సప్తగాథై – పాశురము 1 – భాగము 3

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

సప్తగాథై

<< మునుపు భాగము

తరువాత “అవధారణ మన్యేతు మధ్యమాస్తంవదంతి హి” (ప్రణవం మధ్యలో ఉండే ఉకారాన్ని అవధారణార్ధముగా కొందరు అంటారు. మరియు “అస్వాతంత్య్రం తు జీవానామాధిక్యం పరమాత్మనః నమసా ప్రోచ్యతే తస్మిన్ అహంతా మమతోజ్ఞితా” ‘నమః’ శబ్దం జీవుని పారతంత్య్రం, పరమాత్మ యొక్క స్వాతంత్య్రం చెప్పబడినది. అలాంటి నమః పదము అహంకార మమకారాలను తొలగిస్తుంది.

శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారు తమ అపారమైన దయతో ఉకారము చెప్పిన అర్ధాన్ని అంటే జీవుడు వేరొకరికి శేషం కాడు భగవానునికి మాత్రమే శేషము అని అనుగ్రహిస్తున్నారు. అంటే ఉకారము అన్య శేషత్వ నివృత్తి భగవత్ శేషత్వాలను ప్రతిపాదిస్తే నమః పదం స్వానర్హత్వం (తనకు తాను శేషం కాకుండుట) అచిద్వత్పారతంత్రం (అచిత్తువలె పరతంత్రాన్ని కలవాడు అని చెప్తుంది). దీనినే మనస్సులో ఉంచుకొని అనుగ్రహిస్తున్నారు శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళై గారు.

అన్తరఙ్గ శమ్బన్దమ్ కాట్టి: జీవేశ్వరుల మధ్య ఉండే  అనన్యార్హ శేషత్వమనే అంతరంగ సంబంధాన్ని స్వశేష నివృత్తిని అచిద్వత్ పారతంత్య్రం పర్యంతంగా, దానికి పరాకాష్ఠ అయిన భాగవత శేషత్వ పర్యంతముగా వివరణతో కూడిన ఉకారం యొక్క అర్ధం వెల్లడి చేసింది కదా “అష్టశ్లోకీ” లో చెప్పబడినట్టుగా “ఉకారోనన్యార్హం నియమయతి సంబంధ మనయోః” ఉకారం జీవేశ్వరుల మధ్య ఉండే అనన్యార్హ శేషత్వరూప సంబంధాన్ని నియమిస్తున్నది. సంబంధం మాత్రం ఇతర శేషత్వోపమర్ది కానందువల్ల (ఇతర శేషత్వాన్ని అడ్డుకోనందున) స్వవిరోధి సహాయమైనందున (తన విరోధిని సహించలేనందున) అన్తరఙ్గమని అంటూ, ఇక్కడ సంబంధాన్ని అంతరంగమని విశేషిస్తున్నారు (భగవానునికి మాత్రమే ఆత్మ శేషమై) ఉండే సంబంధాన్ని అంతరంగమని తెలుపుతున్నారు.

ఇక్కడ ఉకార అవధారణము స్థాన ప్రమాణమును తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఈ అవధారణ అయోగ్యవ్యవఛ్చేదమే తప్ప అన్యయోగ వ్యవచ్ఛేధము కాదు. అది ఏ విధముగా కాగలదు అని ప్రశించుకుంటే అకారవాచ్యుడైన వానికి మాత్రమే చెందినవాడు మకార వాచ్యుడైన జీవుడు అన్నప్పుడు అకార వాచ్యునికి అన్న విశేష్యము ద్వితీయావిభక్తిలో ఉన్నది. విశేషణం జీవుడు అని ప్రథమా విభక్తిలో ఉన్నది. విశేషణ విశేష్యాలు సమాన విభక్తిలో నిర్దేశింపబడిన చోటనే ఆ నియమం తప్ప, సమాన విభక్తితో నిర్దేశింపబడని చోట ఆ నియమము లేనందున ఈ ఏవకారం అన్యయోగ వ్యవచ్ఛేధమని అనడంలో తప్పులేదు “దేవదత్తం ప్రత్యయేవ దండనమ్” ఇత్యాది ప్రయోగాలలో ఈ అర్ధం (అన్యయోగాన్ని ఇతరుల సంబంధాన్ని వేరు చేసేది అని అర్ధం) సుస్పష్టముగా తెలుస్తోంది కదా.

తిరుమంత్రమునందు 9 రకములైన సంబంధములు వివరింపబడ్డాయి.

తిరుమంత్రమునందు ప్రత్యయ ధాతు పదాల ద్వారా ప్రతిపాదింపబడినదిగా అంతరంగ సంబంధం అంటే “పితా చ రక్షక శ్శేషీ భర్తా జ్ఞేయో రమాపతి స్వామ్య ధారో మమాత్మాచ భోక్తా చాద్య మసూచితః” (తిరుమంత్రమందు చెప్పినట్టుగా జీవునికి భగవానుడు తండ్రి, రక్షకుడు, శేషీ, భర్తా, జ్ఞేయుడు, స్వామీ,ఆధారం ఆత్మ, భోక్తా అని తెలుపుతున్నారు).

ఇవన్నీ ఏవిధముగా అష్టాక్షరీ మంత్రమందు వివరించేరో తెలుపుతున్నారు

  1. పితాపుత్ర సంబంధం: తిరుమంత్రములో మొదటి పదమైన ప్రణవమునందు మొదటి పదము అయిన అకారములోగల ప్రకృత్యాంశ ద్వారా సుబాలోపనిషత్ చెప్పినట్టుగా “పితా నారాయణః” (తండ్రి నారాయణుడు). శ్రీవిష్ణుపురాణములో అనుగ్రహించినట్లుగా “దేవదేవోహరిఃపితా” (దేవదేవుడైన హరి తండ్రి) మరియు పెరియ తిరుమొళి [1.1.6] లో “ఎమ్ పిరాన్ ఎన్దై” (నాకు ఉపకారకుడు, నా తండ్రి) అని పితా పుత్ర సంబంధాన్ని అకారములో ఉన్న ప్రకృత్యాంశ ద్వారా తెలుపుతున్నారు.
  2.  రక్ష్య రక్షక సంబంధం: తిరుమంత్రములో మొదటి పదమైన ప్రణవమునందు మొదటి పదము అయిన అకారములోగల ధాతువాంశలో అంటే “అ = అవరక్షణే” అనే ధాతువు యొక్క అంశ ద్వారా తైత్తిరియోపనిషద్ ఆనందవల్లిలో చెప్పినట్టుగా “కో హే వాన్యాత్ కః ప్రాణ్యాత్” (ఎవరు రక్షించగలరో ఎవరు బ్రతికించగలరో) అని శ్రీవిష్ణుపురాణములో [1.21.22] చెప్పినట్టుగా “నహి పాలన సామర్ధ్యమృతే సర్వేశ్వరం హరిమ్” (సర్వేశ్వరుడైన హరికి తప్ప ఇంకొకరికి పాలించే సామర్ధ్యము లేదు అని), తిరువాయ్ మొళి [2.2.8] “కురుత్తిల్ తేవుమెల్లా ప్పొరుళుమ్ వరుత్తిత్త మాయ పిరానై” (తన సంకల్పముతోనే దేవతలను, అన్ని వస్తువులను వర్తింపచేసిన ఆశ్యర్యగుణాలను కల ఉపకారకుడు అని) పలికే రీతిలో రక్ష్య రక్షక సంబంధాన్ని తెలుపుచున్నారు.
  3.  శేష శేషి సంబంధము: తిరుమంత్రము అకారములో వచ్చి లోపించిన లుప్త చతుర్థి ద్వారా శ్వేతాశ్వతర ఉపనిషద్ చెప్పినట్టుగా “పతిం పతీనామ్” అని (ప్రభువులకు ప్రభువు అని) శ్రీవిష్ణు సహస్రనామమ్ “జగత్పతిం దేవదేవమ్” (జగత్తుకు పతి దేవతలకు దేవుడు) అని తిరువాయ్ మొళి [1.1.1] “అమరర్ కళ్ అధిపతి” (నిత్యసూరులకు అధిపతి) అని పలికే రీతిలో శేష శేషి భావ సంబంధాన్ని తెలుపుతున్నారు.
  4.  భర్తృ భార్య సంబంధము: తిరుమంత్రమందు మొదటి పదము ప్రణవములో కల రెండవ అక్షరము ఉకారము. అది ఉకారము అవధారణ కావడము వలన “భాగవత ఏవాహమ్” (నేను భగవానునికే శేషభూతుడను) అని శ్రీమద్ రామాయణం సుందరకాండలో అనుగ్రహించినట్టుగా “లోకభర్తారమ్” (లోకాల భర్త అయిన శ్రీరాముని), పెరియాళ్వార్ తిరుమొళి [5.4.2] లో అనుగ్రహించినట్టుగా “పఱవై ఏఱు పరమ్ పురుడా నీ ఎన్నైకై కొణ్డ పిన్” (గరుడుని అధిరోహించిన పరమపురుషా నీవు నన్ను పరిగ్రహించిన తరువాత) అని అంటూ భర్తృ భార్య సంబంధాన్ని తెలుపుతున్నారు.
  5.  జ్ఞాతృజ్ఞేయ సంబంధం: తిరుమంత్రమందు మొదటి పదము ప్రణవములో కల మూడవ అక్షరము మకారము. ఆ మకారములో “మన = అవబోధనే” అనే ధాతువు ద్వారా బృహదారణ్య ఉపనిషద్ [6.5.6] “నిధి ధ్యాసితవ్యం” (మదిలో స్థిరముగా నిలుపుకోవడం) అని, మహాభారతం [178.11] “ధ్యేయో నారాయణః సదా” (సదా నారాయణుడే ధ్యానింప తగినవాడు) అని, తిరువాయ్ మొళి [8.8.3] “ఉణర్విన్ ఉళ్ళే ఇఱుత్తినేన్” (నా జ్ఞానములో విషయముగా స్థాపించాను) అన్న రీతులను అనుగ్రహిస్తూ జ్ఞాతృజ్ఞేయ సంబంధాన్ని తెలుపుచున్నారు.
  6.  స్వ – స్వామి భావ సంబంధం: తిరుమంత్రమందు రెండవ పదమైన “నమః” ద్వారా కఠోపనిషద్ [2.1.12] లో చెప్పబడినట్లు “ఈశానో భూతభవ్యస్య” (భూతకాలానికి భవిష్యత్తుకు నిర్వాహకుడు) అని విష్ణుత్తత్వములో చెప్పబడినట్లుగా “సత్త్వమాత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితమ్” సొత్తుగా ఉండే స్థితి ఆత్మలో ఉన్నది. స్వామిత్వం అంటే సొత్తుదారుడై ఉండే స్థితి పరమాత్మలో ఉన్నది. తిరువాయ్మొళి [6.10.10] “ఉలగమ్ మూన్ఱుడైయాయ్” (ముల్లోకాలను సొత్తుగా కలవాడు) అని ఇత్యాదుల ప్రమాణము ద్వారా స్వ స్వామి సంబంధాన్ని తెలియజేస్తున్నారు.
  7.  శరీర శరీరి భావ సంబంధం: తిరుమంత్రమునందు మూడవ పదమైన “నారాయణాయ” లో ఉన్న నారమనే అంశ ద్వారా ఉపనిషత్తు [7] “యస్య ఆత్మా శరీరమ్ యస్య పృథివీ శరీరమ్” (ఎవరికి ఆత్మ-చిత్తు శరీరమో ఎవరికి పృథివి అచిత్తు శరీరమో) అని, శ్రీమద్ రామాయణం యుద్దకాండ [117.26] “జగత్సర్వం శరీరంతే” (జగత్తు అంతా నీకు శరీరము) అని తిరువాయ్ మొళి [1.2.1] “ఉమ్ముయిర్ వీడుడైయానిడై” (మీ ఆత్మను శరీరముగా కలవాని వద్ద) ఇత్యాదుల ప్రమాణాల ద్వారా శరీర శరీరి సంబంధము తెలుపుతున్నారు.
  8.  ఆధార ఆధేయ సంబంధము: తిరుమంత్రము నందు మూడవపదము “నారాయణాయ” లో ఉన్న అయన అనే అంశ ద్వారా ఛాంద్యోగ్య ఉపనిషద్ “సదాయతనా:” (సచ్ఛబ్ద వాచ్యుడైన పరబ్రహ్మను ఆధారముగా కలిగినవారు అని) శ్రీమద్ భగవద్గీత [7.7] “మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ” (దారంతో కూర్చబడిన మణుల వలె ఈ జగత్తు అంతా నా చేత కూర్చబడినది అని) తిరువాయ్ మొళి [8.7.8] “మూవులకుమ్ తన్నెఱియా వయిత్తిల్ కొణ్డు నిన్ఱు ఒళిన్దార్” (ముల్లోకాలను శ్రమ కలగకుండా తన కడుపులో పెట్టుకున్నవాడు) అని పలికే రీతిలో ఆధార ఆధేయ సంబంధాన్ని అనుగ్రహిస్తున్నారు.
  9.  భోక్తృ భోగ్య సంబంధం: తిరుమంత్రము నందు మూడవ పదమందు నారాయణాయ పాదములో ఉన్న వ్యక్త చతుర్థి (నారాయణ శబ్దము పై వచ్చిన చతుర్థి) వ్యక్త చతుర్థి ఆయ తైత్తిరీయోపనిషద్ చెప్పినట్టుగా “అహమన్న అహమన్నమ్” (నేను పరమాత్మకు అన్నం నేను పరమాత్మకు అన్నం) అని శ్రీమద్ భగవద్గీత [5.29] “భోక్తారం యజ్ఞ తపసామ్” (యజ్ఞాలకు తపస్సులకు) భోక్త అని తిరువాయ్ మొళి [10.7.3] “ఎన్నై ముత్తుమ్ ఉయిరుణ్డు” (నన్ను పూర్తిగా అనుభవించి) అని పలికే రీతిలో భోక్తృ భోగ్య రూప సంబంధాన్ని శబ్దతః ప్రతిపాదిస్తూ ఉండడం వలన “అన్తరఙ్గశమ్బన్ద” శబ్దం జీవేశ్వరులనే వీరిద్దరి మధ్య ఉండే నవవిధ సంబంధాలను ప్రతిపాదించగలిగేదిగా ఉన్నది.

అడియేన జ్యోతిర్మయి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2023/01/saptha-kadhai-pasuram-1-part-3/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment