శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< ఏళాం తిరుమొళి – కరుప్పూరం నాఱుమో
మునుపటి పాశురములో ఆమె శ్రీ పాంచజన్యముని ఎంబెరుమానుడి స్వభావము మరియు అదరామృత రుచి గురించి అడిగింది. ఆ తరువాత, మనస్సులో ఆమె అనుభవం ఎంబెరుమానుని చేరుకుంది. ఆ సమయంలో, వర్షాకాలపు నల్లని మేఘాలు అక్కడికి వచ్చి కమ్ముకున్నాయి. ఇరువురి వర్ణము మరియు ఔదార్య సారూప్యత కారణంగా, మేఘాలు ఆమెకు ఎంబెరుమానుడిలా కనిపించాయి. ఎంబెరుమానుడు స్వయంగా తన వద్దకు వచ్చినట్టు ఆమె భావించింది. కొంత స్పష్టత వచ్చిన తరువాత, ఎంబెరుమానుడు రాలేదని ఆమె గ్రహించింది. చుట్టూ తిరిగి ప్రయాణించే స్వభావము మేఘాలకు ఉన్నందున, వాటిని ఎంబెరుమానుడి వద్దకు దూతలుగా పంపాలని ఆమె నిశ్చయించుకుంది. విభవావతారాల (రామ, కృష్ణ మొదలైన) వద్దకి దూతలుగా పంపడానికి బదులుగా, ఆమె ఆ మేఘాలను తిరువేంగడంలోని అర్చా స్వరూపము వద్దకి దూతగా పంపుతుంది. రామావతారంలో, శ్రీ రాముని కుశల విషయాలను అందించడానికి సీతా పిరాట్టి వద్ద గొప్ప విశిష్టత గల మహా జ్ఞాని అయిన హనుమానుడు ఉన్నాడు. ఇక్కడ ఎంబెరుమానుడి ప్రేమలో భ్రమించి పోయిన ఆండాళ్, ఆమె తన ప్రేమను తెలియపరచడానికి దూతగా ఒక అచేతన తత్వాన్ని (ఆలోచనా శక్తి లేనిది) పంపుతోంది. ఎంబెరుమానుడిపై ఉన్న మోహం కారణంగా, అర్చా స్వరూపంలో ఉన్న భగవానుడు దర్శనము మాత్రమే ఇస్తాడని, కదిలి రాలేడని ఆమె గ్రహించలేక పోతుంది. ప్రేమ అయినా కామమైన ర్ండూ భక్తి స్వరూపాలే. మరో మాటలో చెప్పాలంటే, వారు (స్త్రీ పురుషులుగా) కలిసి ఉంటే ఉండగలరు, లేదా ఉండలేరు. ఈ గుణాలు స్త్రీలలో వారి స్వభావరూపేన ఉంటాయి. ఈ కారణంగానే ఆళ్వార్లు కరుణారస పూరితులైన ఎంబెరుమానుడి భార్య పాత్రలు వహించారు. పైగా, ఆండాళ్ విషయంలో, ఆమె భూమి పిరాట్టి అవతారము కాబట్టి, ఈ గుణాలు ఆమెలో స్వాభావికంగా ఉంటాయి.
మొదటి పాశురము: తన స్త్రీత్వాన్ని నాశనం చేయడం వల్ల ఆతడికి ఏ కీర్తి లభిస్తుందని తిరువేంగడముడయాన్ని అడగమని ఆమె మేఘాలకు చెబుతుంది.
విణ్ణీల మేలప్పు విరిత్తాఱ్పోల్ మెగంగాళ్
తెణ్ణీర్ పాయ్ వేంగడత్తు ఎన్ తిరుమాలుం పోందానే?
కణ్ణీర్గల్ ములై క్కువట్టిల్ తుళి శోరచ్చోర్వేనై
పెణ్ణీర్మై ఈడళిక్కుం ఇదు తమక్కోర్ పెరుమైయే?
నీలి ఆకాశములో పందిరిలా కనిపించే ఓ మేఘమా! స్వచ్ఛమైన సెలయేరులు ప్రవహించే తిరువేంగట గిరిపై నిత్య నివాసుడై ఉంటున్న నా స్వామి తిరుమాల్ మీతో పాటు వచ్చాడా? నా కన్నీటి చుక్కలు నా స్తనము అంచున పడేటంత క్షోభిస్తున్నాను. ఇది అతనికి ఏదైనా కీర్తిని తెచ్చిపెడుతుందా?
రెండవ పాశురము: గాలితో ఇబ్బంది పడుతున్న ఆమె కోసము ఊరడించే మాటలు ఏవైన్నా ఎంబెరుమానుడు పంపించాడా అని ఆమె మేఘాలను అడుగుతుంది.
మాముత్త నిది శొరియుం మాముగిల్గాళ్! వేంగడత్తు
చ్చామత్తిన్ నిఱం కొణ్డ తాడాళన్ వార్ త్తై ఎన్నే?
కామత్తీయుళ్ పుగుందు కదువప్పట్టు ఇడైక్కంగుల్
ఏమత్తోర్ తెన్ఱలుక్కు ఎంగు ఇలక్కాయ్ నాన్ ఇరుప్పేనే
ముత్యాలు మరియు బంగారాన్ని కురిపించే ఓ మేఘాలారా! అద్భుతమైన నీల వర్ణుడు, తిరువెంగడంలో నిత్య నివాసుడై ఉన్న భగవానుడి నుండి ఏదైనా సందేశం తెచ్చారా? నాలో ప్రవేశించి నన్ను ఆవహించిన కామ జ్వాలతో నేను సతమతమౌతున్నాను. ఈ కారణంగా అర్ధరాత్రి వేళ ఈ చల్లని గాలి నన్ను బాధిస్తుంది.
మూడవ పాశురము: ఎంబెరుమానుడి దివ్య నామాలను పఠించి తనను తాను ఊరడించుకోగలదా అని ఆమె మేఘాలను అడుగుతుంది.
ఒళి వణ్ణం వళై శిందై ఉఱక్కత్తోడు ఇవై ఎల్లాం
ఎళిమైయాల్ ఇట్టు ఎన్నై ఈడళియ ప్పోయినవాల్
కుళిర్ అరువి వేంగడత్తు ఎన్ గోవిందన్ గుణం పాడి
అళియత్త మేగంగాళ్! ఎన్ ఆవి కాత్తిరుప్పేనే
ఓ దయగల మేఘాలారా! నా రూపం యొక్క తేజము, రంగు, నా కంకణాలు, మనస్సు మరియు నిద్ర నా దుఃఖ స్థితిని చూసి నన్ను విడిచిపెట్టి వెళ్ళి పోయాయి, నన్ను బలహీనము చేశాయి. అయ్యో! చల్లని సెలయేరులు ప్రవహించే తిరువేంగడంలో నిత్యమూ నివసించే నా స్వామి గోవిందుడి దివ్య నామాలను మంగళ గుణాల చింతన చేస్తూ నన్ను నేను ఓదార్చుకోగలనా?
నాలుగవ పాశురము: సిఫార్సు వహించే పిరాట్టి (శ్రీ మహాలక్ష్మి) సమక్షంలో ఎంబెరుమానునికి తన కోరిక తెలియజేయమని ఆమె మేఘాలను ప్రార్థిస్తుంది.
మిన్నాగత్తు ఎళుగిన్ఱ మేగంగాళ్! వేంగడత్తు
త్తన్నాగత్తిరుమంగై తంగియ శీర్ మాఱ్వర్ క్కు
ఎన్నాగత్తు ఇళం కొంగై విరుంబిత్త్ తాం నాళ్ తోఱుం
పొన్నాగం పుల్గుదఱ్కు ఎన్ పురివుడైమై శెప్పుమినే
ఓహ్, మెరుపుల చారలతో ఉన్నమేఘాలారా! తిరువేంగడంలో శాశ్వతంగా నివసించే ఎంబెరుమానుడు తన అందమైన దివ్య ఛాతిపై నా యవ్వన స్థనములను హత్తుకొని ఆలింగనం చేసుకోవాలని నాకు కోరికగా ఉంది. ఆతడి దివ్య వక్ష స్థలములో పిరాట్టి దయతో నివాసం ఉండే ఎంబెరుమానుడికి ఈ విషయం చెప్పుము.
ఐదవ పాశురము: తన భక్తుల విరోధులను తొలగించే ఎంబెరుమానునికి తన స్థితిని వెల్లడించమని ఆమె మేఘాలను ప్రార్థిస్తుంది.
వాన్ కొండు కిళర్ందు ఎళుంద మాముగిల్గాళ్! వేంగడత్తు
త్తేన్ కొండ మలర్ శిదఱత్తిరణ్డేఱి ప్పొళివీర్గాళ్!
ఊన్ కొండ వళ్ళుగిరాల్ ఇరణియనై ఉడల్ ఇడందాల్
తాన్ కొండ శరివళైగళ్ తరుమాగిల్ శాఱ్ఱుమినే
తిరువేంగడంపై ఆకాశాన్ని మ్రింగి వేస్తున్నట్లు నల్లని మేఘాలు అలుముకొని తేనెతో నిండి ఉన్న పుష్పాలు చెల్లాచెదురు అయ్యేటట్టు ఆకాశం నుండి వర్షం కురిపిస్తున్న ఓ మేఘాలారా! హిరణ్య కశిపుడనే రాక్షసుడి దేహాన్ని తన పదునైన గోర్లతో చీల్చాడు ఎంబెరుమానుడు. ఒకవేళ ఆ భగవానుడు నా నుండి తీసుకున్న కంకణాలను తిరిగి ఇస్తే, నా స్థితి గురించి అతనికి దయచేసి తెలియజేయుము.
ఆరవ పాశురము: తన సుఖాన్ని పోగొట్టిన నారాయణుడికి తన స్థితిని చెప్పమని ఆమె మేఘాలను ప్రార్థిస్తుంది.
శలం కొండు కిళర్ందెళుంద తణ్ ముగిల్గాళ్! మావలియై
నిలం కొండాన్ వేంగడత్తే నిరందేఱి ప్పొళివీర్గాళ్!
ఉలంగు ఉండ విళంగని పోల్ ఉళ్ మెలియప్పుగుందు ఎన్నై
నలం కొండ నారణఱ్కు ఎన్ నడలై నోయ్ శెప్పుమినే
చల్లని నీటిని త్రాగి పెద్దవైన మేఘాలారా! మహాబలి నుండి ప్రపంచాలను భిక్షగా పొందిన ఎంబెరుమానుడు నిత్య నివాసం ఉంటున్న తిరువేంగడం కొండపైకి ఎక్కి వ్యాపించిన మేఘాలారా! ఒక పండు నుండి పురుగు రసం లాగేసినట్లు, ఎంబెరుమానుడు నాలో ప్రవేశించి నా స్త్రీత్వాన్ని దొంగిలించాడు. బాధాకరమైన నా వ్యధ గురించి ఆ ఎంబెరుమానునికి తెలుపుము.
ఏడవ పాశురము: ఆమె ఆతన్ని ఆలింగనం చేసుకుంటే తప్ప తాను ఉండలేనని ఎంపెరుమానుడికి చెప్పమని ఆమె మేఘాలను ప్రార్థిస్తుంది.
శంగమా కడల్ కడైందాన్ తణ్ ముగిల్గాళ్! వేంగడత్తు
చ్చెంగణ్మాల్ శేవడిక్కీళ్ అడి వీళ్ చ్చి విణ్ణప్పం
కొంగై మేల్ కుంగుమత్తిన్ కుళంబళియ ప్పుగుందు ఒరు నాళ్
తంగు మేల్ ఎన్నావి తంగుమెన్ఱు ఉరైయీరే
అనేక శంఖములు మరియు మహా కీర్తి ఉన్న మహా సముద్రాన్ని భగవానుడు చిలికాడు. అటువంటి ఎమ్పెరుమాన్ నిత్య నివాసుడై ఉన్న తిరువేంగడం కొండల చుట్టూ విహరించే ఓ చల్లని మేఘాలారా! ఎర్రటి నేత్రాలున్న ఆ భగవానుని దివ్య ఎర్రటి పాదాలకు ఇది నా విన్నపము: నా స్థనములపై ఉన్న కేసరి నలుగు లేపనము రాలి పడేలా ఆ భగవానుడు ఒకరోజు ఇక్కడకు వచ్చి నాతో ఏకమైతేనే నా జీవితం నిలబడుతుంది. వెళ్లి అతనికి ఈ విషయం చెప్పుము.
ఎనిమిదవ పాశురము: ఇలా మౌనంగా ఉండటం సరికాదని, ఆతనికి చెప్పమని ఆమె మేఘాన్ని ప్రార్థిస్తుంది .
కార్ కాలత్తు ఎళుగిన్ఱ కార్ ముగిల్గాళ్! వేంగడత్తు
ప్పోర్ కాలత్తు ఎళుందరుళి ప్పొరుదవనార్ పేర్ శొళ్ళి
నీర్ కాలత్తు ఎరుక్కిలం పళవిలై పోల్ వీళ్వేనై
వార్ కాలత్తు ఒరు నాళ్ తం వాశగం తందరుళారే
వానాకాలంలో తిరువేంగడ కొండపై ఉన్న ఓ మేఘాలారా! యుద్ధ సమయంలో ఎంబెరుమానుడు దయతో యుద్ధరంగంలోకి ప్రవేశించి విజయుడై వస్తాడు. ఆ భగవానుని దివ్యనామాలను నేను పఠించి వానాకాలంలో అందమైన జిల్లెడు చెట్టు ఆకుల వలె క్రింద పడతాను. నా జీవితమింతేనా, ఒక్క రోజు కూడా దయతో ఊరడిల్లే ఒక్క మాట కూడా మాట్లాడడా?
తొమ్మిదవ పాశురము: ఆతడు ఆమెను ఇంకా ఇలా హింసిస్తూనే ఉంటే, అతని ప్రతిష్ట దెబ్బతింటుందని, ఇది అతనికి చెప్పమని ఆమె మేఘాలను ప్రార్థిస్తుంది.
మదయానై పోల్ ఎళుంద మాముగిల్గాళ్! వేంగడత్తై
ప్పదియాగ వాళ్వీర్గాళ్! పాంబణైయాన్ వార్ త్తై ఎన్నే!
గది ఎన్ఱుం తాన్ ఆవాన్ కరుదాదు ఓర్ పెణ్ కొడియై
వదై శెయ్దాన్ ఎన్నుం శొల్ వైయగత్తార్ మదియారే
ఆహ్లాదంగా తిరువెంగడ కొండలను నివాసముగా చేసుకొని మద్ద గజములలా ఉప్పొంగుతూ విలసిస్తున్న ఓ ప్రియమైన మేఘాలారా! ఆదిశేషునిపై పవ్వళించి ఉన్న ఆ ఎంబెరుమానుని సంగతి ఏమిటి! ఆతడు నన్ను ఇలానే నిర్లక్ష్యము చేస్తే, “సర్వ రక్షకుడైన ఆతడి స్వభావానికి మచ్చ కలిగిస్తుందని ఆలోచించకుండా ఒక అమ్మాయిని చంపాడు” అని ఈ ప్రపంచ ప్రజలు అనరా?
పదవ పాశురము: ఈ పది పాశురములను వారి మనస్సులో ధ్యానం చేస్తూ ఆస్వాదించేవారు ఆ భగవానుడి సేవకులై ఉన్నత స్థితికి చేరుకుంటారు అని తెలియజేస్తూ పదిగాన్ని ముగిస్తుంది.
నాగత్తిన్ అణైయానై నన్నుదలాల్ నయందురై శెయ్
మేగత్తై వేంగడక్కోన్ విడు తూదిల్ విణ్ణప్పం
బోగత్తిల్ వళువాద పుదువైయర్కోన్ కోదై తమిళ్
ఆగత్తు వైత్తు ఉరైప్పార్ అవర్ అడియార్ ఆగువరే
అందమైన దివ్య నుదురు, అందమైన దివ్య శ్రీ ముఖం ఉన్న ఎంబెరుమానుని పెరియాళ్వార్ల కుమార్తె అయిన ఆండాళ్ ఆనందించింది. ఆదిశేషుడు శయ్యగా ఉన్న భగవానుని ఆండాళ్ కోరుతూ, మేఘాలను దూతలుగా ఉపయోగించి ఈ పది పాశురములను దయతో మనకందించింది. ఈ తమిళ పాశురములను తమ హృదయాలలో ఉంచుకుని, వాటిని పఠించగల సామర్థ్యం ఉన్నవారు ప్రతిరోజూ కైంకర్యాలు చేస్తూ ఆతడి దాసులుగా ఉంటారు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-8-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org