ్రహిస్తాడు. ఈ అర్థాన్ని “పిరినిలై ఏకారాం” అని అంటారు. “ఎణ్ణాదే” అనే వాఖ్యములో, “తేఱ్ఱత్తు ఏకారం” ఉపయోగించబడింది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/10/arththi-prabandham-28/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 27

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 26

paramapadham

ప్రస్తావన

మునుపటి పాశురములో మణవాళ మామునులు “ఒళి విసుమ్బిల్ అడియేనై ఒరుప్పడుత్తు విరైన్దే” అని శ్రీ రామానుజులను అడిగెను. వారు శ్రీ రామానుజులను తామను పరమపదమునకు చేర్చుటను త్వరితపరచే ప్రక్రియ తెలపమని కోరెను. “వానే తరువాన్ ఎనక్కాయ్ (తిరువాయ్ మొళి 10.8.5)” అను ప్రబంద వాక్యానుసారం, శ్రీ రామానుజులు కూడా మణవాళ మామునుల పరమపదమునకు చేరాలనే దృఢమైన ఆర్తిని పూర్తి చేసెదనని చెప్పెను. పరమపదమును చేరుట నిశ్చయమగుటచే, మణవాళ మామునులు తన మనసుకు, ఇక నుండి చేయతగినవి మరియు చేయతగనవి చెప్పుచున్నరు. ఈ భౌతిక ప్రపంచ అవరోధములయందు ద్యాస ఉంచకూడదని ప్రారంభించెను. పరమపదమునందు తన స్థాననము ఖాయమైన నేపద్యమున చేయతగిన పనుల గూర్చి చెప్పుట కొనసాగించెను.

పాశురం 27

ఇవ్వులగినిల్ ఇని ఒన్ఱుమ్ ఎణ్ణాదే నెన్జే
ఇరవుపగల్ ఎతిరాసర్ ఎమక్కు ఇనిమేల్ అరుళుమ్
అవ్వులగై అలర్మగళ్కోన్ అన్గిరుక్కుమ్ ఇరుప్పై
అడియార్గళ్ కుళాన్గళ్ తమై అవర్గళ్ అనుభవత్తై
ఇవ్వుయిరుమ్ అదుక్కు ఇట్టుప్పిఱందు ఇళందు కిడందదు
ఎన్నుమ్ అత్తై ఎన్ఱుమ్ అదుక్కు ఇడైచువరాయ్ కిడక్కుమ్
వెవ్వినైయాల్ వన్ద ఉడల్ విడుమ్ పొళుదై విట్టాల్
విళైయుమ్ ఇన్బమ్ తన్నై ముఱ్ఱుమ్ విడామల్ ఇరున్దు ఎణ్ణే!

ప్రతి పద్ధార్ధం

నెన్జే – ఓ! మనసా!!!
ఎణ్ణాదే – ఆలోచించచకు
ఒన్ఱుమ్ – ఏదైనన
ఇవ్వులగినిల్ – ఈ ప్రపంచము గూర్చి
ఇని – ఇకనుండి
ఎణ్ణే! – ఆలోచించు
విడామల్ ఇరున్దు – నిరంతరముగా
ఇరవుపగల్ – రేయింపగలు
అవ్వులగై – పరమపదమును
ఎతిరాసర్ – శ్రీ రామానుజ
ఇనిమేల్ అరుళుమ్ – భవిష్యత్తులో ప్రసాదించును
ఎమక్కు – మాకు
అలర్మగళ్కోన్ – సర్వశక్తి, సర్వసాక్షియగు శ్రీమన్నారాయణుడు, అలమేలుమంగ (తామర పువ్వుయందు                                    అమరియున్న పెరియ పిరాట్టికి పతిని (గూర్చి తలచుము)
ఇరుక్కుమ్ ఇరుప్పై – దివ్యమైన సింహాసనమున వారు విరాజిల్లు విధమును (తలచుము)
అన్గు – పరమపదమున
అవర్గళ్ అనుభవత్తై – అనుభవ పాత్రమగు నేను (వారి గూర్చి తలచుము)
కుళాన్గళ్ తమై – సమూహము
ఎన్ఱుమ్ –  ఎల్ల వేళల (తలచుము)
ఎన్నుమ్ అత్తై – వాటిని
ఇట్టుప్పిఱన్దు – ఇంకను పాత్రుడౌట
ఇళన్దు కిడన్దదు – అవకాసం చేజార్చుకొనుట (నిత్యసూర్యుల యొక్క అనుభవ పాత్రుడగు) 
ఇవ్వుయిరుమ్ – ఈ ప్రాణమైనను
అదుక్కు ఇడైచువరాయ్ కిడక్కుమ్ –  వాటికి అడ్డుగా ఉండు విషయమును గూర్చి (తలచుము)
వన్ద – కారణమగు
వెవ్వినైయాల్ – క్రూరమై పాపములు (ఈ శరీరముతో సంబందముచే)
ఉడల్ విడుమ్ పొళుదై – ఈ దేహము పతనముగు సమయమున (తలచు) 
అదుక్కు – అనుభవం కలుగుట (గూర్చి తలుచుము)
విట్టాల్ –   ఈ దేహ పతనము చెందునప్పుడు
విళైయుమ్ –  తుదకు కారణమగు
ఇన్బమ్ తన్నై – నిత్యమైన  సుఖము
ముఱ్ఱుమ్ – పై చెప్పబడిన వాటిని (గూర్చి తలచుము)

సామాన్య అర్ధం

మణవాళ మామునులు తన మనస్సును ఈ ఆత్మా పరమపదము నందు అనుభవించబోవు దివ్యమైన సమయమును గూర్చి తలచమని అడుగుచుండెను. ఇది  పరమపదమునకు పోవు ఆశక్తిని పెంపొందించిన శ్రీ రామునుజులచే అనురహించబడినది అని మామునులు చెప్పెను. మణవాళ మామునులు తన మనస్సు తో పరమపదము గూర్చి, దివ్య దమ్పతులైన శ్రీమన్నారాయణుని మరియు పిరాట్టి గూర్చి, వారి భక్తులను గూర్చి, అట్టి భక్తిలు అనుభవించు ఒక వస్తువుగ ఉండె అవకాశమును గూర్చి,  కాని ఇప్పుడు ఆ ఆనందమును అనుభవించ లేక పోవు దురదృష్టము గూర్చి, భాగవతుల కైంకర్యము చేయుటకు ఆత్మకు కలుగు ఆటంకములను గూర్చి, విఘాతములుగా ఉండు పాపముల గూర్చి, ఆ పాపములకు కారణముగా ఉండె ఈ దేహము గూర్చి, ఈ దేహమును విడుచు గడియ గూర్చి, ఆ తరువాత పరమపదమునకు చేరు సమయమును గూర్చి విచారించమని చెప్పెను.

వివరణ

ఓ! నా మనసా! బంధమున కు కారణమగు మార్గమైనా అలాగే మోక్ష మార్గమైనా రెండింటికీ నీవే బాధ్యుడివి (పరమపదము ద్వారా)” అని మణవాళ మామునులు తన మనస్సుకి చెప్పుకుంటున్నారు. “అత దేహావసానేచ త్యక్త సర్వేదాస్బృహః” – ఈ భౌతిక ప్రపంచం పట్టించుకోకుండా ఉండవలసిన విషయాలతో నిండి ఉందని వివరించే సామెత ఇది. “ప్రకృతి ప్రాకృతుంగళ్” అని సమిష్టిగా పిలువబడే ఈ విషయాలను నిశ్శేషంగా పూర్తిగా విస్మరించాలి..  అల్పమైన, నశ్వరమైన ఈ విషయాలను అవలంబించదగనివి”. అని మామునులు ముందుకు సాగుతూ, ” ఓ! నా మనసా! నాలో పరమపదము చేరుకోవాలనే కోరికను ఎంబెరుమానార్లు ప్రేరేపించారు. కావున, ఇకపై, ఈ క్రింది విషయాలను గురించి ఎల్లప్పుడూ ధ్యానించమని నేను నీకు చెప్పబోతున్నాను, ఎంబెరుమానార్లు మనకి అనుగ్రహించే “పరమపదం” అని పిలువబడే అద్భుతమైన దివ్య లోకాము గురించి ధ్యానించు, శ్రీ మన్నారాయణుని గురించి ధ్యానించు, వారి దివ్య పత్ని అయిన పెరియ పిరాట్టి గురించి ధ్యానించు, ఆ పరమపదంలో వారి సింహాసనముపై గంభీరముగా ఆసీనులై ఉన్నవారి గురించి చింతన చేయి. దివ్య సుగంధములతో రూపుదిద్దుకొని పెరియ పిరాట్టి పద్మాసీనమై ఉంది. “ఎళిల్ మలర్ మాదరుం తానుం ఇవ్వేళులగై ఇన్బం పయక్క ఇనిదుడన్ వీఱ్ఱిరుందు” (తిరువాయ్మొళి 7.10.1) లో వర్ణించినట్టుగా ఆవిడ దివ్య సింహాసనముపై తన దివ్య పతి అయిన శ్రీమన్నారాయణునితో ఉంది. ఈ దివ్య దంపతుల నిత్యసేవలో ఉన్న ఆ దివ్య భక్తుల (“అడియార్ కుళంగళై – తిరువాయ్మొళి 2.3.10) గురించి ఆలోచించుము.  వాళ్ళు నిన్ను ఆస్వాదించుట చూసి నీవు పొందే ఆనందం గురించి ఆలోచించు. నీవు ఆత్మగా ఆ అర్హత కలిగున్నప్పటికీ, ఇప్పుడు ఆ భక్తులకు ఆనందదాయకము కాని నీ దురదృష్టం గురించి ఆలోచించు. ఆఖరికి ఈ శరీరము రాలిపోయే ఆ క్షణము గురించి ధ్యానించుము. మొదట ఈ నష్థానికి కారణమైన అడ్డంకుల గురించి ధ్యానించు. మనమది సాధించడంలో అన్నింటి కంటే పెద్ద అవరోధమైన ఈ శరీనము గురించి ధ్యానించు. “పొల్లా ఒళుక్కుం అళుక్కుడంబుం” అని తిరువిరుత్తం 1 లో చెప్పినట్టుగా, ఈ శరీరము కొరకు ఎన్ని పాపాలు చేసి ఉంటామో వాటి గురించి ధ్యానించు. ఆఖరికి ఈ శరీరము రాలిపోయే ఆ క్షణము గురించి ధ్యానించుము. ఈ శరీరాన్ని విడిచిన అనంతరం ఈ ఆత్మ అనుభవించే శాశ్వత పరమానందము గురించి ఆలోచించు.  ఈ విషయాలన్నింటి గురించి రాత్రింబగళ్ళు ధ్యానించు. ఇవి ఆత్మ “ఆలోచించాల్సిన విషయాలు”. నిరంతము ఈ అంశాలను ధ్యానించు. “ఇవ్వులగిల్ ఇని ఒన్ఱుం ఎణ్ణాదే” అన్న ఈ వాక్యము, నమ్మాళ్వార్ల తిరువాయ్మొళి 10.6.1 లోని “మరుళ్ ఒళి నీ” పాశురమును పోలి ఉంది. రెండూ అర్చావతార ప్రాముఖ్యతను తెలుపుతున్నాయి.  

అడియేన్ వైష్ణవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/10/arththi-prabandham-27/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ಸ್ತೋತ್ರ ರತ್ನ – ಸರಳ ವಿವರಣೆ – ತನಿಯನ್ಗಳು

Published by:

ಶ್ರೀ: ಶ್ರೀಮತೇ ಶಠಕೋಪಾಯ ನಮ: ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮ: ಶ್ರೀಮದ್ ವರವರಮುನಯೇ ನಮ:

ಸ್ತೋತ್ರ ರತ್ನ

ಸ್ವಾದಯನ್ನಿಹ ಸರ್ವೇಷಾಮ್ ತ್ರಯ್ಯನ್ತಾರ್ತಮ್ ಸುದುರ್ಗ್ರಹಮ್ |
ಸ್ತೋತ್ರ ಯಾಮಾಸ ಯೋಗೀನ್ದ್ರಃ ತಮ್ ವನ್ದೇ ಯಾಮುನಾಹ್ವಯಮ್ ||

ಅಡಿಯೇನ್ ಅರಿಯಲು ಕಠಿನವಾದ ವೇದಾನ್ತ ತತ್ತ್ವಗಳನ್ನು ಎಲ್ಲರಿಂದಲೂ ಸುಗ್ರಾಹ್ಯವಾಗಿ(ಗ್ರಹಿಸಲು ಸುಲಭವಾದ ರೀತಿಯಲ್ಲಿ) ಸ್ತೋತ್ರ ರೂಪದಲ್ಲಿ ಪ್ರಕಾಶಿಸಿದ ಯೋಗಿಗಳಲ್ಲಿ ಉತ್ತಮರಾದ ಆಳವಂದಾರನ್ನು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ.

ನಮೋ ನಮೋ ಯಾಮುನಾಯ ಯಾಮುನಾಯ ನಮೋ ನಮಃ |
ನಮೋ ನಮೋ ಯಾಮುನಾಯ ಯಾಮುನಾಯ ನಮೋ ನಮಃ ||

ಅಡಿಯೇನ್ ಆಳವಂದಾರನ್ನು ಪುನಃಪುನಃ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ, ಅವರಿಗೆ ನಾಮಸ್ಕರಿಸಲಾಗದಿರಲು ಅಡಿಯೇನಿಂದ ಸಾದ್ಯವಿಲ್ಲ.

ಅಡಿಯೇನ್ ಆಳವಂದಾರ್ ರಾಮಾನುಜ ದಾಸನ್

ಮೂಲ – http://divyaprabandham.koyil.org/index.php/2016/12/sthothra-rathnam-invocation/

ಆರ್ಕೈವ್ ಮಾಡಲಾಗಿದೆ : http://divyaprabandham.koyil.org

ಪ್ರಮೇಯಂ (ಲಕ್ಷ್ಯ) – http://koyil.org
ಪ್ರಮಾಣಂ (ಶಾಸ್ತ್ರ ) – http://granthams.koyil.org
ಪ್ರಮಾತಾ (ಪೂರ್ವಾಚಾರ್ಯರು) – http://acharyas.koyil.org
ಶ್ರೀವೈಷ್ಣವ ಶಿಕ್ಷಣ/ಮಕ್ಕಳ ಪೋರ್ಟಲ್ – http://pillai.koyil.org

ಸ್ತೋತ್ರ ರತ್ನ- ಸರಳ ವಿವರಣೆ

Published by:

ಶ್ರೀ: ಶ್ರೀಮತೇ ಶಠಕೋಪಾಯ ನಮ: ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮ: ಶ್ರೀಮದ್ ವರವರಮುನಯೇ ನಮ:

vishnu-lakshmi
alavandhar-nathamunigal

ವಿಶಿಷ್ಟಾದ್ವೈತ ಸಿದ್ಧಾತ ಹಾಗು ಶ್ರೀವೈಷ್ಣವ ಸಂಪ್ರದಯದ ಉತ್ತಮ ವಿದ್ವಾನ್ ಹಾಗು ಶ್ರೀಮನ್ನಾಥಮುನಿಗಳ ಪೌತ್ರರಾದ(ಮೊಮ್ಮಗರಾದ) ಆಳವಂದಾರ್ ಪ್ರಾಪ್ಯ (ಹೋಂದಬೇಕಾದ ವಿಷಯ/ ಗುರಿ) ಹಾಗು ಪ್ರಾಪಕಗಳ (ಅದರ ಉಪಾಯ/ಸಾಧನ) ಸ್ವರೂಪವನ್ನು ದ್ವಯಮಹಾಮಂತ್ರದ ವಿಸ್ತರ ವಿವರಣೆಯ ರೂಪದಲ್ಲಿ ತಮ್ಮ ಸ್ತೋತ್ರ ರತ್ನದಲ್ಲಿ ಪ್ರಕಾಶಿಸಿದ್ದಾರೆ. ನಮಗೆ ಲಭ್ಯವಾದ ಪೂರ್ವಾಚಾರ್ಯರ ಸಂಸ್ಕೃತ ಸ್ತೋತ್ರ ಗ್ರಂಥಗಳಲ್ಲಿ ಇದು ಪುರಾತನತಮವಾದದ್ದು.

ಪೆರಿಯ ನಂಬಿಗಳು ಇಳೈಯಾೞ್ವಾರನ್ನು(ಶ್ರೀ ರಾಮಾನುಜರನ್ನು) ಆಳವಂದಾರಿನ ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ಮಾಡಿಸಲು ಕಾಂಚೀಪುರಕ್ಕೆ ಹೊರಟಿದ್ದರು. ತಿರುಕ್ಕಚ್ಚಿ ನಂಬಿಗಳ ಉಪದೇಶದಂತೆ ದೇವಪ್ ಪೇರುಮಾಳಿನ ಕೈಂಕರ್ಯಕ್ಕಾಗಿ ಸಾಳೈಕ್ಕಿಣಱಿಂದ(ಒಂದು ಬಾವಿ) ತೀರ್ಥವನ್ನು ತರುತಿದ್ದರು. ಪೆರಿಯ ನಂಬಿಗಳ ಸ್ತೋತ್ರ ರತ್ನದಿಂದ ಪಠನವು ಇಳೈಯಾೞ್ವಾರನ್ನು ತುಂಬಾ ಅಕರ್ಶಿಸಿತು ಹಾಗು ಅವರನ್ನು ನಮ್ಮ ಸಂಪ್ರದಾಯಕ್ಕೆ ತಂದಿತು. ಎಮ್ಪೆರುಮಾನಾರೆಂದು ಪ್ರಸಿದ್ಧರಾದ ಇಳೈಯಾೞ್ವಾರಿಗೆ ಈ ಸ್ತೋತ್ರವು ತುಂಬಾ ಪ್ರಿಯವಾಗಿತ್ತು ಹಾಗು ಇದರ ಹಲವಾರು ಭಾಗಗಳನ್ನು ತಮ್ಮ ಶ್ರೀವೈಕುಂಠಗದ್ಯದಲ್ಲು ಆಕರಿಸಿದ್ದಾರೆ

ಪೆರಿಯವಾಚ್ಚಾನ್ ಪಿಳ್ಳೈ ಈ ದಿವ್ಯವಾದ ಪ್ರಬಂಧಕ್ಕೆ ವಿಸ್ತರವಾದ ವ್ಯಾಖ್ಯಾನವನ್ನು ರಚಿಸಿದ್ದಾರೆ. ದುರ್ಗ್ರಾಹ್ಯವಾದ ಸ್ತೋತ್ರಗಳಿಗೆ ಸುವ್ಯಕ್ತವಾಗಿ ಅರ್ಥಗಳನ್ನು ತೋರಿದ್ದಾರೆ. ಶ್ಲೋಕಗಳಿಗೆ ಈ ವ್ಯಾಖ್ಯಾನವನ್ನು ಅನುಸರಿ ಸರಳ ಅರ್ಥವನ್ನು ನೋಡುತಿದ್ದೇವೆ.

ಅಡಿಯೇನ್ ಆಳವಂದಾರ್ ರಾಮಾನುಜ ದಾಸನ್

ಮೂಲ – http://divyaprabandham.koyil.org/index.php/2020/10/sthothra-rathnam-simple/

ಆರ್ಕೈವ್ ಮಾಡಲಾಗಿದೆ : http://divyaprabandham.koyil.org

ಪ್ರಮೇಯಂ (ಲಕ್ಷ್ಯ) – http://koyil.org
ಪ್ರಮಾಣಂ (ಶಾಸ್ತ್ರ ) – http://granthams.koyil.org
ಪ್ರಮಾತಾ (ಪೂರ್ವಾಚಾರ್ಯರು) – http://acharyas.koyil.org
ಶ್ರೀವೈಷ್ಣವ ಶಿಕ್ಷಣ/ಮಕ್ಕಳ ಪೋರ್ಟಲ್ – http://pillai.koyil.org

periya thirumozhi – 2.2.10 – iNdai koNdu

Published by:

SrI:  SrImathE SatakOpAya nama:  SrImathE rAmAnujAya nama:  SrImath varavaramunayE nama:

periya thirumozhi >> Second centum >> Second decad

<< Previous

Highlights from avathArikai (Introduction)

No specific introduction.

pAsuram

iNdai koNdu thoNdar Eththa evvuL kidandhAnai
vaNdu pAdum paimbuRavil mangaiyar kOn kaliyan
koNda seerAl thaN thamizh sey mAlai Iraindhum vallAr
aNdam ALvadhu ANai anREl ALvar amarulagE

Word-by-Word meanings

iNdai – flower garlands
koNdu – offering at the divine feet
thoNdar – SrIvaishNavas
Eththa – to be praised by
evvuL – in thiruvevvuL
kidandhAnai – on the one who mercifully rested
vaNdu – beetles
pAdum – humming
pai – vast
puRavil – having surrounding areas
mangaiyar kOn – the king of the residents of thirumangai region
kaliyan – thirumangai AzhwAr
koNda sIr – his auspicious qualities which are held in the heart
thaN – wet (compassionate)
thamizhAl – in thamizh language
sey – mercifully spoke
mAlai – in the form of a garland
Iraindhum – these ten pAsurams
vallAr – those who can learn
aNdam – this oval shaped universe under the control of brahmA
ALvadhu – ruling over
ANai – is certain;
anREl – if that is not desired
amar ulagu – paramapadham
ALvar – will get to rule.

Simple translation

thirumangai AzhwAr, the king of the thirumangai region which is having vast surrounding areas where beetles are humming, mercifully spoke these ten pAsurams about the auspicious qualities of emperumAn which are held in his heart. emperumAn has mercifully rested in thiruvevvuL to be praised by SrIvaishNavas by offering flower garlands at his divine feet; those who can learn this decad are certain to rule over this oval shaped universe under the control of brahmA; if that is not desired, they will get to rule paramapadham.

Highlights from vyAkyAnam (Commentary)

iNdai … – For the SrIvaishNavas to offer flower garlands and live in thiruvevvuL serving the emperumAn who has mercifully rested there. Such emperumAn is being praised here. Just as mukthAthmAs will sing sAmagAnam, the beetles having drunk honey, will keep humming in the vast areas which surround thirumangai region – AzhwAr who is the king of such thirumangai.

koNda seerAl … – sIr – decoration for a poem; that is said here. Alternative explanation – as emperumAn came and reclined here, his qualities remained firmly in AzhwAr’s heart, and due to their impelling, the garland of words which could not be controlled in AzhwAr’s heart was thus spoken. Those who learned this decad will certainly rule the aNdam.

anREl … – If one is detached thinking “Even after surrendering unto him, will we desire to rule this world?”, they will rule over parampadham.

In the next article we will enjoy the next pAsuram.

adiyen sarathy ramanuja dasan

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

periya thirumozhi – 2.2.8 – munivan mUrththi

Published by:

SrI:  SrImathE SatakOpAya nama:  SrImathE rAmAnujAya nama:  SrImath varavaramunayE nama:

periya thirumozhi >> Second centum >> Second decad

<< Previous

Highlights from avathArikai (Introduction)

No specific introduction.

pAsuram

munivan mUrththi mUvarAgi vEdham viriththuraiththa
punidhan pUvai vaNNan aNNal puNNiyan viNNavar kOn
thaniyan sEyan thAn oruvan Agilum than adiyArkku
iniyan endhai emperumAn evvuL kidandhAnE

Word-by-Word meanings

munivan – one who vowed to create
mUrththi mUvar Agi – being brahmA, vishNu and rudhra
vEdham – meanings of vEdham
viriththu – to make everyone know
uraiththa – one who mercifully explained in SrI gIthA
punidhan – having purity
pUvai – like kAyAm pU (dark coloured flower)
vaNNan – having divine complexion
aNNal – being lord
puNNiyan – being greatly magnanimous
viNNavar – for nithyasUris
kOn – being the leader
thaniyan – being matchless
sEyan – being difficult to be known even by yOgis
thAn oruvan Agilum – though he remains distinguished (in this manner)
than adiyArkku – for those who are surrendered unto him
iniyan – being good
endhai – being my father
emperumAn – being my lord
evvuL kidandhAnE – reclined in thiruvevvuL

Simple translation

Being the one who vowed to create, being brahmA, vishNu and rudhra, one who mercifully explained in SrI gIthA to make everyone know the meanings of vEdham, having purity, having kAyAm pU like divine complexion, being the lord, being greatly magnanimous, being the leader for nithyasUris, being matchless, though he remains distinguished, being difficult to be known even by yOgis, he remains good for those who are surrendered unto him; being my father and lord, he reclined in thiruvevvuL.

Highlights from vyAkyAnam (Commentary)

munivan … – When all the AthmAs (sentient entities) in samsAra were devoid of body and senses, and were having no option for enjoyment or liberation, and had lost the effectual state, emperumAn vowed in his divine heart as in chAndhOgya upanishath “bahusyAm” (let me become many). Further, he remained as antharAthmA (in-dwelling soul) as brahmA and rudhra, and also remained in his own self as vishNu, and engaged in creation etc. One who revealed the meanings of vEdham explicitly. That is – he mercifully explained SrI gIthA which is vEdha upabruhmaNam (explanation for vEdhams).

punidhan – As said in SrI bhagavath gIthA 5.29suhrudham sarva bhUthAnAm” (friend for all), the purity which is acquired by being unselfish and looking for the well-being of others only, is explained.

pUvai vaNNan – His divine, beautiful form is such that one cannot give him up even if he leaves aside the good advice and gives bad advice.

aNNal – Lord

puNNiyan – Greatly magnanimous.

viNNavarkOn – The lord of nithyasUris who are free from ignorance.

thaniyan – One who is distinguished from nithyasUris too.

sEyan … – One who is much greater than them. Though he is matchless in this manner, he is good to those who surrender unto him. My father and lord.

In the next article we will enjoy the next pAsuram.

adiyen sarathy ramanuja dasan

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org