ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఇతర ప్రబంధములు

పిళ్ళై లోకాచార్యులు మణవాళ మహాముణులు (శ్రీపెరుంబుదూర్)
పిళ్ళై లోకాచార్యులు మణవాళ మహాముణులు (శ్రీపెరుంబుదూర్)

ఉపదేశ రత్తినమాలై అను ఈ తమిళ దివ్య ప్రబంధము మకుఠములో రత్నమువలే ప్రకాశించే  “విశదవాక్ శిఖామణి” అను బిరుదాంకితులైన మణవాళ మహాముణుల ముకారవిందము నుంచి వెలువరింపబడిన దివ్య వాక్సుధ. ఈ ప్రబంధము పిళ్ళలోకాచార్యుల శ్రీవచన భూషణ గ్రంధమును సూక్షముగా తెలియ చేస్తుంది మరియు దీనియొక్క సారాంశం ఏమిటంటే ఆచార్య అభిమానమే శిష్యునికి ఉధ్ధారకం. ఆచార్య సేవయే పరమావదిగా బావించు శిష్యునకు ఆచార్యాభిమానమే ఉద్దారకము, ఉజ్జీవనము మరియు పరమోపకారమని అంతయేకాక ఇదియే శిష్యునకు సులభమైన మరియు శ్రేష్ఠమైన మార్గమని పూర్వాచార్యల అభిమతము/శ్రీసూక్తి.
జీవనము అనగా భౌతిక శరీరమును పోషించుట మరియు కాపాడుట.
ఉజ్జీవనము అనగా ఆత్మను ఉధ్ధరింపజేసుకొనుట అని అర్థము. ఆత్మకు ఎమ్పెరుమాన్ (పరమాత్మ/ శ్రీమన్నారాయణ) ని పొందుటయే స్వరూపం. తద్వారా ఆత్మకు పరమపదము (వైకుంఠము) లో దాస్యము/కైంజ్ఞ్కర్యములు చేయుటయే కోరదగినది.

ఈ గ్రంథములోని పదముల అర్థములను చెప్పుటయనగా తత్సంబంధ విషయార్థ వివరణమని అర్థం. ఆక్రమములో :-
1. ఆచార్య వందనం (తిరువాయ్మొళి పిళ్ళై), 2.ఆళ్వార్ల అవతార క్రమము మరియు వారి అవతార స్థలముల విశేషణమలు, 3.ఆళ్వార్లు చూపిన మార్గమును అన్వయించిన ఆచార్య పురుషుల పరిచయము, 4. ఆచార్యులందరిలోకీ ఉత్తమోత్తములు, జగదోద్ధారకులు, జగదాచార్యులు మరియ ఎవరి సాంప్రదాయానకి “ఎమ్పెరుమాన్ దర్శనము” అని ఈ సాంప్రదాయానికి నంపెరుమాళ్ (శ్రీరంగ దివ్యదేశ ఉత్సవమూర్తి) పేరు పెట్టి ఎవరి కీర్తిని ఇనుమడింప చేశారో అటువంటి మన ఉడయవర్/లక్ష్మణముని/భగవద్రామానుజుల పరిచయము,
5. నంపెరుమాళ్( శ్రీరంగ దివ్యదేశ ఉత్సవమూర్త) యొక్క విశేషణములు మరియు ప్రాముఖ్యత.
6. మన సాంప్రదాయమునకు మూలమైన నమ్మాళ్వారిచే రచింపబడిన తిరువాయ్మొళికి గల వ్యాఖ్యానముల వివరణ,
7. నంబిళ్ళై (ప్రముఖ పూర్వాచార్య పరంపరలోని వారు) ప్రాముఖ్యమును విశదీకరించుట,
8. వడక్కుతిరివీధి పిళ్ళై కుమారులైన పిళ్ళైలోకాచార్య దయతో కృపచేయబడిన శ్రీవచన భూషణ గ్రంథ ప్రాశస్త్యము, రహస్యార్థాలు మరియు దానిని అన్వయించిన/పాటించిన వారియెక్క కీర్తి ప్రతిష్ఠల వివరణలు, మరియు
9. ఈ గ్రంథము ముగింపులో మనము ప్రతి నిత్యము మన పూర్వచార్యులను మరియు వారి అనుష్ఠించిన విధివిహిత (వేదానుసారక) ములను స్మృతిలో/మనసులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తారు. అంతయేకాక అటువంటి వారే ఈ లోకాన్ని ఉధ్ధరించడానికి అవతరించిన జగదాచార్యులైన భగవద్రామానుజ/ఎంబెరుమానారుల కృపకు పాత్రులు కాగలరని ఉధ్బోదిస్తారు.

ఈ గ్రంథము చివరన ఎఱుంబి అప్పాచే చెప్పబడిన ఒక పాశురమును కూడా అనుసంధానం చేస్తారు. ఎవరైతే మణవాళ మహామునుల శ్రీపాద సంబంధము కలిగి ఉన్నారో వారిని ఎమ్పెరుమాన్ తప్పక స్వీకరిస్తారని ఎఱుంబి అప్పా ఈ పాశురము ద్వారా తెలియజేసారు.

అడియేన్ వేదగోపురం వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు

హిందీలో : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-simple/

మూలము : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment