ఆర్తి ప్రబంధం – 34

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 33

paramapadhanathan

పరిచయము

ఈ పాశురముకు అవతారిక రూపంగా మామునులు మానసికంగా శ్రీరామానుజులకు ప్రశ్న అడుగుతున్నారు. శ్రీరామానుజులు  సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఈ పాశురములో. ప్రశ్న ఈ విధంగా ఉంది. “హే! మాముని !!! నేను ఎంతో దయగల వాడినని అనుకుందాం. కానీ,  నీకు ఉన్న అడ్డంకులు అతి బలమైనవి, అవి అత్యున్నత వ్యక్తి యొక్క దయను కూడా దూరంగా తోసేసే శక్తి ఉన్నవి. కావున, ఇక ఈ విషయంలో నేనేమి చేయగలను?” అని శ్రీ రామానుజులు మామునులను అడుగుతున్నారు.  “సర్వ పాపేభ్యో మొక్షయిష్యామి మాసుచః” (నేను నీ పాపాల నుండి నిన్ను విముక్తుడిని చేస్తాను, చింతించకు)”, అని స్వయంగా శ్రీరంగ పెరియ పెరుమాళ్ శ్రీ కృష్ణ పరమాత్మ రూపంలో ఉపదేశించిన వచనములు ఇవి కదా. అంతటి పెరియ పెరుమాళ్ కూడా మీ మాటకి కట్టుబడి ఉండి నీవు చెప్పినదే చేస్తారని విన్నాను. అందువల్ల, నా స్వామీ! శ్రీ రామానుజ !!! నీ పాద పద్మాలు తప్పా వేరే గతి లేని నన్ను విముక్తుడిని చేయుము. నా కర్మ ప్రభావాము నాకు అంటకుండా చేసి దయచేసి నన్ను బంధముక్తుడిని కావించి నాకు మోక్షాన్ని ప్రసాదించండి” అని మామునులు సమాధానమిస్తున్నారు.

పాశురము 34

మున్నై వినై పినై వినై ఆరత్తం ఎన్నుం
మూన్ఱు వగైయాన వినై త్తొగై అనైత్తుం యానే
ఎన్నై అడైందోర్ తమక్కు క్కళిప్పన్ ఎన్నుం అరంగర్
ఎదిరాశా! నీ ఇట్ట వళక్కన్ఱో శొల్లాయ్
ఉన్నై అల్లదఱియాద యాన్ ఇంద ఉడమ్బోడు
ఉళన్ఱు వినై ప్పయన్ పుశిక్క వేండువదొన్ఱుండో
ఎన్నుడైయ ఇరువినైయై ఇఱైప్పొళుదిల్ మాఱ్ఱి
ఏరారుం వైగుందత్తేఱ్ఱి విడాయ్ నీయే

ప్రతి పద్ధార్ధములు

అరంగర్ – పెరియ పెరుమాళ్
ఎన్నుం – చెప్పిన వాడు
అడైందోర్ తమక్కు – చేరే వాళ్ళ పట్ల
ఎన్నై –  వాత్సల్యం మొదలైన పవిత్ర గుణాలతో ఉన్న నేను.
యానే – సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడనైన నేను,
క్కళిప్పన్ – వినాశనం
అనైత్తుం – అవన్నీ
వినై త్తొగై – కర్మలు
మూన్ఱు వగైయాన – అవి మూడు రకాలు
ఎన్నుం – సమూహములు
మున్నై వినై – పూర్వాగం (గతంలో చేసిన పాపాలు)
పినై వినై – ఉత్తరాగం (భవిష్యత్తులోని పాపాలు)
ఆరత్తం – ప్రారబ్ద కర్మ
ఎదిరాశా –ఓ! యతులకు రాజా!!!
ని ఇట్ట వళక్కన్ఱో? – అలాంటి అరంగర్ (పెరియ పెరుమాళ్) కూడా నీకు కట్టుబడి ఉంటాడు.
శొల్లాయ్ – దయచేసి దాని గురించి చెప్పండి. దయచేసి ఇది వాస్తవమని చెప్పండి.
యాన్ – నేను
అఱియాద – తెలియదు
ఉన్నై అల్లదు –  మీరు తప్పా మరెవరైనా (రక్షించువాడిగా)
వినై ప్పయన్ పుశిక్క వేండువదొన్ఱుండో? – నేను ఆర్జించిన కర్మలన్నింటి ఫలితాన్ని అనుభవించాలా?
ఇంద ఉడమ్బోడు – ఈ శరీరములో
ఉళన్ఱు – ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉండాలా?
నీయే– మీరు మాత్రమే (మీరు చేయగలవు)
ఇఱైప్పొళుదిల్ – కను రెప్పపాటులో
మాఱ్ఱి – అణువు మాత్రము కూడా ఆణవాలు లేకుండా
ఎన్నుడైయ – నా
ఇరువినైయై –  బలమైన కర్మలు
యేఱ్ఱి విడాయ్ – (అలా చేసి), దయచేసి నేను అధీష్థించేలా చేయి
ఏరారుం –  అందమైన
వైగుందత్తు – పరమపదం

సరళ అనువాదము:

తాను జన్మ జన్మలుగా ఆర్జించిన అనేకానేక పాపాలను తొలగించి మోక్షాన్ని అనుగ్రహించ సామర్థ్యము గలిగినవారు కేవలం తమరు మాత్రమేనని శ్రీ రామానుజులకు మణవాల మామునులు విన్నపించుకుంటున్నారు. సర్వాధికారి పైగా శక్తివంతుడైన పెరియ పెరుమాళ్ కూడా తన అధీనుడై ఉన్న శ్రీ రామానుజుల పాద పద్మాలు తప్పా వేరే ఆశ్రయం తనకు లేదని మణవాల మామునులు ఇక్కడ పునరుద్ఘటిస్తున్నారు.

వివరణ:

పెరియ పెరుమాళ్ యొక్క వాక్కులను మణవాల మామునులు ఇక్కడ పునఃప్రకటిస్తున్నారు. “పూర్వాగముత్తరాగారంచ సమారబ్ధమకంతతా” అనే వాఖ్యములో – “పూర్వాగం”, “ఉత్తరాగం” మరియు “ప్రారబ్దం” అనే మూడు రకాల కర్మలు ఉన్నాయని చెప్పబడింది.  వాటిని త్యజించి, నన్ను మాత్రమే ఆశ్రయంగా స్వీకరించి నా దగ్గరకు వచ్చేవారికి, సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడిని వాత్సల్యం మొదలైనవి  శుభ లక్షణాలతో నిండి ఉన్న నేను వారి కర్మలన్నింటినీ ఎటువంటి జాడ లేకుండా నాశనం చేస్తాను” అని వివరించబడింది.  మణవాల మామునులు శ్రీ రామానుజులను “హే యతిరాజా !!! యతుల రాజా !!!! అని సంభోదిస్తూ, “వస్యస్సతా భవతితే” అన్న వాఖ్యములో వివరించినాట్లుగా  ఇంత గొప్ప పెరియ పెరుమాళ్ కూడా నీ మాటకి కట్టుబడి ఉంటాడని, నీవు చెప్పినట్లు వారు చేస్తారన్నది నిజం కాదా? నీ మాటలు నిజమని నోరువిప్పి నాకు చెప్పరా? ప్రేమతో పెరియ పెరుమాళ్ని కూడా నియంత్రించగలిగే శ్రీ రామానుజా మీరు తప్పా నేను వేరే ఆశ్రయాన్ని ఎరుగను. నేను ఈ శరీరానుబంధముతో, ఒక శరీరంలో తరువాత మరొక శరీరానికి ప్రయాణం చేస్తూనే వస్తున్నాను. ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఈ శరీర సంబంధముతో కలిగే కర్మప్రభావాలను నేను అనుభవిస్తూనే ఉండాలా? ఏది ఏమయినప్పటికీ, అనాది కాలంగా అనేకానేక కర్మలను ఆర్జించాను. “కడివార్ తీయ వినైగళ్ నోడియారుం అళవైకణ్ (తిరువాయ్మొళి 1.6.10) ”లో వివరించినట్లుగా, ఓ శ్రీ రామానుజా! నీవు మాత్రమే ఈ కర్మలన్నింటినీ అణువు మాత్రం కూడా లేకుండా నశింపజేయగల సామర్థ్యం కలిగిన వాడవు. ఆ తరువాత నేను అందమైన పరమపదానికి అధిరోహించేలా చేయగలిగే వాడినవి కూడా నీవే”.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2017/01/arththi-prabandham-34/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment