శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్ వచనభూషణత్తిన్ ఆళ్ పొరుళెల్లామ్ అఱివార్!
ఆర్ అదుశొల్ నేరిల్ అనుట్టిప్పార్! ఓరొరువర్
ఉణ్డాగిల్ అత్తనై కాణ్ ఉళ్ళమే! ఎల్లార్కుమ్
అణ్ణాదదు అన్ఱో అదు!!
………ఉపదేశరత్నమాల (55)

శ్రీ మణవాళమామునులు అనుగ్రహిస్తారు ఉపదేశరత్నమాలలో, శ్రీవైష్ణవ సంప్రదాయములో అతి ముఖ్య గ్రంథమైన పిళ్ళైలోకాచార్యుల వారి ‘శ్రీవచనభూషణ దివ్య శాస్త్రం’ గ్రంథ సారాంశాన్ని ఎఱిగి అనుష్ఠించువారు చాలా కొద్దిమంది మాత్రమే అన్నారు. శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళైగారు పిళ్ళైలోకాచార్యుల వారి ప్రధాన శిష్యులు. ఎల్లప్పుడూ చరమపర్వ నిష్ఠలో, అంటే తమ ఆచార్యులే తమకు ప్రాప్యము, ప్రాపకము అన్న నిష్ఠలో ఉంటూ తమ ఆచార్యుల శ్రీసూక్తులను నిత్యం తమ అనుష్ఠానమందు ఉంచుకొనేవారు. వీరు తమ ఆచార్యులు తమకు ఉపదేశం చేసిన శ్రీవచనభూషణ దివ్య శాస్త్రం యొక్క అర్ధవిశేషాలను బాగా గ్రహించి, ఆ గ్రంథసారాన్ని అంతా కూడా తమకు కలిగిన అపారమైన దయతో, కరుణతో అతి సులభంగా, అందరికీ అవగతం అయ్యేట్టుగా, ఆరున్నొక్క(7) పాశురములలో ఆ సారాన్ని అంతా కూడా అందజేసేరు. ఆ గ్రంథమే “సప్తగాథై” అని వ్యవహరింపబడుతోంది.
పిళ్ళైలోకమ్ జీయర్ అన్న పూర్వాచార్యులు వారి యొక్క దయాగుణంతో ఈ గ్రంథానికి ఒక అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. పాశురముల అర్ధములన్నీ కూడా అనేక విధములైన ప్రమాణాలను జత చేసి మరీ మనకు అందజేసేరు. అవన్నీ కూడా తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము.
- తనియన్
- అవతారిక (పరిచయం) – 1 భాగము
- అవతారిక (పరిచయం) – 2 భాగము
- పాశురము 1
- భాగము – 1
- భాగము – 2
- భాగము – 3
- భాగము – 4
- భాగము – 5
- పాశురము 2
- పాశురము 3
- పాశురము 4
- పాశురము 5
- పాశురము 6
- పాశురము 7
అడియేన జ్యోతిర్మయి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2022/12/saptha-kadhai/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
