ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 29 – 30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<< గతశీర్షిక

పాశురము 29

ఈ పాశురములో మామునులు చైత్రమాస ఆరుద్రా నక్షత్రముతో కూడిన శుభదిన వైభవమును ఎల్లవేళలా స్మరిస్తూ ఉండమని తన మనస్సునకు ఉద్దేశించి కృప చేయుచున్నారు.

ఎందై ఎతిరాశర్ ఇవ్వులగిల్ ఎన్దమక్కా
వన్దుదిత్త నాళెన్నుమ్ వాశియినాల్ ఇన్ద
త్తిరువాదిరై దన్నిన్ శీర్మదనై నెఞ్జే!
ఒరువామల్ ఎప్పొழுదుమ్ ఓర్!!     

క్రిందటి పాశురములలో లోకమునకు ఉపదేశించిరి. ఈ పాశురములో తానే ఈ శుభదినము యొక్క వైభవ ప్రభావమునకు ఆకర్షతులై దానిని అనుభవించుచున్నారు. ఎంబెరుమానార్ తామే “అఖిల జగత్ స్వామిన్! అస్మత్ స్వామిన్” (సకలలోకములకు నాధనే! నాకూ నాధనే) అని ఎంబెరుమాన్ విషయముగా శ్రీగద్యత్రయములో అనుభవించిన విధముగా, వీరునూ రాబోవు పాశురములలో ఎంబెరుమానార్ ఈ ప్రపంచమునకు చేసిన ఉపకారమును అనుభవిస్తూ, ఈ పాశురములో తమకు చేసిన ఉపకారమును అనుభవిస్తున్నారు.

పాశురము 30

ఇంతకు పూర్వము ఆళ్వార్ల అవతారదినములను కీర్తించినారు. ఇక నాలుగు పాశురములలో వరుసగా వారి అవతార స్థలమును కీర్తస్తున్నారు. ఈ పాశురములో మొదలాళ్వార్ల, తిరుమంగై ఆళ్వారు మఱియు తిరుప్పాణ్ ఆళ్వార్ల అవతార స్థలములను గురించి కృప చేయుచున్నారు. శ్రీ అయోధ్యా, శ్రీ మధురా మొదలగునవి ఎంబెరుమాన్ అవతరించిన దివ్య క్షేత్రములు. వీటికి ఎటువంటి కీర్తి గలదో అదేవిధంగా కీర్తి కలిగినవి ఆళ్వార్లవతరించిన ప్రదేశములు ఏలననగా ఆళ్వార్లవతరించుట వలననే మనము ఎంబెరుమాన్ ను తెలుసుకొనగలుగుచున్నాము.

ఎణ్ణరుమ్ శీర్ పొయ్గై మున్నోర్ ఇవ్వులగిల్ తోన్ఱియ ఊర్! 
వణ్మై మిగు కచ్చి మల్లై మామయిలై మణ్ణియిల్ నీర్
తేజ్ఞ్గుమ్ కుఱైయలూర్ శీర్ కలియన్ తోన్ఱియ ఊర్! 
ఓజ్ఞ్గుమ్ ఉఱైయూర్ పాణనూర్ !!

లెక్కింపనలవిగాని కల్యాణ గుణములు కలిగిన వారు ముదలాళ్వార్లు. అదే విధముగా పొయిగై, పూదత్త మరియు పేయాళ్వార్లు అవతరించిన ప్రదేశములు తరతరాలుగా చాలా విశిష్టతను కలిగిన కాంచీపురం (తిరువెక్కా), తిరుకడల్ మల్లై (ప్రస్తుతం మహాబలిపురం) మఱియు తిరుమయిలై మొదలగునవి. స్వచ్ఛమైన నీటి సమృద్ధి కలిగిన తిరుక్కురయలూర్ గొప్ప కీర్తి గల తిరుమంగై ఆళ్వార్ల అవతార స్థలము. అదే విధముగా గొప్ప స్థితిని కలిగిన తిరుక్కొళి అని పిలువబడే తిరువురైయూర్ తిరుప్పాణాళ్వార్ల అవతార స్థలము.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-29-30-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment