సప్తగాథై – పాశురము 1 – భాగము 5

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

సప్తగాథై

<< మునుపు భాగము

పూర్వము పలికిన ఈ సంబంధ జ్ఞానానికి ప్రతిసంబంధి అయిన ఈశ్వరుని పట్ల పరత్వ ప్రతిపత్తిని (అనగా ఈశ్వరుడే పరుడనే జ్ఞానానికి చేతనుని పట్ల భగవదనన్న్యార్హ ప్రతిపత్తిని పైన చెప్పబోయే “దివ” మనబడే ఉజ్జీవనమైన కైంకర్యములో ప్రాప్యత్వ ప్రతిపత్తిని, తగిన దారి ఉపాయము అయిన భగవానుని శ్రీచరణాల పట్ల ప్రాపకత్వ ప్రపత్తిని కలిగే విరోధాలు ఇవి అనే విషయాన్ని వ్యక్తము చేస్తున్నారు.

ఏమిటి ఆ విరోధాలు అంటే చెబుతున్నారు.

  1. ఆ పర వస్తువులలో పరత్వ బుద్ధి
  2. రక్షకుడు కానివాని పట్ల ఈశ్వరత్వ బుద్ది
  3. ఉపాసించదగని వాని పట ఉపాస్యత్వ బుద్ది
  4. ఆత్మ కాని దాని పట్ల ఆత్మ బుద్ది
  5. అస్వతంత్రుడైన తన పట్ల స్వతంత్రుడనే బుద్ధి
  6. ఉపాయాలు కాని వాని పట్ల ఉపాయత్వ బుద్ది
  7. భోగ్యం కాని వాని పట్ల భోగ్యత్వ బుద్ది
  8. భగవద్ కైంకర్యములో స్వ భోక్తృత్వ బుద్ది
  9. బంధువులు కాని వారి పట్ల బంధు బుద్ది
  10. వీటి అన్నింటికి మూలకారణాలు అయిన అహంకార మమకారాలు.

ఈ విరోధులన్నీ కూడా “మకార” మందు చెప్పబడ్డాయి.

“పురతః పృష్ఠత శ్చైవ స్థానతశ్చ విశేషతః నమసా వీక్ష్యతే రాజన్” ఓ రాజా! తిరుమంత్రములో నమః పదము చేత దీని ముందు ఉండే ప్రణవం చివర ఉండే నారాయణ పదము విశేషించి తన స్థానములోని నమః శబ్దము చూపబడుతున్నాయి.

“ఈక్షితేన పురతః పశ్చాత్ అపి స్థానతః” (తిరుమంత్రములోని నమః శబ్దము, దాని ముందు గల ప్రణవము చేత, తరువాత ఉండే నారాయణ పదము చేత, తన స్థానములో ఉండే నమః అనే తన చేత చూడబడినదై) అని చెప్పబడిన రీతిలో కాకాక్షి న్యాయం ప్రథమ చరమ (ప్రణవము, నారాయణ అనే పదం అనే మొదట చివర) పదాలతో అన్వయాన్ని పొందినదై, తన స్థానములో తానే అయిన నమస్సుతో అన్వయాన్ని కలిగినదై ఉండే సఖండన నమస్సులోని షష్ఠీ విభక్తి అంతమై మకారము తెలుపుతుంది.

ఇహపై విరోధాలను తెలుపుతున్నారు.

 “నారాయణం పరిత్యజ్య హృదిస్థం పతిమీశ్వరం యోఅన్యమర్చయతే దేవం పరబుధ్ధ్యా స పాపభాక్” (ఎవరైతే సర్వేశ్వరుడైన నారాయణుని విడిచిపెట్టి ఇంకొక దైవాన్ని పరత్వబుద్ధితో కొలుస్తున్నాడో అతను పాపాలను పొందుతున్నాడు)

“స్వాతంత్య్ర మన్య శేషత్వమాత్మాపహరణం విదుః ఈశాదనన్యశేషత్వం విరుద్ధం త్యాజ్యమేవతత్” (తనకు తాను స్వతంత్రుడనే భావన ఇతరులకు శేషమనే భావన ఆత్మను దొంగలించిబడేవిగా పరిగణింపబడతాయి).

ప్రాజాపత్య స్మృతి “వాసుదేవం పరిత్యజ్య యో అన్యం దేవముపాసతే, తృషితో జాహ్నవీ తీరే కూపం భవతి దుర్మతిః” (వాసుదేవుని విడిచి ఎవరైతే ఇతరదేవతలను ఉపాసిస్తారో వారు దాహము కలవాడై గంగా తీరములో బావిని త్రవ్వుకున్న మూర్ఖుడు కాగలడు)

లక్ష్మీ తంత్రము “సకృదేవహి శాస్త్రార్ధః కృతోయం ధారయే నరం ఉపాయాపాయ సంయోగే నిష్ఠయా హీయతే నయా”.

ఈ చేతనుడు ఒకసారి శరణు అన్నచో రక్షించబడును. దీనిని వదిలి ఇతర ప్రమాదకరమైన ఉపాయాలను ఆకస్మికముగా పట్టినా ఒక పశ్చాత్తాపము చెందవలెను. ఆ పశ్చాత్తాపము కూడా శ్రీమన్నారాయణుడే ఉపాయమని ఉండేదై ఉండవలెను.

“విషయాణాo తు సంయోగాత్ యో భిభర్తి గుణం నరః, నృత్యతః ఫణినశ్ఛాయాం విశ్ర మాయాశ్రయేత సః” (లౌకిక విషయాలతో కూడిక వలన ఏ నరుడు సుఖాన్ని పొందుతున్నాడో, అతడు నాట్యం చేసే సర్పము నీడను విశ్రమం కోసము ఆశ్రయించవచ్చు, అంటే సర్పము నీడను ఆశ్రయించడంమేలు అని అర్ధం.

జితంతే స్తోత్రం [17] “అహంకారార్థ కామేషు ప్రీతిరద్యైవ నశ్యతు” (అహంకారం అర్థకామం అనే వాటిలో అభిరుచి ఇప్పుడే నాకు నశించాలి.

ఈ ప్రమాణాలు అన్నింటి ద్వారా, విషయాన్నీ దృష్టాంత పూర్వకముగాను, ఉపదేశపూర్వకముగాను విశదము అయ్యేటట్టు వ్యక్తము చేసి చూపుతున్నారు. తరువాత “సాధనం నామసా తథా” (నమః శబ్దము చేత సాధనము తెలుపబడుతున్నది) అంటే ఉపాయము తెలుపబడుతున్నది. “తస్మాత్ చతుర్థ్యా మంత్రస్య ప్రథమం దాస్య ముచ్యతే” అందువలన మంత్ర మందు నారాయణ పదము పైగల చతుర్థీ విభక్తి చేత ప్రధానమైన దాస్యం తెలుపబడుచున్నది. అని చెప్పబడే రీతిలో ఉపాయాన్ని తెలిపే నమస్సు యొక్క సర్వదేశ సర్వకాల సర్వావస్థోచితమైన కైంకర్యానికి ప్రకాశకమై ఉండే వ్యక్త చతుర్థి యొక్క అర్ధాన్ని దృష్టిలో పెట్టుకొని పలుకుతున్నారు శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారు.

 ఉమ్బర్ దివ మెన్నుమ్ వాళ్ ఉక్కు చ్చేర్ న్ద నెఱి కొట్టుమవన్: దేవానాం పూరయోధ్యా (నిత్యముక్తులకు నగరమైన అయోధ్యా) అని, తిరువాయ్ మొళి [3.9.9] లో చెప్పినట్టుగా, నాడు (నిత్యసూరుల దేశం) అని పలికే విధంగా, ఆ విధంగా, ఆ వైపు నిత్య విభూతిలో ఉండేవారికి అందరికంటే గొప్పవారైన నిత్యసూరులకు, ఇష్టవినియోగార్హమైన తిరువాయ్ మొళి [9.7.5] లోచెప్పినట్టుగా “తెళి విశుమ్బు తిరునాడు” అన్నట్టు (జ్ఞాన దాయకమైన పరమపదం అని) మహాభారతం “అత్యర్కానల దీప్తo తత్ స్థానం విష్ణో: మహాత్మనః స్వయైన ప్రభయారాజన్ దుష్ప్రేక్షమ్ దేవ దానవై:” మహానుభావుడైన విష్ణువు యొక్క ఆ స్థానం సూర్యుని యొక్క, అగ్ని యొక్క, కాంతిని మించిన కాంతి గలది. అది దేవతలవలన కానీ చూడ శక్యం కానిది అని చెప్పే రీతిలో సర్వేశ్వరుడు భోగ్య భోగోపకరణ భోగస్థాన రూపాలలో ఉండే త్రిపాద విభూతిలో [4.4.22] “అనావృత్తి శబ్దాత్” (ముక్తుడు లోకానికి తిరిగి కర్మ మూలకంగా రాకపోవడం వేదములో శబ్దతః చెప్పబడినది అని. తిరువాయ్ మొళి [4.10.11] “మీట్చి యిన్ఱు వైకున్ద మానకర్” (పునరావృత్తి లేని వైకుంఠ మహా నగరం) అని చెప్పే రీతిలో పునరావృత్తి లేకుండా నిత్యకైంకర్యములో ఆసక్తిని కలవారై ఉండడమనే ఉజ్జీవనాన్ని సాక్షాత్తు అనురూపమైన ఉపాయాన్ని వ్యక్తం చేసేవారు అని భావము.

 ఉమ్బర్ దివమ్: ఏ విధముగా అయితే దేశికునివలె (భగవానుడు కూడా ఒక ఆచార్యుడు కదా) తమ భక్తులు గుర్తించి ఉంటారో అదే విధముగా భగవద్ భక్తులను పురస్కరించుకొని నిరూపించేటట్లుగా పరమపదము ఉంటుంది సుమా అంటున్నారు. “దివమ్” అని అనడం “పొన్ఉలగు” (బంగారులోకం) అని పలికే రీతిలో దేశం ఇది అని.తైత్తిరీయ భృగువల్లి [10.5] “ఇమాన్ లోకాన్ కామాన్ కామరూప్యను సంచరన్” (ఈ లోకములో ముక్తుడు యధేష్టమైన రూపాన్ని కలవాడై, యధేష్టముగా సంచరించేవాడై అనే రీతిలో ఉండడం, ఈ స్వైర సంచారాలే కదా విరోధి అని చెబుతున్నారు.

 వాళ్ ఉక్కు: నిత్యకైంకర్యం, ఉజ్జీవనం (వాళ్ చ్చి) అనే పదాలు పర్యాయాలు కాబోలు నాచ్చియార్ తిరుమొళి [8.9] లో అనుగ్రహించినట్లుగా “వేఙ్గడత్తు ప్పదియాగ వాళ్ వీర్ గాళ్” (తిరుమలను నివాసముగా కలిగి ఉజ్జీవించేవారలారా) అని తిరువేంగడమలై ఉజ్జీవనముగా చెప్పబడినది కదా.

 శేర్ న్ద నెఱి: శేర్ న్ద నెఱి అని అనడములో అనిగ్రహిస్తున్నారు “భగవానుడే చేరడానికి ఉపాయము, మరియు ఆ  చేరడము కూడా భగవానుడి గమ్యము అని అంటూ ప్రాప్య ప్రాపకాలు రెండూ భగవానుడే అని ప్రాప్య ప్రాపకాలు రెండింటినీ సదృశ్యముగా పలుకుతున్నారు. ఈ రెండింటి ఐక్యాన్ని బట్టి శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారు శ్రీవచనభూషణములోని ఉపాయం ప్రకారణములో “ఇతు తన్నై పార్తాల్” ఇత్యాదులలో చెప్పబడే ఉపాయాన్ని శేర్ న్ద అనే విశేషణం ద్వారా ఇక్కడ సూచించారు. ‘శేర్ న్ద నెఱి’ అని పలికినందున తగని ఉపాయము కూడా ఒకటి ఉన్నదని సూచించబడినది. అది ఏమిటంటే “భక్త్యా పరమయా వాఅపి” (గొప్ప భక్తి ద్వారా కూడా) అనే రీతిలో “మోక్ష సాధనంగా వేదాంతాలలో విహితము కాలేదు” ఇత్యాదిగా చెప్పబడిన రీతిలో వివేకాది సాధన సప్తకము ద్వారా సాధ్యమై ద్రువానుస్మృతి రూపమై పూర్వము పలికిన ప్రాప్యానికి అత్యంతము తగినదై ఆలస్యముగా ఫలాన్ని ఇచ్చేడైన భక్తి అనే ఉపాయము.

కాట్టుమ్ అవన్ అన్ఱో ఆశారియన్: ఈ విధముగా “అమ్ఫొన్ అరఙ్గర్ క్కు” అని అంటూ సమస్త కళ్యాణ గుణాకరత్వం, అఖిలహేయ ప్రత్యనీకత్వం అనే ఉభయలింగాలతో కూడుకున్న పరస్వరూపాన్ని, “అవిక్కు” అని అంటూ, ఆ భగవానునకు అనన్యార్హమైన జీవ స్వరూపాన్ని “తడై”  అని అంటూ  విరోధిస్వరూపాన్ని “దివ మెన్నుమ్ వాళ్ ఉక్కు” అని అంటూ విరోధి తొలగగానే లభించే పురుషార్థ స్వరూపాన్ని’శేర్ న్ద నెఱి’ అని అంటూ ఈ పురుషార్ధానికి తగిన సాధనమైన ఉపాయ స్వరూపాన్ని, తిరుమంత్రోపదేశ రూపములో సుఖంగా గ్రహించేటట్లు వ్యక్తం చేసి చూపేవాడే కదా సదాచార్యుడవుతున్నాడు అని ఈ పాశురం ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధముగా ఉపదేశం చేసేవానికే కదా, “ఆచినోతి హి శాస్త్రార్ధాన్ ఆచారే స్థాపయద్యపి స్వయ మాచరతే యస్తు స ఆచార్య ఇతీరితః” (ఎవరు శాస్త్రార్ధాలను సమీకరిస్తున్నాడో, అతడే ఆచార్యుడని చెప్పబడుతున్నాడు అని చెప్పే ఆచార్య లక్షణమున్నది.

శ్రీవచనభూషణం [316] సూ చెప్పినట్టు “నేరే ఆచార్యనెన్బదు సంసార నివర్తకనాక పెరియమంత్రత్తై ఉపదేశిత్తవనై” సాక్షాత్తు ఆచార్యుడుగా చెప్పేవాడు ఎవరు అంటే, సంసారాన్ని తీర్చేదై అష్టాక్షరి ని ఉపదేశించినవాడు అనే దివ్య సూక్తిని దృష్టిలో పెట్టుకొని “కాట్టు మవన్అన్ఱో ఆశారియన్” అనే వాక్యాన్ని స్ఫురించేటట్టుగా పలికేరు శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారు ఈ పాశురములో.

అడియేన జ్యోతిర్మయి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2023/01/saptha-kadhai-pasuram-1-part-5/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org