ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 34 – 35

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<< గతశీర్షిక

పాశురము 34

ముప్పది నాల్గవ పాశురము. మామునులు కృపతో ఇప్పటి వరకు ఆళ్వార్ల తిరునక్షత్రములు మఱియు వారి తిరు అవతార స్థలములను వివరించినారు. ఈ మూడవ పాశురములో పూర్వాచార్యుల దివ్యచేష్టితములు “తాళ్వాదుయిల్ కూరవర్ తామ్ వాళి – ఏళ్ పారుమ్ ఉయ్య అవర్ గళ్ ఉరైత్తవైగళ్ తామ్ వాళి” అని మంగళాశాసనము చేయుచున్నారు. ఇప్పుడు పూర్వాచార్యులు ఆళ్వార్లు కృపచేసిన దివ్య ప్రబంధములకు చేసిన వ్యాఖ్యానముల గురించుటకై సంకల్పము చేయుచున్నారు.

ఆళ్వార్ గళేత్తుమ్ అరుళిచ్చెయలేత్తుమ్!
తాళ్వాదుమిన్ఱి యవైదాన్ వళర్తోర్ * ఏళ్ పారుమ్
ఉయ్య అవర్ గళ్ శెయ్ద వియాక్కియైగళ్ ఉళ్ళదెల్లామ్!
వైయ మఱియ ప్పగర్వోమ్ వాయ్ న్దు!!

ఆళ్వార్ల యొక్క ప్రత్యేక కీర్తి మఱియు వారి యొక్క కృపా రూపములైన ప్రబంధములకు ఎటువంటి కొరత మరియు కీంచిత్ దోషము కూడా లేని విధముగా యావత్ ప్రపంచము ఉజ్జీవించే విధముగా వ్యాఖ్యానములను కృప చేసినారు.

ఆళ్వార్లు ఎంబెరుమాన్ యొక్క నిర్హేతుక కృప వలన జ్ఞాన భక్తులను పొందినవారు. వారి యొక్క రచనలు సులభ శైలిలో వేదార్థములను వివరించుట మఱియు ఎంబెరుమాన్ విషయము తప్ప వేరే ఏ ఇతర విషయములను ప్రస్తావించకుండుట. మన పూర్వాచార్యులు లోకోజ్జీవనమునకు మాత్రమే అంకితమై ఎంబెరుమాన్ ను ధ్యానించుట కైంకర్యము చేయుట తప్ప నీఛమైన ఐహిక సాధనములైన కీర్తి, సంపత్తి, వారి వ్యక్తిగత ప్రతిష్ఠల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.

పాశురము 35

ముప్పదైదవ పాశురము. మామునులు తన మనస్సునకు ఏమి చెప్పుతున్నారంటే ఆళ్వార్లు మఱియు వారి కృతుల యొక్క గొప్పతనమును తెలుసుకొనక అవమానించువారు అల్ప జ్ఞానులు/నీఛులు.

ఆళ్ వార్గళైయుం! అరుళిచ్చెయల్ గళైయుం!
తాళ్ వాగ ననైప్పవర్ గళ్ దామ్! నరకిల్
వీళ్వార్గళెన్ఱు నినైత్తు నెఞ్జే! యెప్పొళుదుం నీ అవర్ పాల్!
శెన్ఱణుగక్కూశిత్తిరి!!

ఓ మనసా! చాలా గొప్పవారైన ఆళ్వార్లు మరియు వారి అతి విలక్షణమైన రచనలను తక్కువగా చూసేవారు నరమునకు వెళ్తారని తలచి అటువంటి వారి సమీపమునకు పోకుండుట, వారి సహవాసము చేయకుండుట మనకు ఉత్తమమని తలచి వారికి దూరముగా మసులుము.

ఎంబెరుమాన్ నకు అత్యంత ప్రీతిపాత్రులైన ఆళ్వార్లు ఈ లోకంలో అవతరించి అందరినీ ఉజ్జీవింపబడే మార్గమును చూపినారు. వారు పుట్టిన కులమునో లేక వారు పాడిన ప్రబంధములు తమిశ భాషలోనే ఉన్నాయనో తక్కువగా తలచేవారిని, ఎంబెరుమాన్ తాను క్షమించక పోవడమే కాకుండా నరకములో తోసేస్తాడు. ఈ విధముగా ఉండుటచే నీవు వారితో ఉండగవలవా? అందువలన నీవు వారి సమీపమునకు పోవుట సహవాసము చేయుట మనకు తగదని తలచి దూరముగా ఉండుము.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-34-35-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment