ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 7-9

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

గతాశీర్షిక

పాశురం 7

ఏడవ పాశురంలో మొదలాళ్వార్లనే పేరు ఎందుకు వచ్చినదో తెలుపుతున్నారు.

మత్తుళ్ళ ఆళ్వార్ గళుక్కు మున్నే వన్దుదిత్తు! నల్ తమిళాల్ నూల్ శెయుదునాట్టై యుయ్ త్తు * పెత్తిమైయోర్ ఎన్ఱు ముదలాళ్వార్ గళ్ ఎన్నుమ్ పేర్ ఇవర్కు! నిన్ఱదులగత్తే!నిగళ్ న్దు!!

వీరు ముగ్గురూ మిగిలిన ఆళ్వార్లకంటే ముందుగా అవతరించి తమిళభాషలో ఈ జగత్తును ఉజ్జీవింప చేయుటకై తమ ప్రబంధములను కృప చేయుటచే వారు ముదలాళ్వార్లనే సార్థక నామదేయులైనారు.

పాశురం 8

ఎనిమదవ పాశురములో మొదలే చెప్పనట్లుగా ఆళ్వార్ల అవతార క్రమముననుసరించి ఆశ్వీజమాసము తర్వాత వచ్చు కార్తీక కృత్తికా నక్షత్రము రోజున అవతరించిన తిరుమంగై ఆళ్వార్ల వైభవమును రెండు పాశురములలో తెలుపుచున్నారు. దానిలో మొదటగా తిరుమంగై ఆళ్వార్ల తిరునక్షత్ర ప్రాశస్త్యమును తన మనసునకు వివరించుచున్నారు.

పేదైనెజ్ఞై! ఇన్ ఱై ప్పెరుమై అఱిన్దిలైయో! ఏదు ప్పెరుమై ఇన్ఱై క్కెన్నెన్నిల్ * ఓదుగిన్ఱేన్ వాయ్ త్తపుగళ్ మంగైయర్ కోన్ మానిలత్తిల్ వన్దుదిత్త! కార్తిగైయిల్ కార్తిగై నాళ్ కాణ్!!

ఓ అజ్ఞాన మనసా! ఈ రోజు యొక్క  ప్రాముఖ్యత తెలుసా? నేను చెప్పెదను వినుము. కార్తీక మాసములోని కృత్తికా నక్షత్రముననే తిరుమంగై ఆళ్వార్ ఈ విశాల ప్రపంచమున అవతరించినారు.

పాశురం 9

ఈ పాశురములో నమ్మాళ్వార్లకు మరియు తిరుమంగై ఆళ్వార్లకు మధ్య ఉన్న సంబంధమును గురించి వివరించుచున్నారు. ఈ రోజును ఎవరైతే ప్రశంశిస్తారో వారి శ్రీపాదములను సదా కీర్తించమని తమ మనస్సనకు చెప్పుచున్నారు.

మాఱన్ పణిత్త తమిళ్ మఱైక్కు మంగైయర్ కోన్! ఆఱంగంకూఱ అవదరిత్త  వీఱుడైయ కార్తిగైయిల్ కార్తిగైనాళ్ ఎన్ఱెన్ఱు కాదలిప్పార్! వాయ్ త్త మలర్ తాళ్ గళ్ నెఞ్జే! వాళ్ త్తు!!

ఓ మనసా నాలుగు వేదములకు సమమైన నాలుగు ప్రబంధములను నమ్మాళ్వార్లు పరమ కృపతో సాయించగా, వేదములకు ఏ విధముగా ఆరు అంగములు కలవో ఆ రీతిన నమ్మాళ్వార్ల నాలుగు ప్రబంధములకు ఆరు అంగములుగా ఆరు ప్రబంధములను కృప చేయుటకై కార్తీక మాస కృత్తికా నక్షత్రము సుదినమున తిరుమంగై ఆళ్వార్లు అవతరించినారు. అందు చేత ఓ మనసా ఎవరైతే ఈ సుదినమును ప్రశంసిస్తారో వారి శ్రీపాదములను ఆశ్రయింపుము.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-7-9-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *