ఆర్తి ప్రబంధం – 33

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 32

ramanuja-showing-paramapadham

పాశురము 33

ఇన్నం ఎత్తనై కాలం ఇంద ఉడమ్బుడన్ యాన్ ఇరుప్పన్
ఇన్న పొళుదు ఉడుమ్బు విడుం ఇన్నబడి అదుదాన్
ఇన్న విడత్తే అదువుం అన్నుం ఇవై ఎల్లాం
ఎదిరాశా! నీ అఱిది యాన్ ఇవై ఒన్ఱఱియేన్
ఎన్నై ఇని ఇవ్వుడమ్బై విడువిత్తు ఉన్ అరుళాల్
ఏరారుం వైగుందత్తేఱ్ఱ నినైవుండేల్
పిన్నై విరైయామాల్ మఱందిరుక్కిఱదెన్ పేశాయ్
పేదైమై తీర్ అందు ఎన్నై అడిమై కోండ పెరుమానే !

ప్రతి పద్ధార్ధములు

ఎత్తనై కాలం – ఎంత కాలం
ఇన్నం – ఇప్పడి నుండి
యాన్ ఇరుప్పన్ – నేను ఎటువంటి సంబంధం లేకుండా ఉంటానో
ఇంద ఉడుమ్బన్ – ఈ దూషితమైన శరీరములో?
ఎదిరాశా! – ఎంబెరుమానారే !!!
నీ అఱిది – నీకు తెలుసా
ఇన్న పొళుదు ఉడుమ్బు విడుం  – ఎప్పుడు ఏ సమయంలో శరీరము పడిపోతుందో
ఇన్నబడి అదుదాన్ – ఏ రీతిలో మరియు
ఇన్న విడత్తే అదువుం –  ఏ చోట
ఎన్నుం ఇవై ఎల్లాం – (ఈ విషయాలన్నీ) ఇవన్నీ ఖచ్చితంగా నీకు తెలుసు.
యాన్ – అజ్ఞానినైన నేను
ఇవై ఒన్ఱఱియేన్ –  అణువు మాత్రము కూడా తెలియదు.
పేదైమై తీర్ అందు – కాబట్టి, దయచేసి నా అజ్ఞానాన్ని తొలగించండి !!!
అడిమై కోండ పెరుమానే!!! – పాలించినవాడు
ఎన్నై –  ఈ శరీరముతో ఎటువంటి సంబంధం లేకుండా నివసిస్తున్న నేను
ఇని ఉన్ అరుళాల్ – ఇప్పడి నుండీ, నన్ననుగ్రహించు
ఇవ్వుడమ్బై విడువిత్తు – శరీరము వదిలివేయుట
వైగుందత్తేఱ్ఱ – పరమపదాన్ని అధిష్ఠించునపుడు
ఏరారుం – అద్భుతంగా అలంకరించబడి సకల సౌందర్యాలతోనిండిన ప్రదేశం.
నినైవుండేల్ – (ఎంబెరుమానారే!!!) నీకు అలా చేయాలనే కోరిక ఉంటే
పిన్నై – అప్పుడు
పేసాయ్ – దయచేసి చెప్పండి
మఱందిరుక్కిఱదెన్? – మీరు ఏమి ఆలోచిస్తున్నారు,  ఆలస్యం ఎందుకు?
విరైయామాల్ – నీవు త్వరగా ఎందుకు చేయడం లేదు?

సరళ అనువాదము:

ఈ పాశురములో,  తన ఆత్మని విముక్తి  పరచి పరమపదాన్ని అధిరోహించేలా చేయడంలో ఆలస్యానికి కారణం ఏమిటి అని మణవాల మామునులు ఎంబెరుమానార్లను ప్రశ్నిస్తున్నారు. ఎంబెరుమానార్ల తరపున కరుణకు కొరత లేదు, ఇటుపక్క ఎప్పుడైనా తన శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మణవాల మామునులు. కానీ ఇంకా అలా జరగనందుకు మణవాల మామునులకు జిజ్ఞాస  పెరిగిపోతున్నది. ఆ ఉత్సుకతను ఈ పాశురములో ప్రశ్న రూపంగా ప్రతిబింబింపజేశారు.

వివరణ:

మణవాల మామునులు “ఎంబెరుమానారే! నా స్వామి! ముందు నేను మీ సంబంధ జ్ఞానము  తెలియకుండా ఉంటిని. మీరు నాలో ఆ శూన్యతను తొలగించి, నా నిజ స్వరూపాన్ని గ్రహించేలా చేశావు. “వినైయేన్ ఉనక్కడిమైయఱక్కోండాయ్ (తిరువాయ్మొళి 4.9.6)” లో వివరించినట్టుగా నేను సేవకుడనని నేను గ్రహించేలా చేశావు. మీ పట్ల నా దాసత్వాన్ని గ్రహింపజేయడమే కాకుండా, దాని యొక్క ప్రాముఖ్యతను గ్రహించేలా కూడా చేశావు. ఓ నా స్వామి! నాదొక ప్రశ్న. ఈ కలుషితమైన శరీరంలో ఈ ఆత్మని ఇంకా ఎంత కాలం ఉంచాలనుకుంటున్నావు స్వామీ? సంబంధం లేని ఈ శరీరంలో ఇంకా ఎంత కాలం ఉండాలి? ఈ శరీరం ఎప్పుడు, ఎలా, ఎక్కడ పడిపోతుందో మీకు తెలుసు. మీకంతా తెలుసు. ఈ విషయములో అణువు మాత్రము కూడా జ్ఞానములేనివాడిని నేను”. 

“నా స్వామి! నేను (ఈ ఆత్మ) ఈ దేహముతో ఎటువంటి శరీరానుబంధం లేకుండా ఉన్నాను అని మణవాల మామునులు వివరిస్తున్నారు.  ఈ శరీరం నుండి ఈ ఆత్మను విముక్తి చేసి, ఆ ఆత్మను అందమైన పరమపదం అధిరోహించాలని నీవు కోరుకుంటే, అలా చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? “విణ్ణులగం తరువానాయ్ విరైగిన్ఱాన్ (తిరువాయ్మొళి 10.6.3)” లో చెప్పినట్లు మీరు ఎందుకు త్వరపడడంలేదు? దయచేసి ఈ ఆలస్యానికి కారణం నాకు తెలియజేయండి. మీ అనంతమైన దయ గురించి నాకెటువంటి సంశయం లేదు. నేను కూడా ముక్తి నిరోధకంగా లేను. మరి మిమ్ము ఏమి ఆడ్డుకుంటున్నది?”. చివరి పంక్తి విషయానికి వస్తే, “మఱంద ఇరుక్కిరదెన్? పేసాయ్” అని పఠిస్తారు. “అమర్ – న్దిరుక్కిరదెన్ పేసాయ్” అని కూడా పఠిస్తారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/01/arththi-prabandham-33/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment