శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
మణవాళ మాముణులు ఆండాళ్ మహిమని తమ ఉపదేశ రత్నమాల ఇరవై నాలుగవ పాశురంలో అద్భుతముగా వర్ణించారు.
అంజుకుడిక్కు ఒరు సన్దదియాయ్ ఆళ్వార్గళ్
తమ్ శెయలై వింజి నిఱ్కుం తన్మైయళాయ్ – పింజాయ్
ప్పళుత్తాళై ఆణ్డాళై ప్పత్తియుడన్ నాళుం।
వళుత్తాయ్ మనమే మగిళ్ందు॥
ఆళ్వార్ల వంశంలో ఏకైక వారసురాలిగా ఆండాళ్ అవతరించింది. ద్రావిడ భాషలో ‘అంజు’ అనే పదానికి ‘ఐదు’ అని అర్థం, అలాగే ‘భయాన్ని’ కూడా సూచిస్తుంది. మొదటి తాత్పర్యము – ఐదు పాండవుల వంశానికి పరీక్షితుడు ఒక్కడే వారసుడు ఉన్నట్లుగా, ఆళ్వార్ల వంశానికి ఆండాళ్ మాత్రమే వారసురాలు అని ఒక అర్థాన్ని సూచిస్తుంది. రెండవ తాత్పర్యములో – ఎంబెరుమానుడికి ఏమి హాని జరుగుతుందో అనే భయంతో ఉండే ఆళ్వార్ల వంశానికి ఆండాళ్ మాత్రమే వారసురాలు అని ఇంకొక అర్ధము. భగవానుడు చిరకాలము చల్లగా వర్ధిల్లాలని పెరియాళ్వార్లు ఎల్లప్పుడూ భగవానుడికి మంగళాశాసనం పాడుతూ ఉండేవారు. మిగతా ఆళ్వార్లందరూ పరమభక్తి స్థితిలో (భగవానుడు లేకుండా ఉండలేని స్థితి) మునిగి ఉండేవారు. పెరియాళ్వార్ల మాదిరిగానే ఆండాళ్ కూడా భగవానుడికి మంగళాశాసనం పాడుతూ ఉండి ఇతర ఆళ్వార్ల లాగా భక్తిలో అసాధారణమైన ఎత్తుకి ఎదిగింది. ‘పింజాయ్ ప్పళుత్తాళై’ అనే పదం చిన్న వయసులోనే ఒక వ్యక్తి పొందిన పరిపక్వత స్థితి అన్న అర్థాన్ని సూచిస్తుంది. సాధారణ మొక్కలలో మొదట పువ్వు వికసిస్తుంది, అది కాయగా మారి తరువాత పండుగా మారుతుంది. కానీ తుళసి మొక్క, భూమిలో నుండి మొలకెత్తు తుండగానే సువాసనను వెదజల్లుతుంది. ఆండాళ్ రెండవ కోవకు చెందినది. మరో మాటలో చెప్పాలంటే, అతి చిన్న వయసులోనే ఆమె భక్తి సాగరములో మునిగి ఉండేది. ఆమె కేవలం ఐదు సంవత్సరాల వయస్సులోనే తిరుప్పావై ముప్పై పాశురములను రచించింది. నాచ్చియార్ తిరుమొళిలో ఎంబెరుమానుని పొందాలనే వేదనలో ఆమె కరుగుతుంది. ఓ నా మనసా! అటువంటి ఆండాళ్ అమ్మని అన్ని వేళలా కీర్తించి స్తుతించుము.
ఆమె వ్రాసిన తిరుప్పావైలో, ఆమె భగవానుడే ఉపాయం (అతన్ని పొందే సాధనం) మరియు ఉపేయం (అతడిని పొందిన తర్వాత దొరికే ఆనందం) అని నిశ్చయించింది. ఎంబెరుమానుడు వచ్చి ఆమెను చేపట్ట లేదని, తీవ్ర విరహవేదనతో, ఎంబెరుమానుని పొందాలనే తీవ్ర ఆశతో, నాచ్చియార్ తిరుమొళి అనే ఈ అద్భుతమైన ప్రబంధాన్ని ఆండాళ్ రచించింది.
ప్రతి పదిగం (దశాబ్దం) చివరిలో ఆమె తనను తాను విట్టుచిత్తన్ కోదై మరియు బట్టర్‌పిరాన్ కోదై (పెరియాళ్వార్ల కుమార్తె) గా గుర్తిస్తూ, పెరియాళ్వార్లకి దాసియని చాటుతుంది. ఎంపెరుమానుడు పెరియాళ్వార్ల కోసము తనని స్వీకరిస్తే నేను స్వాగతిస్తాను అని ఆమె తన ఆచార్య నిష్ఠలో (ఆచార్యుల అధీనులై ఉండే స్థితి) ఉన్న స్థితిని వెల్లడించింది. భగవానుడితో సన్నిహిత సంబంధాన్ని వ్యక్తం చేస్తూ భూమి పిరాట్టి (భూదేవి) యొక్క పునః అవతారముగా, ఆమె మనల్ని భక్తి పారవశ్యంలో మునిగిపోయేలా చేస్తుంది.
ఈ సరళ వివరణ పెరియవాచ్చాన్ పిళ్ళై యొక్క వ్యాఖ్యానానికి పుత్తూర్ స్వామివారు అనుగ్రహించిన వివరణ సహాయంతో వ్రాయబడింది.
- తనియన్లు
- మొదటి తిరుమొళి – తైయొరు తింగళ్
- రెండవ తిరుమొళి – నామం ఆయిరమ్
- మూడవ తిరుమొళి – కోళి అళైప్పదన్
- నాలుగవ తిరుమొళి – తెళ్ళియార్ పలర్
- ఐదవ తిరుమొళి – మన్ను పెరుం పుగళ్
- ఆరవ తిరుమొళి – వారణం ఆయిరమ్
- ఏడవ తిరుమొళి – కరుప్పూరం నాఱుమో
- ఎనిమిదవ తిరుమొళి – విణ్ణీల మేలాప్పు
- తొమ్మిదవ తిరుమొళి – శిందుర చ్చెంబొడి
- పదవ తిరుమొళి – కార్కొడల్ పూక్కాళ్
- పదకొండవ తిరుమొళి – తాముగక్కుం
- పన్నెండవ తిరుమొళి – మఱ్ఱిరుందీర్గట్కు
- పదమూడవ తిరుమొళి – కణ్ణన్ ఎన్నుం
- పది నాలుగవ తిరుమొళి – కణ్ణన్ ఎన్నుం
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
God
Dasoham
Dasohamamma