ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 64 – 65

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<< గతశీర్షిక

పాశురము 64

ఈ పాశురములో ఆచార్యులే ప్రాప్యమని వారిని పొంది వారితో సహవాసము చేస్తూ ఉజ్జీవింప దలచినచో వారిరువురను విడదీయు వారెవరును ఉండరనీ కృపచేయు చున్నారు.

తన్నారియనుక్కు త్తాన్ అడిమై శెయ్ వదు* అవన్ ఇన్నాడుదన్నిల్ ఇరుక్కుమ్ నాళ్! అన్నేర్ అఱిన్దుం అదిలాశై యిన్ఱి ఆశారియనై ప్పిఱిన్దిరుప్పారార్?* మనమే పేశు!!

ఓ మనసా! శిష్యుడు తమ ఆచార్యునికి కైజ్ఞ్కర్యములు చేయగలిగిన భాగ్యము ఆచార్యులు ఈ లోకములో ఉన్నంతవరకే అనునది బాగుగా తెలుసుకొనిన పిదప దానియందు ఆశ లేకుండగా ఏ శీష్యుడు తమ ఆచార్యుని విడిచి ఉండగలడు? నీవే చెప్పుమా!

ఆచార్యుడు ఈ లోకములో ఉన్నంత కాలము వరకే ఏ శిష్యుడైనా తన ఆచార్యునికి ప్రత్యక్షముగా/నేరుగా కైజ్ఞ్కర్యములు చేయగలడు. ఆచార్యుడు పరమపదము చేరినచో శిష్యుడు నేరుగా తన ఆచార్యునికి కైజ్ఞ్కర్యములు చేయు భాగ్యమును కోల్పోతాడు. అందువలన ఆచార్యుడు ఈ లోకములో ఉన్నంత కాలము ఆచార్య కైజ్ఞ్కర్యమునందే శిష్యుడు అభినివేశము కలిగి ఉండాలి. మునుపటి పాశురముల వివరణములలో చూపిన ప్రకారముగా మణవాళమామునులు దీనిని సంపూర్ణముగా అనుష్ఠించినారు. మన పూర్వచార్యులందరూ ఆచార్య కైజ్ఞ్కర్యము నందు నిష్ఠకలిగినవారే.

పాశురము 65

ఈ పాశురములో ఆచార్యుడు, శిష్యుడు నిర్వహించవలసిన కార్యములను చూపి వాటిని ఆచరణలో చూపుటెట్లో అనుగ్రహించుచున్నారు.

ఆశారియన్ శిచ్చనారుయిరై ప్పేణుమవన్! తేశారుమ్ శిచ్చన్ అవన్ శీర్ వడివై* ఆశైయుడన్ నోక్కుమవనెన్నుమ్ నుణ్ణరివై క్కేట్టువైత్తుమ్! ఆర్కుమ్ అన్నేర్ నిఱ్కై అరిదామ్!!

ఆచార్యుడు శిష్యుని యొక్క విలువైన ఆత్మను తమ ఉపదేశము,అనుష్ఠానముల ద్వారా రక్షిస్తాడు. ఆచార్యుని చేత జ్ఞాన తేజస్సును పొందిన శిష్యుడు తమ ఆచార్యులు “ఎంబెరుమానుచే అభిమానింప బడిన వారని” సర్వదా భావించి ఆచార్యుని తిరుమేని/శరీరమును తన కైజ్ఞ్కర్యములచే రక్షింపవలెను. ఈ విశేష విషయము అర్థసహితముగా పెద్దల వద్ద ఉపదేశ పరంపరగా వినినప్పటికినీ, వినుటకు మంచిగా ఉన్నప్పటికినీ, దీని ప్రకారము నడుచుకొనుట చాలా అరుదు.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్ 🙏

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-64-65-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment