ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 48 – 49

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<< గతశీర్షిక

పాశురము 48

నలబై ఎనిమిదవ పాశురము. ఈ నలబై ఎనిమిదవ పాశురములో ఈ విధముగా వ్యాఖ్యానములు కృప చేసిన పిదప రెండు పాశురములలో ఈడు వ్యాఖ్యానము నందు గల నంబిళ్ళై యొక్క ఉత్తమమైన రెండు శ్రీసూక్తుల చరిత్రమును కృప చేయుచున్నారు.

శీరార్ వడక్కుత్తిరువీదిపిళ్ళై ఎళు
దేరార్ తమిళ్ వేదత్తు ఈడుతనై  తారుమెన
వాజ్గి మున్ నమ్బిళ్ళై ఈయుణ్ణిమాధవర్కు।
త్తామ్ కొడుత్తార్ పిన్నదనైత్తాన్॥

ఆచార్యుల కృప వలన లభించిన జ్ఞాన పూర్తి వలన తద్వారా కలిగిన కీర్తిని పొందిన వడక్కుత్తిరువీధి పిళ్ళై రచించిన తమిళ్ వేదమైన తిరువాయ్ మొళికి అర్థములను విపులమైన/విస్తారమైన వివరణతో కూడిన, ఘనకీర్తిని కలిగిన, ఈడు వ్యాఖ్యానమును నంబిళ్ళై ‘”దీనిని ఇప్పుడు బహిర్గతము చేయుటకు సరియైన సమయము కాదని తదనంతర కాలములో ఒక మహనీయుని మూలముగా చక్కగా ప్రచారము చేయబడి మహోన్నతమైన స్థనమును పొందును” అని చెప్పి, కావున దానిని తనకిమ్మనెను. ఆ విధముగా ముందుగానే తీసుకొని దానిని తన ప్రియ శిష్యులైన ఈయుణ్ణి మాధవర్ నకు అందించి దీనిని రహస్యముగా/గోప్యముగా తమ శిష్యులకు అర్థ విశేషములతో ఉపదేశము చెయమని ఆజ్ఞాపించినారు.

తదనంతర కాలములో మణవాళ మామునులు తమ ఆచార్యలైన తిరువాయ్ మొళి పిళ్ళై ద్వారా దానిని పొంది ప్రపంచ వ్యాప్తముగా తెలుసుకొను విధముగా చేసినారు.

తదనంతర కాలములో ఒక సంవత్సర కాలము శ్రీరంగం పెరియ కోయిల్ లో నంబెరుమాళ్(శ్రీరంగనాధుడు) అనుగ్రహముతో నంబెరుమాళ్ మఱియు వారి పరివారముతో సహా దానిని విని ఆనందించిరి. అంతయేకాక నంబెరుమాళ్ మణవాళ మామునులను తమ ఆచార్యులుగా స్వీకరించి దానికి తార్కారణముగా “శ్రీశైలేశ దయా పాత్రం ధీభక్త్యాది గుణార్ణవం …..” అను తనియన్ని కృప చేసి దానిని సేవాకాలము ఆరంభ మఱియు ముగింపు సమయములందు తప్పనిసరిగా అనుసంధానము చేయవలెనని ఆజ్ఞాపించినారు. ఈ విశేషము లోక విదితము.

పాశురము 49

నలబై తొమ్మిదవ పాశురము. ఈ పాశురములో ఈడు వ్యాఖ్యానము ఏ విధముగా తమ అచార్యులైన తిరువాయ్ మొళి పిళ్ళై వరకు వచ్చినదో తెలియబరుచుచున్నారు.

ఆజ్ఞ్గవర్ పాల్ పెత్త శిఱియాళ్వాన్ అప్పిళ్ళై।
తామ్ కొడుత్తార్ తమ్ముగనార్ తం కైయిల్ పాజ్ఞ్గుడనే
నాలూర్ పిళ్ళైక్కు అవర్ దామ్ నల్లమగనార్కు అవర్ దామ్
మేలోర్కు ఈన్దార్ అవరే మిక్కు॥

శిరియాళ్వాన్ అప్పిళ్ళై అనబడే ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ నంబిళ్ళై వద్దనున్న ఈడు వ్యాఖ్యానము తమ కుమారులైన ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ నకు బాగుగా నేర్పించినారు. వీరు పెరుమాళ్ కోయిల్ అనబడే కాంచీపురములో నివాసమున్న కాలములో నాలూర్ పిళ్ళాన్ వీరి తిరువడిగళులందు బహు కైజ్ఞ్కర్యములు చేయుచూ వీరి అభిమానమునకు పాత్రులై వీరి నుంచి ఈడు వ్యాఖ్యనమును నేర్చుకొనినారు. తర్వాత వీరి యొక్క కుమారులైన నాలూరాచ్చాన్ పిళ్ళాన్ నకు నేర్పినారు. ఆళ్వార్ తిరునగరి దివ్యదేశమునగల పొలిందు నిన్ఱ పిరాన్, నమ్మాళ్వార్ సన్నిధులను పునర్నిర్మాణము చేసి, భవిష్యదాచార్యులైన ఎంబెరుమానారునకు ఒక తిరుక్కోయిల్ నిర్మించి పల కైజ్ఞ్కర్యములు చేస్తూ వచ్చిన తిరువాయ్ మొళి పిళ్ళై ఈడు వ్యాఖ్యానమును నేర్చుకోవాలనే ఆశతో కాంచీపురమునకు రాగా దేవ పెరుమాళ్ తామే ఆజ్ఞాపింపగా నాలూరాచ్చాన్ పిళ్ళై తిరువాయ్ మొళి పిళ్ళైనకు, తిరువాయ్ మొళి ఆచ్చాన్ నకు, ఆయి జనన్యాచార్యునకు తిరునారాయణపురము నందు బోధించినారు. ఈ విధముగా తిరువాయ్ మొళి పిళ్ళై ఉపదేశముగా పొందిన ఈడు వ్యాఖ్యానమనే గొప్ప నిధిని మణవాళ మామునులునకు అందించినారు.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-48-49-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment