సప్తగాథై – పాశురము 1 – భాగము 4

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

సప్తగాథై

<< మునుపు భాగము

ఈ విధముగా నవవిధ సంబంధాలను తిరువాయ్ మొళి [2.3.2] లో అనుగ్రహించినట్లుగా “అఱియాదన అఱివిత్త” (తెలియనివానికి తెలిపిన) అనే రీతిలో ఒక ఆచార్యుడు ఈ చేతనుని తెలుపగా, ఈ జీవుడు స్పష్టముగా తెలుసుకున్న తరువాత రకరకముల రీతిలో నిజత్వము తెలుస్తుంది ఏ విధముగా అనగాఅంటే అనుగ్రహిస్తున్నారు.

  • తిరువాయ్మొళి [8.9.3] లో అనుగ్రహించినట్టుగా “కణ్ణపురమొన్దుడైయానుక్కడియేన్ ఒరువర్ క్కు అడియేనో” (తిరుక్కణ్ణపురమునందు వేంచేసి ఉన్న స్వామికే నేను దాసుడను. ఇంకొకరికి దాసుడనా అన్న రీతిలో వేంచేసి ఉండడమే స్వరూపానికి చెందిన జ్ఞానము అని).
  • తిరువాయ్ మొళి [5.8.3] లో అనుగ్రహించినట్లుగా “ఎన్ నాన్ శెయ్ కేన్ యారే కళై కణ్” (నేను ఏమి చెయ్యగలను నాకు ఎవరు రక్షకులు) అని తనను తాను రక్షించుకోలేని, అశక్తి అని.
  • తిరువాయ్ మొళి [5.8.3] లో అనుగ్రహించినట్లుగా “ఉన్నాన్ అల్లాల్ యావరాలు మెన్ఱుమ్ కుఱై వేణ్డేన్” నీవు  తప్ప వేరొకరివల్ల అభిమతాన్ని పొందగోరను అని ఉండడమే (ప్రాపకములో నమ్మిక అని).
  • తిరువాయ్ మొళి [9.3.7] లో అనుగ్రహించినట్లుగా “మాక వైకున్దమ్ కాణ్బదర్కు ఎన్ మనమేక మెణ్ణుమ్” (గొప్పదైన పరమపదాన్ని సేవించడము కోసం నా మనస్సు సదా తహతహలాడుచున్నది) అని తలచి ఉండడమే ప్రాప్యత్వము అని.
  • తిరువాయ్ మొళి [11.8.3] లో అనుగ్రహించినట్టుగా “పామ్బోడొరు కూరైయిలే పయిన్ఱాప్పోల్” (ఈ సంసారములో ఉండడం పాముతో కలసి ఒకచోట ఉన్నట్టుగా) అని అనగా విరోధి భీతి.
  • తిరువాయ్ మొళి [8.10.3] లో అనుగ్రహించినట్లుగా “అవన్ అడియార్ శిరుమామని శరా ఎన్నైయాణ్డార్ ఇఙ్గే తిరియవే” (ఆ భగవానుని దాసులు ఆకారములో చిన్నవారై మహిమతో గొప్పవారై నన్ను ఉద్ధరించేవారై ఈ లోకములో సంచరించగా) అని ఉండడములో భాగవతోత్తముల పట్ల గౌరవము అని.
  • తిరువాయ్ మొళి [10.6.10] “పెరియార్ క్కాట్పట్టక్కాల్ పేఱాద పయన్ పెరుమాఱు”  (భగవద్ భక్తులకు దాసులైతే దాని వల్ల పొందలేని ఫలాన్ని కూడా పొందగలరు) అని ఉండడమే ఉపకార విషయములో కృతజ్ఞత అని.
  • తిరువాయ్ మొళి [10.10.3] “ఆవిక్కోర్ పత్తుక్కొమ్బు నిన్ఱల్లాల్ అఱికిన్ఱిలేన్” ఆత్మకు అద్వితీయమైన ఆలంబనగా, నిన్ను తప్ప వేరొక్కరికి తెలియను) అని తలచి ఉండడమే ఉత్తారక విషయములోని మహా విశ్వాసము (ప్రతిపత్తి) అని.
  • భగవానుని నిరుపాధిక శేషిత్వాన్ని, తమ సహజమైన శేషత్వాన్ని స్పష్టముగా తెలియగలగడమే సంబంధ జ్ఞానము.
  • భగవానుని నిరుపాధిక శరీరిత్వాన్ని, తమ నిరుపాధిక శరీరత్వాన్ని స్పష్టముగా తెలియడమే సంబంధ యాథాత్మ్య జ్ఞానము.
  • భగవానుని నిరుపాధిక ధర్మిత్వాన్ని, తన నిరుపాధిక ధర్మత్వాన్ని స్పష్టముగా గ్రహించడమే సంబంధ స్వరూప జ్ఞానము.
  • ధర్మికి ధర్మానికి మధ్య ఉండే విశిష్ట ఐక్యం వల్ల అతడే తప్ప తాను లేను అనే రీతిలో స్థితిని స్పష్టముగా తెలియగలగడమే సంబంధ స్వరూప యాథాత్మ్య జ్ఞానము.
  • భగవంతుడితో ఈ జీవునికి ఉన్న సంబంధము ఎరిగి, భగవద్దాస్యాన్ని చేస్తూ, సదాచారాన్ని విడువక శబ్దాది లౌకిక విషయాల పట్ల భీతిని, కైంకర్యము యొక్క అలాభములో అనగా కైంకర్యము లభించనప్పుడు ఆర్తిని పొందడమనే శేషత్వములో కర్తృత్వాది నివృత్తి.
  • నిషేధింపబడిన వానిని విడిచి, విధింపబడిన వానిని ఆశ్రయించగానే “నేను జ్ఞాతనైనందువల్ల కదా నన్ను అతడు అంగీకరించాడు అని తన జ్ఞాతృత్వాన్ని చూచి గర్వపడకుండా ఉండడమనే జ్ఞాతృత్వములోని కర్తృత్వ నివృత్తి.
  • భగవంతునికి తాను కైంకర్యము చేసేటప్పుడు, అది తన ఆనందానికి అనుకూలమైనది అని భావించకుండా అవయవ భూతమైన ఈ ఆత్మ వస్తువు అవయవి అయిన భగవంతునికి ఉపయోగపడుతున్నది అని తలచి ఉండడమే భోక్తృత్వములోని కర్తృత్వ నివృత్తి.

ఇలా మొదలైన ఆకార విశేషాలు కలుగుతాయి.

 అన్తరఙ్గ సంబంధం కాట్టి: ఈ  సంబంధం “ప్రాప్తం లక్ష్మీపతేర్దాస్యం శాశ్వతం పరమాత్మనః దాస భూతాః స్వత స్సర్వే హ్యాత్మనః పరమాత్మనః” (పరమాత్మ అయిన శ్రియః పతికి జీవుల దాస్యము శాశ్వతముగా ప్రాప్యమైనది) ఆత్మలన్నీ పరమాత్మకు సహజముగానే దాసభూతము కదా అని. ఆర్తిప్రబంధము [45] “నారాయణన్ తిరుమాల్ నారమ్ నామ్ ఉఱైవు ఆఱాయిల్ నెజ్ఙే!యనాదియన్ఱో” (శ్రియః పతి నారాయణుడు, మనం నారం. ఈ ఇద్దరి మధ్య సంబంధాన్ని గమనించి చూస్తే ఓ మనసా! అది అనాది కదా) అని పలికే రీతిలో సోపాధికమైనది కాకుండా అనాది సహజం అయినందువల్ల “కాట్టి” అని అంటున్నారు పూర్వము గమనించిన దానినే కదా లోకములో తరువాత చూపించడానికి సాధ్యము అవుతుంది.

ఇంతకుముందు ఈ సంబంధాన్ని ఎవ్వరు తెలుపనందు వల్లన ఆత్మ దేహాత్మాభిమాని  అయి చాలా కాలము ఉన్నది. ఏవిధముగా అనగా తిరువాయ్ మొళి [2.9.9] లో చెప్పినట్టు “యానే ఎన్నై అఱయ కిలాదే యానే ఎన్ఱనదే ఎన్దిరున్దేన్” (నేను నన్ను తెలియక నేను నాది అని భావించాను) అనే రీతిలో చిరకాలము తనను యథాతథముగా తెలియలేకుండా ఉన్నాడు ఈ జీవుడు. ఇంకా ప్రమాణాలు చెబుతున్నారు “మాఱి మాఱి ప్పల పిఱప్పుమ్ పిఱన్దు” (మారి మారి పలుజన్మలలో జన్మించిన ) అని “మత్తోర్ దైవమ్ పాడియాడి ప్పణిన్దు” (దేవతాంతరాలను పాడి ఆడి సేవించి అని), “వళుత్తికైన్దు” (సన్మార్గమును గూర్చి భ్రమను పొంది) తైత్తిరోపనిషద్ “అసన్నేవ” అని తిరువాయ్ మొళి [5.7.3] లో అనుగ్రహించినట్లుగా “పొరుళ్ అల్లాద” వస్తువు కానీ అని పలికే రీతిలో రూపు మాపి నిత్య సంసారియై “మకారేణ స్వతన్త్రః స్యాత్” (జ్ఞాన వాచి అయిన మకారముచే నిర్దేశింపబడే జీవుడు స్వతంత్రుడవుతున్నాడు) అనే రీతిలో పద ద్వయాత్మకమైన నమస్సులో అంటే నమః పదములో జీవుని స్వాతంత్య్రాన్ని ప్రతిపాదించే మకారము యొక్క అర్ధాన్ని పురస్కరించుకొని ఇక పలుకుతున్నారు.

అడియేన జ్యోతిర్మయి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2023/01/saptha-kadhai-pasuram-1-part-4/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment